E-Paper
Advertisement

Pawan – Lokesh: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. పవన్ కళ్యాణ్‌తో లోకేశ్ భేటి.. కీలక అంశాలపై చర్చ!

Pawan – Lokesh: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. పవన్ కళ్యాణ్‌తో లోకేశ్ భేటి.. కీలక అంశాలపై చర్చ!
Advertisement

Pawan – Lokesh: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ నుంచి వారు వాకౌట్ చేయడంపై అంతే చర్చ జరిగింది. ఈ పరిణామల క్రమంలోనే అసెంబ్లీలో మరో ఆసక్తిక ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నారా లోకేష్ స్వయంగా వెళ్లి భేటి కావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

శాసనసభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఐటీ మంత్రి నారా లోకేష్ వ్యక్తిగతంగా కలిశారు. అసెంబ్లీలోని పవన్ పేషీకి స్వయంగా వెళ్లిన లోకేశ్.. డిప్యూటీ సీఎంను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అటు పవన్ సైతం ఏంతో అప్యాయంగా లోకేశ్ ను హత్తుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు శాసన సభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisement

గతంలోనూ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ భేటి అయ్యారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి వివాదం, అంబటి రాంబాబు అరెస్టు, జంతు కొవ్వు లేదంటూ జగన్ ఎదురుదాడి పరిణామాల నేపథ్యంలో పవన్, లోకేశ్ భేటి ఆసక్తికరంగా మారింది. మరోవైపు నారా లోకేశ్ దిల్లీకి సైతం వెళ్లబోతున్నారన్న ప్రచారం ఏపీ వర్గాల్లో జరుగుతోంది. మంగళవారమే సీఎం చంద్రబాబు దిల్లీలో పర్యటించి వచ్చారు. ఇప్పుడు లోకేశ్ సైతం దిల్లీకి వెళ్తారన్న ప్రచారం పలు అనుమానాలకు తావిస్తోంది. కల్తీ నెయ్యిపై సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక గురించి కేంద్రంతో లోకేశ్ చర్చించనున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్ తో భేటి అయ్యి ఉండొచ్చన్న అభిప్రాయాలను రాజకీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Best ACs Under Rs 20,000: సమ్మర్ స్పెషల్ ఏసీలు.. రూ.20,000లోపు ది బెస్ట్ ఇవే.. ఓసారి ట్రై చేయండి!

Advertisement

ఇదిలా ఉంటే పవన్, నారా లోకేశ్ మధ్య బలమైన సోదర బంధం ఏర్పడింది. ఆయన పలు వేదికల్లో పవన్ ను అన్న అని సంబోధించడం చూడవచ్చు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ – లోకేశ్ మధ్య అప్యాయత దృశ్యాలు అటు టీడీపీ, ఇటు జనసేన శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆనందాన్ని కలిగించాయి. తాజాగా మరోమారు పవన్, లోకేశ్ ఒకరినొకరు హత్తుకున్న ఫొటోలు.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Also Read: Telangana Muncipal Elections 2026: జోరుగా మున్సిపల్ పోలింగ్.. ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పలుచోట్ల ఉద్రిక్తతలు

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×