E-Paper
Advertisement

Psycho Thriller OTT : ‘ది థింగ్ విత్ ఫెదర్స్’ ఓటీటీ రిలీజ్ డేట్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Psycho Thriller OTT : ‘ది థింగ్ విత్ ఫెదర్స్’ ఓటీటీ రిలీజ్ డేట్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Psycho Thriller OTT : సైకో థ్రిల్లర్ జానర్లో వచ్చే డీప్ ఎమోషనల్ స్టోరీస్ ఇష్టపడే వాళ్లకి ఒక సూపర్ ఆప్షన్ వచ్చేసింది. సైకో థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. అలాంటి ఒక కొత్త ఇంగ్షీషు మూవీ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. మొదటిసారిగా ఈ మూవీ ఇండియాలో స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మరి మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? ఎప్పటి నుంచి చూడవచ్చు? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

లయన్స్‌గేట్ ప్లే

బెనెడిక్ట్ కంబర్‌ బ్యాచ్ మూవీ ‘ది థింగ్ విత్ ఫెదర్స్’ (The Thing with Feathers) ఇప్పుడు భారతదేశంలో మొదటిసారి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. 2026 జనవరి 9 నుండి లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోతో సబ్‌టైటిల్స్ ఆప్షన్ ఉంది. సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. సన్‌డాన్స్, బెర్లినాలే ఫెస్టివల్స్‌లో ప్రీమియర్ అయి మిక్స్డ్ టు పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ చిత్రం మాక్స్ పోర్టర్ నవల ఆధారంగా రూపొందింది. ఈ మూవీ ఒక ఎమోషనల్ రోలర్‌ కోస్టర్.

Advertisement

డిలాన్ సదరన్ తొలి ఫీచర్ ఫిల్మ్‌ గా డైరెక్ట్ చేసి స్క్రిప్ట్ రాశాడు. మెయిన్ లీడ్‌లో బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్, డేవిడ్ థెవ్లిస్ (క్రో వాయిస్), వినెట్ రాబిన్సన్, సామ్ స్ప్రూయెల్. రియల్ లైఫ్ ట్విన్స్ హెన్రీ, రిచర్డ్ బాక్సాల్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. వాళ్ల నేచురల్ పెర్ఫార్మెన్స్ సినిమాలో హైలైట్. కంబర్‌ బ్యాచ్ ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఆయన పెర్ఫార్మెన్స్‌కి జ్యూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ ఐ అవార్డు వచ్చింది. CGI + ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌తో క్రో పాత్రకి ప్రాణం పోశారు. ఈ మూవీ దుఃఖాన్ని భిన్నంగా చూపిస్తుంది. ఎమోషనల్ డ్రామా ఇష్టపడేవాళ్లు డోంట్ మిస్. కంబర్‌బ్యాచ్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్. యూకే, ఐర్లాండ్‌లో నవంబర్ 21న, యూఎస్‌లో నవంబర్ 28న రిలీజ్ అయింది సినిమా.

Read Also :  తండ్రిని చంపినందుకు ఒక్కొక్కడినీ ఉరికించి కొట్టే హీరో… బ్లడీ వయొలెన్స్… పూనకాలు తెప్పించే యాక్షన్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

కథ ఒక ఫాదర్ (బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్) చుట్టూ తిరుగుతుంది. భార్య అకాల మరణం తర్వాత ఇద్దరు చిన్న పిల్లలైన కొడుకులను అతను ఒంటరిగా పెంచాల్సి వస్తుంది. భార్య పోయిన బాధతో కుంగిపోతున్న అతని ఇంట్లో భారీ, మానవరూప క్రో (పక్షి లాంటి జీవి) కనిపిస్తాడు. క్రో బేబీ సిట్టర్, విరోధి, సైకాలజిస్ట్ అన్నీ అవుతాడు. ఫాదర్, బాయ్స్, క్రో పర్స్‌పెక్టివ్స్ మధ్య కట్స్‌తో దుఃఖం, అస్తవ్యస్త స్వభావాన్ని చూపిస్తారు. ఎమిలీ డికిన్సన్ కవిత “హోప్ ఈజ్ ది థింగ్ విత్ ఫెదర్స్” ఇన్స్పిరేషన్ తో మూవీని చూపిస్తారు. ఇంతకీ ఆ వింత పక్షి అతని దగ్గరకు ఎందుకు వచ్చింది ? హీరో పరిస్థితి ఏంటి? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×