BigTV English

OTT Movie : ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై పన్ను… ఫ్యామిలీతో చూడకూడని సీన్లున్న హిస్టారికల్ మూవీ

OTT Movie : ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై పన్ను… ఫ్యామిలీతో చూడకూడని సీన్లున్న హిస్టారికల్ మూవీ
Advertisement

OTT Movie : రాజులు పోయారు, రాజ్యాలు కూడా పోయాయి. కానీ చరిత్ర అలాగే మిగలిపోయింది. ఎన్నో ఎన్నో విధ్వంసాలు, మరెన్నో విజయాలతో చరిత్ర లిఖించబడి. అయితే చరిత్రకు ఎక్కని దారుణాలు కూడా చాలానే ఉన్నాయి. వీటిలో ప్రాధానమైన అంశం కులం. వంద సంవత్సరాల క్రితం ఈ సమస్య మరింత దారుణంగా ఉండేది. ఆడ వాళ్ల ప్రైవేట్ పార్ట్శ్ కి కూడా పన్నులు ఉండేవంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక హిస్టారికల్ మలయాళం సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇది 19వ శతాబ్దంలో ట్రావన్కూర్ మహారాజు కాలంలో, వేలయుధ చెకవర్ జీవితం ఆధారంగా తీయబడింది. ఒక యోధుడు కుల వివక్ష అన్యాయాలతో పోరాడి, దేవాలయ వస్తువులు దొంగిలించే రాజవాన్‌ అనే దోపిడీ దారుడితో తో ఫైట్ చేస్తాడు. ఆ ఆసక్తికరమైన సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే 

‘పులి’ (Puli : The 19th Century) అనే ఈ మలయాళం పీరియడ్ యాక్షన్ సినిమాకి వినయన్ దర్శకత్వం వహించారు. ఇందులో సిజు విల్సన్, కాయాడు లోహర్, దీప్తి సతి, అనూప్ మేనన్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి, IMDbలో 6.5/10 రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమా 2023 మార్చి 10న విడుదల అయింది. ప్రస్తుతం ఆహా, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

19వ శతాబ్దంలో ట్రావన్కూర్ రాజ్యంలో వేలాయుధ చెకవర్ అనే యోధుడు ఉండేవాడు. అతను ఒక తక్కువ కులానికి చెందినవాడు, కానీ చాలా ధైర్యవంతుడు. కత్తి సాములో ఆరితేరి ఉంటాడు. ఈ సమయంలో ట్రావన్కూర్ మహారాజు అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోని విలువైన వస్తువులు దొంగిలించే రాజవాన్ అనే దొంగతో ఇబ్బంది పడుతుంటాడు. రాజవాన్ చాలా తెలివైన, క్రూరమైనవాడు. మహారాజు వేలయుధను తన సైన్యంలోకి తీసుకుని, రాజవాన్‌ను పట్టుకోమని ఆదేశిస్తాడు. వేలయుధ తన ధైర్యంతో, స్కిల్స్‌తో రాజవాన్‌ను వెంబడిస్తాడు. కానీ అతని కులం వల్ల గ్రామంలో అవమానాలు ఎదుర్కొంటాడు. అయినా కూడా వేలయుధ కుల వివక్షతో పోరాడుతూ, రాజవాన్‌ను పట్టుకోవడానికి ప్లాన్ చేస్తాడు.


Read Also : ఏకాంతంగా గడపడానికి పొలిమేర ఇంట్లోకి… దోచుకోవడానికెళ్లే దొంగలకు దిమాక్ ఖరాబ్ షాక్… మైండ్ బెండింగ్ థ్రిల్లర్

మరోవైపు రాజవాన్ దేవాలయ వస్తువులు దొంగిలించడానికి తెలివైన ట్రిక్స్ వాడతాడు. అతన్ని పట్టుకోవడం కష్టమవుతుంది. ఈ సమయంలో వేలయుధకు దీప్తి అనే అమ్మాయి మద్దతుగా నిలుస్తుంది. ఇక్కడ కొంత మంది అగ్ర కులానికి చెందిన వాళ్ళు, తక్కువ కులానికి చెందిన ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్శ్ పై కూడా పన్ను వసూలు చేస్తుంటారు. ఈ విషయంలో వేలయుధ అక్కడి వాళ్ళని ఎదిరిస్తాడు. దీంతో దీప్తితో పాటు మరికొంతమంది అతనికి సప్పోర్ట్ గా నిలుస్తారు. చివరికి వేలయుధ, రాజవాన్‌ ను పట్టుకుంటాడా ? మహారాజు పరువు కాపాడతాడా ? కుల వివక్ష సమస్యలపై మార్పు తెస్తాడా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

OTT Movie : మెడికల్ కాలేజీలో వరుస మరణాలు… అమ్మాయిల టార్గెట్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : క్రిమినల్ ను పట్టుకోవడానికెళ్లి తప్పించుకోలేని ట్రాప్ లో… చిన్న పిల్లలు చూడకూడని సై-ఫై మూవీ

OTT Movie : కంటికి కన్పించని అబ్బాయితో ప్రేమ… డైరీనే దిక్కు… మస్ట్ వాచ్ మలయాళ అడ్వెంచర్ డ్రామా

OTT Movie :లేడీ డ్రైవర్ తో లేకి పనులు… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్… డోంట్ మిస్

OTT Movie : ట్రెండింగ్ లో తెలుగు సినిమా… ఓటీటీలో దుమ్మురేపుతున్న మంచు లక్ష్మి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్…

OTT Movie : ఏకాంతంగా గడపడానికి పొలిమేర ఇంట్లోకి… దోచుకోవడానికెళ్లే దొంగలకు దిమాక్ ఖరాబ్ షాక్… మైండ్ బెండింగ్ థ్రిల్లర్

OTT Movie : రోజుకో అబ్బాయితో ఆ పని… కోరిక తీర్చుకుని చంపేసే ఆడ పిశాచి… ఈ సిరీస్ తెలుగులోనే ఉంది

Big Stories

×