E-Paper
Advertisement

Psychological drama OTT: 70 ఏళ్ల వయసులో తీపి కబుర్లు… రాత్రంతా అదే పని… చూస్తే అస్సలు వదిలిపెట్టరు

Psychological drama OTT: 70 ఏళ్ల వయసులో తీపి కబుర్లు… రాత్రంతా అదే పని… చూస్తే అస్సలు వదిలిపెట్టరు
Advertisement

Psychological drama OTT : ఒక మంచి ఎమోషనల్ డ్రామాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మిస్ కాకుండా చూడండి. గత ఏడాది వచ్చిన ఈ బెంగాలీ మూవీ 70 ఏళ్ల వయసున్న ఒక వృద్ధ దంపతుల చుట్టూ తిరుగుతుంది. ఒకే రాత్రిలో జరిగే ఈ కథ వాళ్ళ పెళ్లి జ్ఞాపకాలను నెమరేసుకోవడంతో సరిపోతుంది. అయితే మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ కన్నీళ్ళు కూడా పెట్టిస్తుంది.  ఈ మూవీ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ బెంగాలీ సైకలాజికల్ డ్రామా సినిమా పేరు ‘ఈ రాత్ తోమర్ అమర్’ (Ei Raat Tomar Amaar). పరంబ్రత చటోపాధ్యాయ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అసలు కథ, స్క్రీన్‌ప్లే చిరోంజిబ్ బోర్డోలోయ్ రాశారు. హోయిచోయ్ బ్యానర్‌పై విష్ణు మోహతా నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు అపర్ణా సేన్, అంజన్ దత్ మొదటిసారి వెండితెరపై దంపతులుగా నటించారు. ఈ మూవీకి ఇంద్రాదీప్ దాస్ గుప్తా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ సినిమా హోయిచోయ్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక ఇంట్లో 70 ఏళ్ల వయసున్న అమర్ గుప్తా (అంజన్ దత్), జయిత (అపర్ణా సేన్) అనే దంపతులు నివసిస్తుంటారు. జయిత క్యాన్సర్ చివరి దశలో ఉంటుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా వాళ్ళకు దూరంగా ఉంటాడు. ఇక ఆమె భర్త అమర్ తన భార్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ 50వ పెళ్లి రోజు రావడంతో కథ ఆసక్తిగా సాగుతుంది. జయిత అందమైన చీర కట్టుకుని, పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆ రాత్రిని మరపురాని రోజుగా మార్చాలని అనుకుంటుంది.

బయటకు చూడటానికి వాళ్ళు చాలా అన్యోన్యంగా కనిపిస్తారు కానీ, ఆ రాత్రి వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం మొదలు పెట్టాక అసలు విషయాలు బయటపడతాయి. ఆ రాత్రంతా వాళ్ళు గొడవపడుతూ, బాధపడుతూనే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని చూపించుకుంటారు. సినిమా చివరికి వచ్చేసరికి, ఆ వృద్ధ దంపతులు తమ మధ్య ఉన్న విభేదాలను ఎలా అధిగమించారు? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు ? అనేది చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది.

Advertisement

Read Also : పెళ్లికి ముందే హోటల్ గదిలో మరో అమ్మాయితో… అవాక్కయ్యే ట్విస్టులు గురూ

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×