E-Paper
Advertisement

Psychological Thriller OTT : చచ్చినా వదలని భర్త… ముసలావిడను చూసుకోవడానికి వెళ్తే మతిపోగొట్టే ట్విస్టులు

Psychological Thriller OTT : చచ్చినా వదలని భర్త… ముసలావిడను చూసుకోవడానికి వెళ్తే మతిపోగొట్టే ట్విస్టులు
Advertisement

Psychological Thriller OTT : క్షణ క్షణం ఉత్కంఠంగా సాగే థ్రిల్లర్ సినిమాని చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. ఈ సినిమా పాతకాలపు హిచ్‌కాక్ థ్రిల్లర్ సినిమాలను గుర్తుకు తెస్తుంది. చివరివరకు కుర్చీలకు కట్టిపడేస్తుంది. ఈ సినిమా కథ డేల్ అనే నర్సు చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక వృద్ధురాలిని చూసుకోవడానికి ఒక ద్వీపంలోని ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత వింత సంఘటనలు ఎదురవుతాయి. అసలు అక్కడ ఏం జరిగింది ? ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అడుతుందంటే

2024లో వచ్చిన ఈ గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది రూస్’ (The Ruse). ఇది స్టీవన్ మేనా దర్శకత్వంలో రూపొందింది. ఇది చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శనకు వచ్చింది. ఇందులో వెరోనికా కార్ట్‌రైట్, మాడెలైన్ డండన్, మైఖేల్ స్టెగర్ లీడ్ రోల్స్ లో ఉన్నారు. ప్రస్తుతం prime Videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డేల్ అనే ఒక నర్సు, ఒలివియా అనే వృద్ధురాలికి హోమ్ కేర్ సేవలు అందించడానికి ఒక మారుమూల సముద్ర తీర ప్రాంతానికి వెళ్తుంది. అయితే ఆమె కంటే ముందు అక్కడ పని చేసిన నర్సు, అకస్మాత్తుగా మాయమైపోవడం ఆ ప్రాంతంలో పెద్ద మిస్టరీగా మారుతుంది. ఇక డేల్ ఆ ఇంట్లో చేరినప్పటి నుండి వాతావరణం చాలా భయంకరంగా, అక్కడ ఏదో తెలియని రహస్యం దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒలివియా ప్రవర్తన కూడా వింతగా ఉండటంతో, డేల్‌కు ఆ ఇంట్లో తన ప్రాణాలకు ముప్పు ఉందని అర్థమవుతుంది.

కథ ముందుకు సాగే కొద్దీ, ఆ ఇంట్లో ఒలివియా చనిపోయిన భర్త ఆత్మ తిరుగుతోందనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనిని డేల్ నమ్మడం మొదలు పెడుతుంది. కానీ అసలు నిజం దానికంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒలివియా కుటుంబంకి సంబంధించిన సీక్రెట్స్ ను కనిపెట్టడానికి డేల్ ప్రయత్నిస్తుంది. మాయమైన నర్సు ఏమైందో తెలుసుకోవాలనే ఆరాటం ఆమెను ప్రమాదంలోకి నెడుతుంది. చివరికి ఒక ఊహించని మలుపుతో అక్కడ జరుగుతున్న వింత సంఘటనల వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు ? మునుపటి నర్సు ఏమైంది? దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటనేది సినిమా క్లైమాక్స్‌లో తెలుస్తుంది.

Advertisement

Read Also : భయపడే వాళ్ళను బలి తీసుకునే ఆత్మలు… అడవి అంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేసే మూవీ

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×