E-Paper
Advertisement

ఓటీటీలోకి రాధికా శరత్ కుమార్ తాయ్ కెలవి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి రాధికా శరత్ కుమార్ తాయ్ కెలవి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Radhika: రాధిక శరత్ కుమార్ (Radhika Sarathkumar).. ఒకప్పుడు తెలుగు దిగ్గజ స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక స్టార్ హోదాను దక్కించుకున్న రాధిక శరత్ కుమార్. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె 63 సంవత్సరాల వయసులో కూడా బాక్సాఫీస్ వద్ద తన మూవీ కలెక్షన్స్ తో విధ్వంసం సృష్టించి అబ్బురపరిచింది. రాధిక డీ గ్లామరస్ పాత్ర , నటన, కామెడీ, గ్రామీణ వాతావరణం, కథకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ ఏడాది తమిళ చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం తాయ్ కెలవి.

63 ఏళ్ల వయసులో రాధిక సాహసం..

రాధిక శరత్ కుమార్ తన ఇన్నేళ్ల కెరియర్లో మునుపెన్నడూ చేయని విధంగా భిన్నమైన వృద్ధురాలి గెటప్లో నటించి అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాత్ర పోషించడానికి ఆమె పడ్డ కష్టం స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. సుమారుగా మేకప్ వేసుకోవడానికి 5 గంటలు.. తీయడానికి రెండు గంటల సమయం పట్టేదట . ఈ వయసులో కూడా అంతటి కష్టంతో సినిమాపై తనకున్న అంకిత భావాన్ని రాధిక చాటుకున్నారు. మరి రాధిక నటించిన ఈ అద్భుత దృశ్య కావ్యం డిజిటల్ ఎంట్రీకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. ఆ సస్పెన్స్ కి తెర దించుతూ చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది.

తక్కువ బడ్జెట్.. కోట్లు కొల్లగొట్టిన రాధిక మూవీ..

Advertisement

ఫిబ్రవరి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం 9 కోట్ల బడ్జెట్తో ఏకంగా 450 కి పైగా థియేటర్లలో విడుదలై.. ఇండియాలో వచ్చిన గ్రాస్ తో పాటు ఓవర్సీస్ కలెక్షన్స్ మొత్తం కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80.16 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది ఈ సినిమా . అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధం అయ్యింది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..

ప్రముఖ ఓటీటీ దిగ్గజం జియో హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన 6 వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 10 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు జియో హాట్ స్టార్ ప్రకటించింది. మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ తాయ్ కెలవి ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Advertisement

ALSO READ:అనుష్క శెట్టి ‘కథనార్’ ట్రైలర్.. ఆ వీఎఫ్ఎక్స్ ఏంటి భయ్యా, హాలీవుడ్ రేంజ్ ఉంది!

తాయ్ కెలవితో ఊహించని విజయం..

తాయ్ కెలవి చిత్రాన్ని శివ కార్తికేయన్ , సుధన్ సుందరం నిర్మాతలుగా మారి ప్యాషన్ స్టూడియోస్, శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో సింగం పులి, మునిష్ కాంత్, ఇలవరసు, అరుళ్ దాస్, బాలా శరవణన్, రైచల్ రెబాకా తదితరులు కీలకపాత్రలు పోషించారు. శివకుమార్ మురుగేషన్ దర్శకత్వం వహించారు. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకొని ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×