E-Paper
Advertisement

సీక్రెట్ మొబైల్ యాప్ వలలో చిన్న పిల్లలు… మెంటలెక్కించే సైకలాజికల్ మైండ్ గేమ్

సీక్రెట్ మొబైల్ యాప్ వలలో చిన్న పిల్లలు… మెంటలెక్కించే సైకలాజికల్ మైండ్ గేమ్
Advertisement

Thriller Series on OTT : కొరియన్ సిరీస్ లలో రొమాంటిక్ కంటెంట్ కి ఎంత ఆదరణ ఉందో తెలిసిందే. అదే తరహాలో థ్రిల్లర్ జానర్ ని కూడా ప్రేక్షకులు వదిలిపెట్టడంలేదు. ఇప్పుడు చెప్పుకోబోయే థ్రిల్లర్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ఇది ఒక పక్కా మైండ్ గేమ్ సస్పెన్స్ థ్రిల్లర్. సాధారణంగా స్కూల్ సినిమాలు అంటే ఫ్రెండ్ షిప్, సరదాలు ఉంటాయి. కానీ ఇందులో మాత్రం స్కూల్ అంటే ఒక నరకంలా చూపిస్తారు. ఇక్కడ పిల్లల మధ్య స్నేహం కంటే, ఒకరిని ఒకరు తొక్కేసి పైకి వెళ్లాలనే కసి ఎక్కువగా కనిపిస్తాయి. బయటి సమాజంలో డబ్బున్న వాడు లేనివాడిని ఎలా తక్కువ చేసి చూస్తాడో, రాజకీయాలు ఎలా ఉంటాయో.. వాటన్నింటినీ ఒక క్లాస్ రూమ్ లోకి తీసుకొచ్చి చూపిస్తే ఎలా ఉంటుందో ఈ సిరీస్ అలా ఉంటుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘పీరమిడ్ గేమ్’ (Pyramid Game). ఇది 2024లో వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ కొరియా వెబ్ సిరీస్. ఈ సిరీస్‌ను పార్క్ సో-యోన్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నటి, కే-పాప్ స్టార్ బోనా ప్రధాన పాత్రలో నటించారు. ఇది కేవలం కొరియాలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ TVING ద్వారా విడుదలైన ఈ షో, స్కూల్ నేపథ్యంలో జరిగే అంతరాలను చాలా ప్రభావవంతంగా చూపించింది. ఈ సిరీస్ 10 ఎపిసోడ్‌లతో నిర్మించబడింది. ఈ సిరీస్ 2024లో వచ్చిన ఉత్తమ కొరియన్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్ తెలుగులో అధికారికంగా అందుబాటులో లేదు, కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో Rakuten Viki, JioHotstar ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో చూడవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కొరియాలో బాక్మెన్ గర్ల్స్ హైస్కూల్‌ ఉంటుంది. అయితే ఇందులో పిల్లలందరూ కలిసి ప్రతి నెలా ఒక ఫోన్ యాపలో వింతైన ఓటింగ్ గేమ్ ఆడుతుంటారు. దీనినే అక్కడ ‘పీరమిడ్ గేమ్’ అంటారు. ఈ ఓటింగ్‌లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు పై స్థాయిలో (A గ్రేడ్) ఉండి స్కూల్‌ని శాసిస్తారు. ఎవరికైతే అసలు ఓట్లు పడవో వాళ్ళు ‘F’ గ్రేడ్ కింద లెక్క. ఇలా ‘F’ గ్రేడ్ వచ్చిన అమ్మాయిని క్లాసులో మిగిలిన వాళ్ళందరూ కలిసి చిత్రహింసలు పెట్టవచ్చు, వేధించవచ్చు. దీనిని ఎవరూ అడ్డుకోకూడదు అనేది ఆ ఆటలోని క్రూరమైన నియమం. ఈ సమయంలో హీరోయిన్ సు-జి ఆ స్కూల్‌కి కొత్తగా ట్రాన్స్‌ఫర్ అయి వస్తుంది. రాగానే ఆమెకు ఈ గేమ్ గురించి ఏమీ తెలియక ‘F’ గ్రేడ్ బాధితురాలిగా మారుతుంది.

ఇప్పుడు క్లాసులోని పిల్లలందరూ తనని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుంటే, సు-జి మొదట భయపడినా తరువాత ఈ అన్యాయమైన ఆటను ఎలాగైనా అంతం చేయాలని మనసులో గట్టిగా ఫిక్స్ అవుతుంది. సు-జి తన తెలివితేటలతో ఒక్కొక్కరిని తన వైపు తిప్పుకుంటూ, ఆ పీరమిడ్ వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెడుతుంది. క్లాసులో అందరికంటే పవర్‌ఫుల్ అనిపించుకునే బాక్ హా-రిన్ కుట్రలను ఎదుర్కోవడానికి పక్కా ప్లాన్ వేస్తుంది. చివరికి ఆమె ఈ గేమ్ ను నియంత్రిస్తుందా ? లేక ఆ గేమ్ కుట్రలకే బలవుతుందా ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : కనిపించని కూతురి కోసం తండ్రి ఆవేదన… రేవ్ పార్టీల నేపథ్యంతో రూపొందిన సరికొత్త డ్రామా

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×