E-Paper
Advertisement

Bank Robbery: ‘మనీ హీస్ట్’ తరహాలో బ్యాంకు దోపిడి.. సొరంగం తవ్వి మరీ రూ.316 కోట్లు చోరి

Bank Robbery: ‘మనీ హీస్ట్’ తరహాలో బ్యాంకు దోపిడి.. సొరంగం తవ్వి మరీ రూ.316 కోట్లు చోరి

Bank Robbery: మీరు ‘మనీహీస్ట్’ వెబ్ సీరిస్ చూశారా? జర్మనీలో జరిగిన ఈ దోపిడీ ముందు ఆ వెబ్ సీరిస్ ఎందుకూ పనికిరాదు. ఎందుకంటే.. వాళ్లు వేసిన ప్లాన్ అలాంటిది మరి. ఇక వివరాల్లోకి వెళ్తే…

ఎవడు ప్లాన్ చేశాడో గానీ.. ఏ మాత్రం అనుమానం లేకుండా.. చిన్న చప్పుడు కూడా వినపడకుండా దొంగలు బ్యాంకులోకి చొరబడి భారీగా దోపిడికి పాల్పడ్డారు. బ్యాంకు కింద సొరంగాలు తవ్వి మరీ లోపలికి వెళ్లారు. సేఫ్టీ లాకర్లను బద్దలు కొట్టి అందులోని డబ్బు, బంగారు వస్తువులను దొంగిలించారు. మార్కెట్‌లో వీటి విలువ అక్షరాలా 30 మిలియన్‌ యూరోలు. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.316 కోట్లు పై మాటే.

జర్మనీ చరిత్రలో అతి పెద్ద బ్యాంకు దోపిడీ

సందట్లో సడేమియా అంటే ఇదేనేమో.. క్రిస్మస్ సెలవులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు కొందరు దొంగలు. పక్కాగా ప్లాన్ చేసి బ్యాంక్ ని దోపిడీ చేసేవారు. జర్మనీలో గెల్సెన్‌కిర్చెన్‌ సిటీలోని ఓ బ్యాంకుని దోపిడీ చేశారు దొంగలు. ఏకంగా 3200 సేఫ్టీ డిపాజిట్ బాక్సులను బద్దలుకొట్టి దోచుకుపోయారు. అందులోని నగదు, బంగారు ఆభరణాలను దొంగలించారు.

మార్కెట్లో వాటి విలువ 30 మిలియన్‌ యూరోలు.భారత్ కరెన్సీలో అక్షరాలా రూ.316 కోట్లు పైమాటే. ఈ విషయాన్ని జర్మనీ పోలీసులు వెల్లడించారు.  బ్యాంకులోని ఖజానా గదికి  పెద్ద డ్రిల్ చేశారు. ఆ తర్వాత ఎంట్రీ మూడో కంటికి తెలియకుండా తమ పని సైలెంట్ గా కానిచ్చారు.

ప్లాన్ చేసి రూ.316 కోట్లు కొట్టేసిన దొంగలు

డిసెంబర్ 29న ఉదయం ఫైర్ అలారం ట్రిగ్గర్ కావడంతో దోపిడీ వ్యవహారం బట్టబయలైంది. పార్కింగ్ గ్యారేజీలో పెద్ద బ్యాగ్‌లతో ముగ్గురు వ్యక్తులను చూశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. CCTV ఫుటేజ్‌లో మాస్క్‌లు ధరించిన వ్యక్తులు బ్లాక్ ఆడి RS6 కారులో తప్పించుకుపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఆ కారు నంబర్ ప్లేట్ గతంలో హ్యానోవర్‌లో దొంగిలించబడినట్టు చెబుతున్నారు. పక్కాగా ప్రొఫెషనల్స్ ఈ దోపిడీ చేసినట్టు పోలీసులు వర్ణించారు. ఈ దోపిడీని హాలీవుడ్ మూవీ ‘Ocean’s Eleven’తో పోల్చారు. జర్మనీ చరిత్రలో అతిపెద్ద దోపిడీలో ఇది ఒకటి. బ్యాంక్ భూగర్భ ఖజానా గదిలోకి పార్కింగ్ గ్యారేజీ నుండి రంధ్రం చేసి దొంగలు ప్రవేశించారు.

ALSO READ:  లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘటన

బ్యాంక్ హాట్‌ లైన్ ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల కోసం సంబంధిత కంపెనీలతో మంతనాలు  చేస్తున్నట్లు తెలిపారు బ్యాంకు అధికారులు. గురువారం క్రిస్మస్ కాగా, శుక్రవారం జర్మన్‌లో వ్యాపార సంస్థలు మూసివేయబడ్డాయి. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో దీన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు దోపిడీ దొంగలు.

భూగర్భం నుంచి అంచెలంచెలుగా లోపలకు వెళ్లి డిపాజిట్ బాక్సులను పగలగొట్టి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.  దోపిడీ గురించి తెలియగానే బ్యాంకు వద్దకు కస్టమర్లు చేరుకుని ఆందోళనకు దిగారు. 2500 మంది కస్టమర్ల సొమ్ములు చోరీ అయినట్టు అంచనా.  కస్టమర్లు బ్యాంకు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి.

డిపాజిట్ బాక్సులకు సగటున 10,000 యూరోల కంటే ఎక్కువ బీమా విలువ ఉందని, అందువల్ల దాదాపు 30 మిలియన్ యూరోల నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. డిపాజిట్ బాక్సుల బీమా విలువ కంటే చాలా ఎక్కువగా ఉంటుందని చాలా మంది బాధితులు చెబుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకు తెరవలేకపోవడంతో కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఉద్యోగులపై బెదిరింపులు వచ్చిన తరువాత భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంక్ తెరవలేదని అంటున్నారు.

 

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×