E-Paper
Advertisement

Revenge Drama OTT : తండ్రిని చంపినందుకు ఒక్కొక్కడినీ ఉరికించి కొట్టే హీరో… బ్లడీ వయొలెన్స్… పూనకాలు తెప్పించే యాక్షన్

Revenge Drama OTT : తండ్రిని చంపినందుకు ఒక్కొక్కడినీ ఉరికించి కొట్టే హీరో… బ్లడీ వయొలెన్స్… పూనకాలు తెప్పించే యాక్షన్
Advertisement

Revenge Drama OTT : రివేంజ్ డ్రామాలు అన్నీ ఒకేలా ఉండవు. అందులోనూ విభిన్నమైన కథలు ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే రక్తాన్ని మరిగించే ఇంటెన్స్ స్టోరీతో ఆకట్టుకుంటాయి. ఇలాంటి కథలు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉండడం కూడా అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం కనెక్ట్ అవ్వడమే కాదు కామన్ మ్యాన్ కు మస్త్ శాటిస్ఫ్యాక్షన్ గ్యారంటీ. మరి ఆ ఇంటెన్స్ క్రైమ్ యాక్షన్ డ్రామా ఏంటి? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2024లో వచ్చిన కన్నడ యాక్షన్ డ్రామా ‘పెపె’ (Pepe). శ్రీలేష్ ఎస్. నాయర్ డైరెక్ట్ చేసిన డెబ్యూ ఫిల్మ్ ఇది. కుల వివక్ష, అణచివేత, సామాజిక న్యాయం థీమ్స్ చుట్టూ తిరిగే ఇంటెన్స్ స్టోరీ. 2 గంటల 6 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2024 ఆగస్ట్ 30న థియేటర్లలో రిలీజ్ అయింది. మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా, యాక్షన్ సీక్వెన్సెస్, సోషల్ మెసేజ్ ప్రశంసలు అందుకుంది. అక్టోబర్ 11 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఈ మూవీ. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంటే ఫ్రీగా చూడొచ్చు.

Advertisement

మెయిన్ లీడ్‌ గా వినయ్ రాజ్‌కుమార్ నటించారు. టైటిల్ రోల్ లో మాస్ హీరోగా ఫస్ట్ టైమ్ నటించారాయన. కాజల్ కుందర్, మేడిని కెలమనే, మయూర్ పటేల్, నవీన్ డి. పడిల్, యశ్ శెట్టి, అరుణా బాల్రాజ్, సంధ్య అరకెరె తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినయ్ రాజ్‌కుమార్ పెర్ఫార్మెన్స్ హైలైట్. యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపాడు. శ్రీలేష్ ఎస్. నాయర్ డైరెక్షన్‌లో నాన్-లీనియర్ నెరేషన్, యూనిక్ స్టైల్ ఉంది. పూర్ణచంద్ర తేజస్వి మ్యూజిక్ కూడా బాగుంది.

Read Also : హాంటెడ్ హౌస్ లో కాపురం… కొత్త పెళ్లి కూతురిపై దిక్కుమాలిన దెయ్యం కన్ను… ఒంటరిగా చూడకూడని మూవీ

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

కథ ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. ఒక నది రెండు కులాలను విభజిస్తుంది. అప్పర్ కాస్ట్ (ప్రభుత్వం చేతిలో ఉన్నవాళ్లు) నది నీటిని కంట్రోల్ చేసి, అణచివేతకు గురైనవాళ్ల కమ్యూనిటీపై అధికారం చెలాయిస్తారు. మూడు తరాలుగా ఇదే తతంగం సాగుతుంది. పెపె (వినయ్ రాజ్‌కుమార్) ఈ రూల్ ను బ్రేక్ చేస్తాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటూ, తన ప్రజల హక్కుల కోసం పోరాడతాడు. వయలెన్స్ ఫుల్‌గా ఉంటుంది. పెపె తల్లి ఈ హింసను ఆపాలని కోరుకుంటుంది. కుల వివక్ష, సామాజిక అన్యాయం, గౌరవం కోసం పోరాటం మెయిన్ థీమ్స్ గా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ బ్రూటల్‌గా ఉంటాయి. ఈ రా యాక్షన్ డ్రామాలో హీరో తండ్రి ఎలా చనిపోయాడు? హీరో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? చివరికి ఏమైంది? అన్నది తెరపై చూడాల్సిందే. కానీ నాన్-లీనియర్ నెరేషన్ వల్ల కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు. అలాగే వయలెన్స్ ఎక్కువ. మాస్ యాక్షన్ లవర్స్‌కి, సోషల్ ఇష్యూస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకి ఈ మూవీ బాగుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ ను ఇష్టపడేవాళ్లు ఒకసారి ట్రై చేయండి.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×