E-Paper
Advertisement

Meta RayBan Privacy: మీరు బెడ్‌రూమ్‌లో ఉన్నా, బాత్‌రూంలో ఉన్నా అంతా రికార్డ్ చేస్తున్న మెటా గ్లాసెస్.. వీక్షిస్తున్న కంపెనీ వర్కర్లు

Meta RayBan Privacy: మీరు బెడ్‌రూమ్‌లో ఉన్నా, బాత్‌రూంలో ఉన్నా అంతా రికార్డ్ చేస్తున్న మెటా గ్లాసెస్.. వీక్షిస్తున్న కంపెనీ వర్కర్లు

Meta Ray Ban Privacy Concern| ఈ రోజుల్లో అన్ని టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ గ్లాసెస్ తయారు చేస్తున్నాయి. వీటిలో మెటా రే బ్యాన్ బ్రాండ్ ఏఐ గ్లాసెస్ చాలా పాపులర్. ఈ గ్లాసెస్ యూజర్లకు సౌకర్యం, AI సహాయం, హ్యాండ్స్-ఫ్రీ రికార్డింగ్ ఇస్తాయి. అయితే ఈ గ్లాసెస్ ద్వారా యూజర్ల ప్రైవసీని మెటా ఉల్లంఘిస్తోందని తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్‌లో యూజర్ల ప్రైవేట్ మూమెంట్స్ (బట్టలు మార్చేటప్పుడు, బాత్‌రూంలో స్నానం చేసే సమయంలో వీడియోలు) మెటా కంపెనీ వర్కర్లు చూశారని ఆరోపణలు వచ్చాయి. ఈ గ్లాసెస్.. వాయిస్ కమాండ్‌తో వీడియోలు రికార్డ్ చేస్తాయి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇందులోని AI ఫీచర్లు పరిశీలిస్తాయి. కానీ కొన్ని వీడియోల్లో యూజర్ల వ్యక్తిగత జీవిత క్షణాలు రికార్డ్ అయ్యాయని తెలిసింది. ఈ ఆరోపణలు స్మార్ట్ వేరబుల్ టెక్నాలజీపై పెద్ద చర్చను ప్రారంభించాయి.

కంపెనీ వర్కర్లు యూజర్ల ప్రైవేట్ మూమెంట్స్ చూస్తున్నారు

స్వీడెన్‌కు చెందిన వార్తాపత్రికలు స్వెన్స్కా డాగ్‌బ్లాడెట్, గోటెబోర్గ్స్-పోస్టెన్ సంయుక్తంగా మెటా గ్లాసెస్ గురించి విచారణ చేపట్టాయి. వారి విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మెటా గ్లాసెస్ ఉపయోగిస్తున్న యూజర్ల వ్యక్తిగత వీడియో రికార్డింగ్‌లను ఆఫ్రికా దేశమైన కెనాలోని మెటా కంపెనీ వర్కర్లు రివ్యూ చేస్తున్నారు. వీరంతా కెన్యా రాజధాని నైరోబిలోని సమా అనే డేటా కాంట్రాక్టర్ కంపెనీలో పని చేస్తున్నారు.

కొన్ని మెటా గ్లాసెస్ వీడియోలలో బాత్‌రూమ్‌లోకి వెళ్తున్న వ్యక్తులు, ప్రైవేట్ రూమ్‌లలో బట్టలు మార్చుకుంటున్న వారు కనిపించారు. మీడియా సంస్థల విచారణలో ఒక కంపెనీ వర్కర్ ప్రకారం.. కొందరు యూజర్లు బాత్ రూంలో కాలక‌త్యాలు చేసే సమయంలో, బెడ్‌రూంలో యూజర్లు బట్టలు లేని సమయంలో ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి. ఇదంతా యూజర్లు తెలియకుండానే రికార్డ్ అయ్యాయి.

ప్రైవేట్ యాక్టివిటీలు యాదృచ్ఛికంగా రికార్డ్

మరో వర్కర్ ఒక బెడ్‌రూమ్ రికార్డింగ్ గురించి చెప్పాడు. ఒక మనిషి గ్లాసెస్‌ను బెడ్‌సైడ్ టేబుల్ మీద పెట్టి రూమ్ నుంచి వెళ్లిపోయాడు. గ్లాసెస్ ఆటోమాటిక్‌గా రికార్డ్ చేస్తూనే ఉన్నాయి. తర్వాత అతని భార్య రూమ్‌లోకి వచ్చి బట్టలు మార్చుకుంది. గ్లాసెస్ ఆ మొత్తం మూమెంట్ రికార్డ్ చేశాయి. వర్కర్లు మోడరేషన్ వర్క్‌లో భాగంగా సమయంలో ఈ వీడియోలు చూశారు. కొన్ని వీడియోలలో బ్యాంక్ కార్డులు, సున్నితమైన వ్యక్తిగత సమాచారం కనిపించాయి. కొన్ని క్లిప్‌లలో యూజర్లు ప్రైవేట్‌గా అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు కనిపించింది.

మెటా ఈ వీడియోలు ఎందుకు రివ్యూ చేస్తుంది?

AI ఫీచర్ల కోసం ఈ రికార్డింగ్‌లను మెటా రివ్యూ చేస్తోంది. “Hey Meta” అని చెప్పగానే కెమెరా, AI యాక్టివ్ అవుతాయి. అందులోని డేటా మొత్తం మెటా సర్వర్లకు వెళ్తుంది. ప్రాసెసింగ్ తర్వాత ఎక్స్‌టర్నల్ కాంట్రాక్టర్లు రివ్యూ చేసి AI మోడల్స్‌ను ట్రైనింగ్ ఇస్తారు. ఇది AI కెపాసిటీని మెరుగుపరుస్తుంది. కానీ యాదృచ్ఛికంగా ప్రైవేట్ మూమెంట్స్ వర్కర్లు చూడటం జరుగుతుంది.

యూజర్ అగ్రిమెంట్ టెర్మ్స్ ఆధారంగానే రివ్యూ

గ్లాసెస్ యాక్టివేట్ చేసేముందు AI టెర్మ్స్ ఆఫ్ సర్వీస్ అంగీకరించాలి. ఈ పాలసీ ప్రకారం.. మెటా AI ఇంటరాక్షన్లు, రిలేటెడ్ కంటెంట్ రివ్యూ చేయవచ్చు. ఆటోమాటిక్‌గా లేదా హ్యూమన్ మోడరేటర్ల ద్వారా రివ్యూ జరుగుతుంది. చాలా మంది యూజర్లు ఈ షరతులు పూర్తిగా అర్థం చేసుకోకుండానే అంగీకరిస్తారు.

Also Read: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

స్మార్ట్ గ్లాసెస్ పాపులారిటీతో ప్రైవసీ రిస్క్‌లు

స్మార్ట్ గ్లాసెస్ పాపులారిటీ, మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. మిలియన్ల సంఖ్యలో AI వేరబుల్స్, స్మార్ట్‌గ్లాసెస్ యూనిట్లు సేల్ అవుతున్నాయి. కానీ ప్రైవసీ రిస్క్‌లు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. యూజర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రికార్డింగ్ డివైస్‌లు యాదృచ్ఛికంగా సున్నితమైన ప్రైవేట్ క్షణాలను క్యాప్చర్ చేయవచ్చు. AI ఫీచర్లు ఆన్ చేసేముందు ప్రైవసీ పాలసీలు జాగ్రత్తగా చదవాలి. లేకపోతే ప్రైవేట్ మూమెంట్స్ ట్రైనింగ్ డేటాసెట్‌లలో మీ జీవిత క్షణాలు చేరిపోతాయి.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×