E-Paper
Advertisement

Psychological Horror Thriller OTT : రాత్రి పూట రెండు జంటల అరాచకం… 1 గంట 35 నిమిషాల పాటు నరాలు తెంపే ఉత్కంఠ… బుర్ర పాడయ్యే క్లైమాక్స్

Psychological Horror Thriller OTT : రాత్రి పూట రెండు జంటల అరాచకం… 1 గంట 35 నిమిషాల పాటు నరాలు తెంపే ఉత్కంఠ… బుర్ర పాడయ్యే క్లైమాక్స్
Advertisement

Psychological Horror Thriller OTT:  వయొలెన్స్ ఓ లెవల్ లో ఉండే థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. విపరీతమైన రక్తపాతం, షాకింగ్ మలుపు వల్ల ఈ సినిమాకు మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇందులో వీటికి మించిన బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. సినిమా మొదటి సగం నెమ్మదిగా సాగుతుంది. కానీ చివరి 30 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సుమారు సుమారు 95 నిమిషాల నిడివితో ఈ సినిమా క్రాక్ ఎక్కిస్తుంది. ఏకాంతంగా గడపడానికి వెళ్ళిన ఒక జంట, మరో సైకో జంట చేతికి చిక్కుతుంది. ఆ తరువాత అసలు హింస ఉంటుంది. పిల్లలు ఈ సినిమాకి దూరంగా ఉండటం మంచిది. ఇది పెద్దలకు మాత్రమే.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘బోన్ లేక్’ (Bone Lake). ఈ సినిమాను మెర్సిడెస్ బ్రైస్ మోర్గాన్ డైరెక్ట్ చేశారు. ఇందులో మ్యాడీ హాసన్, మార్కో పిగోస్సి, అలెక్స్ రో, ఆండ్రా నెచిత ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2024 అక్టోబర్ లో థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దెకు (Rent) కూడా తీసుకోవచ్చు. 2024లో జరిగిన ఫెంటాస్టిక్ ఫెస్ట్లో ఈ సినిమాను చూసిన విమర్శకులు దీని మేకింగ్ స్టైల్‌ను మెచ్చుకున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సేజ్, డియెగో అనే జంట తమ పాత గొడవలు మర్చిపోయి హాయిగా గడుపుదామని ఒక అడవిలో ఉన్న విల్లాకి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే, అదే విల్లాని సిలాస్, మరీనా అనే ఇంకో జంట కూడా బుక్ చేసుకుని ఉంటారు. సరేలే ఒక రాత్రికి అడ్జస్ట్ అవుదాం అనుకుని నలుగురూ కలిసి మందు తాగుతూ చిల్ అవుతారు. కానీ మాటల్లో మాటలు పెరిగి, ఒకరి వ్యక్తిగత విషయాల మీద ఒకరు సెటైర్లు వేసుకోవడంతో వాతావరణం వేడెక్కుతుంది. కాసేపటి తర్వాత ఆ కొత్త జంట ప్రవర్తన చాలా వింతగా మారుతుంది. సేజ్, డియెగోల మధ్య ఉన్న గొడవలను వాడుకుని వాళ్ళని విడదీయాలని చూస్తారు. ఈ క్రమంలో ఒకరి మీద ఒకరికి అనుమానం పెరిగి, ఆ విల్లాలో ఏదో తేడా ఉందని వీళ్ళకు అర్థమవుతుంది.

ఒక చోట పాత రికార్డింగ్ టేపులు వీళ్ళకు కనిపిస్తాయి. ఇక అంతే వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడికి వచ్చిన పాత జంటలను వీళ్ళు హింసించి చంపుతుంటారు. ఇక సేజ్, డియెగో ఏకాంతంగా గడుపుతున్న రికార్డులు కూడా ఉంటాయి. సిలాస్, మరీనా జంట సాదాసీదా మనుషులు కారని, వాళ్ల వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉందని తెలిసేసరికి పరిస్థితి చేయి దాటిపోతుంది. సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి, విపరీతమైన రక్తపాతం, కొట్టుకోవడాలతో సినిమా అంతా గోలగోలగా మారిపోతుంది. చివరకు సేజ్, డియెగోలు ఆ నరకం నుండి ప్రాణాలతో బయటపడ్డారా ? మిగతా జంటల మాదిరి వాళ్ళ చేతుల్లో బలయ్యారా ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  కోరిక తీర్చి మాయం చేసే టీచర్… టెన్షన్ పెట్టించే ఒక్కో స్టూడెంట్ మిస్సింగ్ కేసు… అదిరిపోయే కొరియన్ మిస్టరి

Tags

Related News

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

Big Stories

Advertisement
×