E-Paper
Advertisement

Mystery Thriller Series : కోరిక తీర్చి మాయం చేసే టీచర్… టెన్షన్ పెట్టించే ఒక్కో స్టూడెంట్ మిస్సింగ్ కేసు… అదిరిపోయే కొరియన్ మిస్టరి

Mystery Thriller Series : కోరిక తీర్చి మాయం చేసే టీచర్… టెన్షన్ పెట్టించే ఒక్కో స్టూడెంట్ మిస్సింగ్ కేసు… అదిరిపోయే కొరియన్ మిస్టరి
Advertisement

Mystery Thriller Series : కొరియన్ సిరీస్ ల కోసం చెవి కోసుకునే అభిమానులు చాలామంది ఉన్నారు. ఈ సిరీస్ లను రోజులో ఒక్కసారైనా చూడకుండా ఉండలేరు. అలా ఒక వ్యసనంగా మారిపోయాయి ఈ సిరీస్ లు. ఈ నేపథ్యంలో మనం 12 ఎపిసోడ్ ల థ్రిల్లర్ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సిరీస్ ఒక స్కూల్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ విద్యార్థుల మిస్సింగ్ తో స్టోరీ ఉత్కంఠంగా, చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ కొరియా వెబ్ సిరీస్ పేరు ‘నైట్‌మేర్ టీచర్’ (Nightmare Teacher). 2016లో వచ్చిన ఈ సరీస్ లో ఉమ్ కి-జూన్, కిమ్ సో-హ్యున్, లీ మిన్-హ్యుక్ లీడ్ రోల్స్ లో నటించారు. మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ Viki ఓటీటీ ప్లాట్‌ ఫామ్ లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక స్కూల్‌లో పాఠాలు చెప్పే మాస్టారు సెలవు పెడితే, ఆయన ప్లేస్‌లోకి హాన్ బాంగ్-గూ అనే ఒక కొత్త టీచర్ దిగుతాడు. ఆయన చూడటానికి మామూలుగానే ఉన్నా, లోపల మాత్రం పెద్ద కిలాడీ. క్లాసులో ఒక్కొక్క స్టూడెంట్‌ని పిలిచి, నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తా అని ఆశ చూపిస్తాడు. కొందరు అందం కోసం, మరికొందరు తెలివితేటల కోసం, ఇంకొందరు ఫేమస్ అయిపోవాలని ఆయన దగ్గరికి వెళ్తారు. కానీ ఆ ముసలాయన ఊరికే ఏదీ ఇవ్వడు. ఒక తెల్ల కాగితం మీద రక్తంతో సంతకం పెట్టించుకుని వాళ్ల కోరిక తీరుస్తాడు. ఒక్కసారి ఆ కాగితం మీద సంతకం పడిందో, ఆ పిల్లాడి పంట పండినట్టే అనిపిస్తుంది కానీ అసలు సినిమా అక్కడే మొదలవుతుంది. కోరిక తీరిన కొద్దిసేపటికే ఆ స్టూడెంట్ మాయమైపోతాడు. విచిత్రం ఏంటంటే, వాడు స్కూల్‌లో ఉన్నాడన్న సంగతే మిగతా పిల్లలందరూ మర్చిపోతారు. అతని బెంచీ ఖాళీగా ఉన్నా ఎవరికీ అనుమానం రాదు.

అలా ఒక్కొక్కడిని ఆ మాస్టారు తన మాయలో వేసుకుని నైట్‌మేర్ (పీడకల) లాంటి ప్రపంచంలోకి పంపించేస్తుంటాడు.ఇదంతా గమనిస్తున్న క్లాస్ లీడర్ యే-రిమ్ కి ఎక్కడో తేడా కొడుతుంది. తన ఫ్రెండ్స్ ఒక్కొక్కరు కనిపించకుండా పోతున్నా అందరూ ఎందుకు గమ్మున ఉన్నారా అని ఆ పిల్లకి అనుమానం వస్తుంది. తన ఫ్రెండ్ ఒకడిని తోడు తీసుకుని ఆ మాస్టారు వెనకాల పడి, అసలు గుట్టు ఏంటో కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. చివరకు ఆ టీచర్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటి ? తన క్లాస్మేట్స్‌ని క్లాస్ లీడర్ ఎలా కాపాడుకుంది ? ఆ రక్తం సంతకాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? అనేది ఈ కథలో అసలు మజా.

Advertisement

Read Also : ప్రేమ కోసం బోలెడన్ని మర్డర్లు…రక్తపాతంతో సాగే సైకో రాసలీల… ఒక్కో సీన్ అరాచకం…

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×