E-Paper
Advertisement

Psychological Thriller OTT : 42 మైళ్ళ దూరంలో మిస్టీరియస్ రోడ్… మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ… లాస్ట్ లో బుర్రపాడు ట్విస్ట్ భయ్యా

Psychological Thriller OTT : 42 మైళ్ళ దూరంలో మిస్టీరియస్ రోడ్… మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ… లాస్ట్ లో బుర్రపాడు ట్విస్ట్ భయ్యా
Advertisement

Psychological Thriller OTT : మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలా మందికి గుర్తొచ్చే మూవీస్ ‘దృశ్యం’, ‘మహారాజా’, ‘తుడరుమ్’. సీను సీనుకో ట్విస్ట్ తో, ఊహించని మలుపులతో, కేక పెట్టించే క్లైమాక్స్ తో ఇలాంటి సినిమాలు ఇచ్చే కిక్కు మామూలుగా ఉండదు మరి. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటి మూవీనే. కాకపోతే ఇది తెలుగు సినిమా కాదు. కానీ ట్విస్టులు, థ్రిల్లింగ్ సీన్లకేం తక్కువ ఉండదు. మరి ఈ మూవీ పేరేంటి ? ఆ ఖతర్నాక్ స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

సైకలాజికల్ హారర్ సినిమాలంటే ఇష్టమా ? అయితే ఒళ్లు గగుర్పొడిచే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఈ మూవీని చూడాల్సిందే. 2025లో వచ్చిన ఈ ఇంటెన్స్ సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘హాలో రోడ్’ (Hallow Road). బాబ్ పుల్మాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్‌ కూడా మిస్ అయ్యి ఉంటాయి. 1 గంట 32 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2025 జూలై 18న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. రోస్ బైర్న్, జాకబ్ ట్రెంబ్లే, బ్రిట్నీ ఓ’గ్రాడీ ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా, ఎమిలీ బీచమ్, డేవిడ్ వెన్‌హామ్, జెస్సికా డీ గౌవ్ కీ రోల్స్ పోషించారు. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఈ మూవీపై ఒక లుక్కేయండి. చూశాక మీరే వర్త్ వాచింగ్ మావా అంటారు.

Advertisement

Read Also: 7 రోజుల్లో 440 కోట్లను కొల్లగొట్టే కథ… ఆండ్రియాను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు భయ్యా

స్టోరీలోకి వెళ్తే…

ఇందులో హీరోయిన్ పేరు సారా. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళ పేర్లు జాక్ (జాకబ్ ట్రెంబ్లే), ఎమిలీ (బ్రిట్నీ ఓ’గ్రాడీ). ఈ ముగ్గురి చుట్టే కథ తిరుగుతుంది. సారా భర్త చనిపోయాక ఒంటరి అవుతుంది. సింగిల్ మదర్ గా పిల్లలను పెంచుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఓ రోజు తల్లితో గొడవ పడతాడు జాక్. ఆ తరువాత ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అందులో భాగంగానే తమ ఇంటికి 40 మైళ్ళ దూరంలో ఉన్న హాలో రోడ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాక ఎవరో ఓ వ్యక్తిని యాక్సిడెంట్ చేసి తల్లికి ఫోన్ చేస్తాడు. దీంతో ఆ తల్లి ఈ కేసులో తన కొడుకు చిక్కుకోకూడదు అనే ఉద్దేశంతో, ఆ హత్యను దాచి పెట్టాలని ఉరుకులు పరుగులు పెడుతూ బయల్దేరుతుంది. కానీ మధ్యలోనే ఆమెకు ఓ మిస్టీరియస్ జంట తారసపడతారు. ఇంతకీ ఆ రోడ్ లో ఏముంది ? చివరకు హీరోయిన్ కు తెలిసిన షాకింగ్ నిజం ఏంటి ? ఆ మిస్టరీ జంట ఎవరు ? ఆమె తన కొడుకును దీని నుంచి ఎలా కాపాడుకుంది ? అనేది తెలుసుకోవాలంటే మూవీని చూడాల్సిందే.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×