E-Paper
Advertisement

Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు రన్ టైం లాక్.. నిడివి ఎంతంటే?

Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు రన్ టైం లాక్.. నిడివి ఎంతంటే?
Advertisement

Anaganaga Oka Raju: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించిన నటుడు నవీన్ పోలిశెట్టి(Naveen polishetty) త్వరలోనే అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్టార్ హీరోలకు పోటీగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని పండుగకు నవ్వుల హంగామా ఉండబోతుందని చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ సినిమాకు మొదట కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మారి డైరెక్షన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటుందని తెలుస్తోంది.

రన్ టైం లాక్..

Advertisement

ఇప్పటికే ఎడిటింగ్ పనులన్నీ పూర్తి అయ్యాయని , ఎడిటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా 2 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఈ నిడివితో ఈ సినిమా లాక్ చేశారని తెలుస్తోంది. అయితే త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం అధికారికంగా సినిమా రన్ టైం ప్రకటించనున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం మొత్తం ప్రమోషన్ పనులలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి కి జోడిగా మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సింగర్ గా మారిన నవీన్ పోలిశెట్టి..

Advertisement

ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించగా,ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా కోసం నవీన్ పోలిశెట్టి ఏకంగా సింగర్ గా కూడా మారిన సంగతి తెలిసిందే. మొత్తానికి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న నవీన్ పోలిశెట్టి ప్రభాస్, చిరంజీవి రవితేజ లాంటి హీరోలను ఢీకొడుతూ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇలా ఈ సినిమాలు మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విజయ్ దళపతి, శివ కార్తికేయన్ పరాశక్తి వంటి సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Anil Ravipudi on Shivaji: ‘తప్పు లేదు’… శివాజీ కామెంట్స్‌పై అనిల్ రావిపూడి రియాక్షన్

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×