E-Paper
Advertisement

Patang Movie Review : పతంగ్ మూవీ రివ్యూ.. ప్రేమ గొప్పదా? స్నేహం గొప్పదా?

Patang Movie Review : పతంగ్ మూవీ రివ్యూ.. ప్రేమ గొప్పదా? స్నేహం గొప్పదా?
Advertisement

Patang Movie Review : దాదాపు అర డజన్ కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రోజు. దాదాపు అన్నీ కూడా సీరియస్ జానర్‌లోనివే. కానీ, ఇక్కడ ఓ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఉంది అదే ‘పతంగ్’. అలాంటి ప్రత్యేకతతో క్రిస్మస్ పోరులో ఉన్న పతంగ్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

హైదరాబాద్ గల్లీల్లో ఉండే విస్కీ (వంశీ పూజిత్) – రిచ్ కిడ్ అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. విస్కీ తన లవర్ అంటూ ఐశ్వర్య (ప్రీతి పగడాల) తన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తాడు. అయితే.. క్రమంగా అరుణ్ – ఐశ్వర్య ప్రేమలో పడుతారు. దీంతో విస్కీ – అరుణ్ విడిపోతారు. మరి ఐశ్వర్య ఎవరికి దక్కింది? ఐశ్వర్యను దక్కించుకోవడానికి పతంగ్ పందాన్ని విస్కీ – అరుణ్ ఎలా ఆడారు? దాంట్లో ఎవరు గెలిచారు? చివరికి ఐశ్వర్యను ఎవరు దక్కించుకున్నారు అనేది సినిమా స్టోరీ.

విశ్లేషణ :

Advertisement

తెలుగులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాలు ఇప్పటి వరకు చాలా వచ్చాయి. ప్రేమదేశం, ఆర్య, ఆర్య 2 ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పతంగ్ మూవీ కూడా అదే స్టోరీ. ఈ పతంగ్ మూవీ వాటిలా కాదు.. కాస్త కొత్తగా.. ఇప్పటి జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు ఫ్రెష్ ఫీల్ ఉంటుంది.

ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ను చూపించడం.. తర్వాత ఇద్దరి మధ్య ప్రేమను కూడా చూపించడం.. చూస్తే ఈ జనరేషన్ ఆడియన్స్‌ను సినిమాకు కనెక్ట్ చేయాలి అని డైరెక్టర్ ఎంత బలంగా ప్రయత్నించాడో అర్థమైపోతుంది. విస్కీ – అరుణ్ గ్యాంగ్‌తో క్రియేట్ చేసిన కామెడీ కూడా బాగా వర్కౌంట్ అయింది.

Advertisement

ఫస్టాఫ్‌లో డైరెక్ట్ పాత్రలను పరిచయం చేసి.. తర్వాత లవర్ అంటూ ఐశ్వర్యను తీసుకొచ్చి నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. ఇంటర్వెల్‌తో ఓ ట్విస్ట్‌తో ఎక్కడా బోరింగ్ లేకుండా… ఎంటర్‌టైన్ చేస్తూ.. ఈజ్‌గా ముగించేశాడు ఫస్టాఫ్‌ను. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సెకండాఫ్‌లో కాస్త ల్యాగ్ సన్నివేశాలు పడ్డాయి. అలా సాగుతూ ఉంది అని అనుకుంటున్న టైంలో కొన్ని కామెడీ సీన్స్ ఉపశమనం ఇచ్చినా… క్లైమాక్స్ పతంగ్‌ల పోటీతో సినిమా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. పతంగ్‌ల పోటీ ఎపిసోడ్ మొత్తం కొత్తగా, కామెడీగా ఉంది. సుధీర్ఘంగా ఉన్నా.. డైరెక్టర్ బానే మ్యానేజ్ చేశాడు. కొన్ని సీన్స్‌లో వచ్చే ఎమోషన్స్ కూడా బానే కుదిరాయి.

ఇక సినిమా క్లైమాక్స్‌లో ప్రేమ గొప్పదా.. స్నేహం గొప్పదా.. అనే దానికి ఈ జనరేషన్ వాళ్లకు ఓ మెసెజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు.

నటన విషయానికొస్తే, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరితో పోటీ పడి మరీ నటించింది ప్రీతి పగడాల. అలాగే సినిమాలో ఎస్.పి. చరణ్ వచ్చి కొంత కామెడీ పండించాడు. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఓ కీ రోల్ చేశాడు.

ప్లస్ పాయింట్స్ :

కథ & స్క్రీన్ ప్లే
కామెడీ
ఫస్టాఫ్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ స్టార్టింగ్
కొంత ప్రిడిక్టబుల్ స్టోరీ

మొత్తంగా.. దారం తెగని స్నేహం…

Patang Movie Rating – 2.75 / 5

Related News

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×