E-Paper
Advertisement

Psychological horror thriller OTT: పెళ్ళి కాకుండానే ప్రెగ్నెన్సీ… నరకం చూపించే సైతాన్… ఏం సినిమా సామి

Psychological horror thriller OTT: పెళ్ళి కాకుండానే ప్రెగ్నెన్సీ… నరకం చూపించే సైతాన్… ఏం సినిమా సామి
Advertisement

Psychological horror thriller OTT : ఈరోజుల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒక పెద్ద థియేటర్ అయిపోయింది ఇంట్లోనే. బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే నచ్చిన కంటే చూసి ఎంటర్టైన్ అవుతున్నారు ప్రేక్షకులు. ఇక వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హారర్ సినిమాలు. ఇవి భయపెడతాయని తెలిసినా, పక్కన ఎవరినో ఒకర్ని వెంటబెట్టుకుని మరీ ఇష్టంగా చూస్తున్నారు. అలాంటి వాళ్ల కోసమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా. ఈ సినిమాలో కూడా హారర్ సీన్స్ వణుకు పుట్టిస్తుంటాయి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘అపార్ట్‌మెంట్ 7A’ (Apartment 7A). ఇది 1968 నాటి క్లాసిక్ హారర్ సినిమా ‘రోజ్మేరీస్ బేబీ’ కి ప్రీక్వెల్. నటాలీ ఎరికా జేమ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూలియా గార్నర్ ప్రధాన పాత్రలో నటించగా, డయాన్ వీస్ట్, కెవిన్ మెక్నాలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది 2024 సెప్టెంబర్ 27న నేరుగా Paramount+ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

టెర్రీ అనే అమ్మాయికి డాన్స్ అంటే పిచ్చి. ఎలాగైనా పెద్ద స్టార్ అవ్వాలని ఆశపడుతుంది. కానీ ఒక యాక్సిడెంట్‌లో కాలుకి దెబ్బ తగలడంతో ఆమె కెరీర్ కష్టాల్లో పడుతుంది. ఆ టైమ్‌లో ఒక ముసలి జంట ఆమెకు పరిచయం అవుతారు. మా ఇంట్లో ఉండు అని చెప్పి, నీకు అన్ని విధాలా సాయం చేస్తాం అంటూ తీసుకెళ్తారు. టెర్రీ కూడా వాళ్ళు చాలా మంచోళ్ళని నమ్మి ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తుంది. మెల్లగా ఆమెకు మళ్ళీ ఛాన్సులు రావడం మొదలవుతాయి కానీ, ఆ సంతోషం వెనుక ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆమెకు అర్థం కాదు.

అయితే ఆ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు మామూలు మనుషులు కాదు. వాళ్ళు దెయ్యాన్ని నమ్మే రకం. టెర్రీకి తెలియకుండానే ఆమెను ఒక భయంకరమైన ప్లాన్‌లో ఇరికించేస్తారు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఆమకు వింత శబ్దాలు రావడం, భయంకరమైన కలలు రావడం మొదలవుతాయి. తను ఏదో పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయానని టెర్రీ గ్రహించేలోపే అంతా చేజారిపోతుంది. ఆమె కడుపులో ఒక సైతాన్ ఆవహిస్తుంది. ఆ తరువాత స్టోరీ మరింత భయంకరంగా సాగుతుంది. అసలు ఆ ముసలి జంట టెర్రీని ఎందుకు తీసుకెళ్లారు ? టెర్రీ కడుపులో సైతాన్ ఎలా వచ్చింది ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను , ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : గత 32 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆదరణ.. ప్రపంచంలోనే బెస్ట్ మూవీగా గుర్తింపు… ఐయండిబిలో 9.3 రేటింగ్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×