E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి మరో షాక్.. విశ్వంకు నిజం చెప్పిన అమూల్య.. భాగ్యం ప్లాన్ ఏంటి..?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి మరో షాక్.. విశ్వంకు నిజం చెప్పిన అమూల్య.. భాగ్యం ప్లాన్ ఏంటి..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ మాత్రం ధీరజ్ని ఒక ఆట ఆడుకుంటుంది.. వీడు నాతో బాగా బెట్టు చేస్తున్నాడు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ప్రేమ. వాడి వస్తువులన్నీ తెచ్చి నా దగ్గర పెడుకుంటాను అప్పుడు కచ్చితంగా వాడు చచ్చినట్టు నాతో మాట్లాడతాడని ప్రేమ ప్లాన్ చేస్తుంది.. అటు అమూల్య విశ్వంతో మాట్లాడుతూ ఉంటుంది.. అయితే ఆ పెళ్లి సంబంధం చెడిపోవడానికి నేనే కారణం అని చెప్తాడు. ప్రేమ మాత్రం ధీరజ్ వెతుక్కుంటూ ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వేదవతి నా బిడ్డను ఏడిపిస్తున్నారా అని అంటుంది. అది ఏడిపించడం ఏంటి భార్యాభర్తల మధ్య ఉన్న రొమాన్స్ కదా అని నర్మదా అంటుంది. మీ ముసలి వాళ్లకి అర్థం కాదులే అని నర్మదా అనడంతో వేదవతి ఫీల్ అవుతుంది.. ప్రేమ దగ్గర తన వస్తువులు ఉన్నాయని తెలుసుకున్న ధీరజ్ ఎలాగైనా సరే వాటిని కొట్టేయాలని అనుకుంటాడు.. ప్రేమ, ధీరజ్ ఎలాగైనా సరే తనతో మాట్లాడేలా చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ధీరజ్ మాత్రం ప్రేమ తన వస్తువులను తన దగ్గర పెట్టుకుని అనుకుంటాడు.. ప్రేమ ప్లాన్ ఫెయిల్ అవుతుంది..అమూల్య పెళ్లి ఫిక్స్. అక్కడితో ఎపిసోడ్స్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. శ్రీవల్లి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్లారంట ఏం జరుగుతుందో ఏం పాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఆ పెళ్లి సంబంధం వాళ్ళు ఏమంటారు నాకు ఈ విషయం గడి పొడి ఎక్కువైపోయింది అని శ్రీవల్లి కంగారు పడిపోతూ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ రామరాజు వేదవతి రావడం చూస్తున్న శ్రీవల్లి వాళ్ల మొహాలు చూస్తుంటే ఈ సంబంధం ఓకే అయినట్టు లేదు అని అనుకుంటుంది.. రామరాజు ఇంట్లోకి రాగానే ఎమోషనల్ అవుతాడు. ఏంటి నాన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఏమైంది అని చందు అడుగుతాడు.. ఇది కన్నీళ్లు కాదురా ఆనందభాష్పాలు అని రామరాజు అంటాడు..

Advertisement

ఏమైంది నాన్న అంత ఆనందంగా ఉన్నారు అని రామరాజుని తన కొడుకుల అడుగుతారు. అయితే మీరు సంతోషించాల్సిన విషయమేరా ఇది అనేసి రామరాజు అంటాడు.. అమూల్యకొక మంచి సంబంధం కుదిరింది. అబ్బాయి చాలా మంచివాడు సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మన మార్కెట్ ఇన్చార్జి నీరజ గారి కొడుకే అబ్బాయి అని అంటారు. శ్రీవల్లి ఏంట్రా ఇంత షాకిచ్చారు ఏంట్రా బాబు అని అనుకుంటుంది.. ఇప్పుడు నన్ను ఆ బండ సచ్చినోడు అసలు బతకనివ్వడు. ఏదైనా నేను బలవకు తప్పదు.. అయితే ఈ పెళ్లి సంబంధం గురించి ఎలాగైనా సరే మా అమ్మ చెవులు ఊదాల్సిందే లేకపోతే నాకు కాళ్లు చేతులు ఆడవు అనే శ్రీవల్లి అనుకుంటుంది..

ఈ విషయాన్ని వెంటనే భాగ్యంతో చెప్పాలని శ్రీవల్లి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోతుంది. అటు అమూల్య కూడా విశ్వంకి విషయం చెప్పాలని అనుకుంటుంది.. అయితే విశ్వం నువ్వేం ఫీల్ అవ్వక అమూల్య నిన్ను జీవితంలో బాగా చూసుకోవాలని అనుకున్నాను అప్పుడే నాకు ఫోన్ చేసావు. మనం జీవితంలో చాలా హ్యాపీగా ఉంటాము నువ్వు బాధపడకు అని నాటకం మొదలు పెడతాడు.. అయితే అమూల్య నీకు అర్జెంటు గా ఒక విషయం చెప్పాలి అని అంటుంది.. ఎందుకు ఏమైంది అని అవిసం అడుగుతాడు. ఏం లేదు నాకు పెళ్లి ఫిక్స్ చేసారు ఎంగేజ్మెంట్ అని చెప్పగానే షాక్ అవుతాడు..

Advertisement

Also Read : హాస్పిటల్ లో రోహిణి.. మీనాకు నిజం తెలుస్తుందా? సుమతికి జాబ్ ఆఫర్..

భాగ్యంకు ఈ విషయం చెప్పగానే శ్రీవల్లి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అమ్మ నువ్వు ఏదో ఒకటి చెయ్యి లేకపోతే వాడు మనల్ని చంపేస్తాడు అని అంటారు.. ఇంత సడన్ గా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి అని.. ఇప్పుడు మనం అర్జెంటుగా పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్లి. అసలు నిజాన్ని బయట పెట్టాలి అని అంటారు.. ఇలాగైనా సరే సంబంధం అని చెడగొట్టాలని అందరూ కలిసి ప్లాన్ చేస్తారు. అక్కడితో ప్రోమో పూర్తి అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×