E-Paper
Advertisement

ఆ ఇంట్లో రాత్రయితే నరకమే… ఊపిరి బిగబట్టి చూసేలా చేసే ఉత్కంఠభరితమైన హారర్ థ్రిల్లర్

ఆ ఇంట్లో రాత్రయితే నరకమే… ఊపిరి బిగబట్టి చూసేలా చేసే ఉత్కంఠభరితమైన హారర్ థ్రిల్లర్
Advertisement

Psychological horror thriller OTT : దెయ్యం సినిమాలు చాలా వరకు రొటీన్ గానే ఉంటాయి. దెయ్యాలు వచ్చి మీద పడి రక్కడం, గోడల మీద పాకడం లాంటి సీన్లు ఉంటాయి ఎక్కువగా. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మాత్రం భిన్నం గా ఉంటుంది. కెమెరా మనుషుల వైపు కాకుండా, ఒక ఇంట్లో ఉండే ఆత్మ కళ్ళతో చూపిస్తుంది. అంటే స్క్రీన్ మీద మనమే ఆ దెయ్యం అన్నమాట! పెద్దగా అరుపులు, రక్తం ఏమీ ఉండవు కానీ.. ఆ ఇంట్లో ఎవరో ఉన్నారనే ఫీలింగ్ తో వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఆత్మ ఒక ఫ్యామిలీ డ్రామాను చూస్తే ఎలా ఉంటుందనే కొత్త కోణంలో ఈ సినిమా సాగుతుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2024లో వచ్చిన ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ సినిమా పేరు ‘ప్రెజెన్స్’ (Presence). ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో లూసీ లీయు, క్రిస్ సుల్లివన్, కలినా లియాంగ్ నటించారు. దర్శకుడు ఈ చిత్రాన్ని కేవలం 11 రోజుల్లోనే పూర్తి చేశారు. సాధారణంగా సినిమాలు తీయడానికి నెలల సమయం పడుతుంది. అయితే స్టీవెన్ ఒకే ఇంట్లో పక్కా ప్లానింగ్‌తో దీన్ని చుట్టేశారు. ఈ సినిమా అంతా ఒక ఆత్మ కళ్ళతోనే చూస్తాం కాబట్టి, మనమే ఆ ఇంట్లో దెయ్యంలా తిరుగుతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.ఈ సినిమా బడ్జెట్ పరంగా చూస్తే చాలా తక్కువ ఖర్చుతో (సుమారు 16 కోట్లు) తీశారు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర దానికి ఐదు రెట్లు ఎక్కువ వసూళ్లను సాధించి పెద్ద హిట్ అయింది. ఇది 2024 జనవరిలో సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విమర్శకుల ప్రశంసలు పొందింది. 2025 జనవరిలో థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో నడిచింది. ప్రస్తుతం ఈ సినిమా లయన్స్ గేట్ ప్లే, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక ఫ్యామిలీ సిటీ బయట ఉన్న ఒక పాత బంగ్లాలోకి కొత్తగా కాపురం వస్తారు. ఇంట్లోకి రాగానే వాళ్లకు ఏదో తేడాగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే, కెమెరా మనకు మనుషుల్ని చూపించదు. ఆ ఇంట్లో ఉన్న ఒక దెయ్యం కళ్లతో మనం సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. ఆ దెయ్యం అటు ఇటు తిరుగుతూ ఆ ఇంట్లో ఉన్నోళ్లు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో చాటుగా గమనిస్తూ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో మొగుడు పెళ్ళాం మధ్య అస్సలు పడదు, ఎప్పుడూ వాదులాడుకుంటూనే ఉంటారు. వాళ్ల కూతురు క్లోయ్ మాత్రం కొంచెం సెన్సిటివ్. ఇంట్లో ఏదో ఆత్మ ఉందని ఆ అమ్మాయికి ముందే డౌట్ వస్తుంది.

అయితే ఆ దెయ్యం విలన్ లాగా అందరినీ చంపేయాలని చూడదు, కాకపోతే ఆ ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి అది కూడా కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటుంది. పోను పోను ఆ ఇంట్లో ఉన్న దెయ్యానికి, ఈ అమ్మాయి క్లోయ్‌కి మధ్య ఒక తెలియని కనెక్షన్ ఏర్పడుతుంది. చివరికి ఆ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేసిందా లేక కొంప ముంచిందా ? అనేదే అసలు పాయింట్. ఇది రొటీన్ హారర్ సినిమాల్లాగా భయంకరమైన మేకప్ లు, గట్టి అరుపులు ఉండవు, అయితే ఆ దెయ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూడటం మాత్రం భలే గమ్మత్తుగా ఉంటుంది.

Advertisement

Read Also : సీక్రెట్ మొబైల్ యాప్ వలలో చిన్న పిల్లలు… మెంటలెక్కించే సైకలాజికల్ మైండ్ గేమ్

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×