E-Paper
Advertisement

ర్రేయ్ ఇలా కూడా ఉంటార్రా..? భార్యను చంపేందుకు భర్త క్షుద్రపూజలు, మర్రిచెట్టు కింద ఫోటోలతో..!

ర్రేయ్ ఇలా కూడా ఉంటార్రా..? భార్యను చంపేందుకు భర్త క్షుద్రపూజలు, మర్రిచెట్టు కింద ఫోటోలతో..!

మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆలోచనా ధోరణిలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఒకప్పుడు ఆప్యాయత అనురాగాలకు నిలయంగా ఉన్న ఉమ్మడి కుటుంబాలు.. ఇప్పుడు చిన్న చిన్న స్వార్థాల కోసం ఛిన్నాభిన్నం అవుతున్నాయి. రక్తసంబంధం అన్న విచక్షణ లేకుండా ఆస్తుల కోసం ప్రాణాలు తీయడం సర్వసాధారణమైపోయింది. తాజాగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన సమాజం ఎటు వెళ్తుందోనన్న ఆందోళన కలిగిస్తోంది. కట్టుకున్న భార్యను అడ్డు తొలగించుకునేందుకు ఒక భర్త అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డాడు. చదువుకున్న సమాజంలో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయా అనే అనుమానం కలిగించేలా అతను క్షుద్ర పూజల బాట పట్టాడు.

సాఫీగా సాగాల్సిన సంసారంలో..

పర్వతగిరి మండల పరిధిలోని వడ్లకొండ గ్రామంలో ఈ వింత ఉదంతం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మద్దేబోయిన రాజు, కవిత భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. సాఫీగా సాగాల్సిన సంసారంలో గొడవలు మొదలయ్యాయి. కవితను తన జీవితం నుంచి ఎలాగైనా శాశ్వతంగా దూరం చేయాలని భావించిన రాజు ప్రాణానికి ప్రాణంగా ఉండాల్సిన భర్త హోదాను మరిచిపోయాడు. ఆమెను చంపాలనే కుట్రతో మంత్ర తంత్రాల సహాయం కోరాడు. గ్రామ శివారులోని కంఠమహేశ్వర ఆలయ సమీపంలో ఉన్న ఒక మర్రిచెట్టును తన దుశ్చర్యకు వేదికగా ఎంచుకున్నాడు.

భార్య ఫోటో పెట్టి మరీ..

అర్థరాత్రి సమయంలో ఆ మర్రిచెట్టు కింద భార్య కవిత ఫోటో పెట్టి రాజు క్షుద్ర పూజలు నిర్వహించాడు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు వింత వస్తువులను అక్కడ ఉపయోగించాడు. కవిత ఫోటోపై మంత్రాలు చదువుతూ ఆమెకు హాని తలపెట్టేలా తంతు నిర్వహించాడు. ఈ విషయం బయటపడటంతో స్థానికులు నివ్వెరపోయారు. తన భర్త తనను అడ్డుతొలగించుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు కవిత ఆరోపిస్తోంది. సాధారణంగా ఏవైనా సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలి లేదంటే చట్టపరంగా ముందుకు వెళ్ళాలి. కానీ ఇలా ప్రాణాలు తీసేందుకు క్షుద్ర పూజలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

పోలీసులను ఆశ్రయించిన భార్య..

తన ప్రాణానికి ముప్పు ఉందని భావించిన కవిత వెంటనే ధైర్యంగా ముందుకు వచ్చింది. పర్వతగిరి పోలీసులను ఆశ్రయించి భర్త రాజుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తన ఫోటో పెట్టి మర్రిచెట్టు కింద పూజలు చేసిన ఆధారాలను కూడా ఆమె పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూఢనమ్మకాలతో ఇలాంటి పనులు చేయడం నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కొందరు ఇటువంటి అంధవిశ్వాసాలను నమ్మడం బాధాకరం.

ఈ ఘటన వడ్లకొండ గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భార్యను చంపాలని చూడటం ఒక ఎత్తయితే దానికి క్షుద్ర పూజలను ఎంచుకోవడం భయం గొలుపుతోంది. ప్రస్తుతం రాజు పరారీలో ఉన్నాడా..? లేక పోలీసుల అదుపులో ఉన్నాడా..? అనే కోణంలో విచారణ సాగుతోంది. సమాజంలో నైతిక విలువలు ఎలా పడిపోతున్నాయో చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. కట్టుకున్న వాడే కాలయముడిగా మారితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పర్వతగిరి పోలీసులు ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: Summer Tips: కొబ్బరి నీళ్ల ఖరీదు ఎక్కువని.. చెరకు రసం తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×