E-Paper
Advertisement

Pradeep Ranganathan: నిర్మాతగా మారనున్న ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్గా తొలి అవకాశం ఆమెకే?

Pradeep Ranganathan: నిర్మాతగా మారనున్న ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్గా తొలి అవకాశం ఆమెకే?
Advertisement

Pradeep Ranganathan: చిత్ర పరిశ్రమలో నటీనటులు తమ ఉనికిని చాటుకోవడానికి భిన్న విభిన్నమైన జానర్లలో చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. మరొకవైపు హీరోగా, హీరోయిన్ గానే పరిమితం కాకుండా ఇటు దర్శకులుగా.. నిర్మాతలుగా మారి సత్తా చాటుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే 24 శాఖలలో కనీసం కొన్నింటిలోనైనా తమ టాలెంటును ప్రూవ్ చేసుకోవాలని పరితపించే సెలబ్రిటీలు కూడా లేకపోలేదు.

నిర్మాతలుగా మారుతున్న హీరోలు..

ఇకపోతే ఈ విషయం కాస్త పక్కన పెడితే.. చాలా మంది హీరోలు ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు దర్శకులుగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇంకొంతమంది నిర్మాతగా తమ టాలెంటును ప్రూవ్ చేసుకుంటున్నారు.. మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిర్మాతగా సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే టాలీవుడ్ లో ఉండే ఎంతమంది హీరోలు ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతలుగా సక్సెస్ అవుతుంటే ఇప్పుడు మరో హీరో కూడా ఏకంగా నిర్మాతగా మారారు.. పైగా తన నిర్మాణంలో వస్తున్న మొదటి సినిమాకు హీరోయిన్గా తన హీరోయిన్ కే ఛాన్స్ ఇవ్వడం గమనార్హం.

నిర్మాతగా ప్రదీప్ తొలి అడుగు..

Advertisement

ఆయన ఎవరో కాదు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) . యూట్యూబర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా, నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు నిర్మాతగా అడుగులు వేస్తున్నారు. కోమాలి అనే సినిమాతో 2019లో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రదీప్ రంగనాథన్.. 2022లో లవ్ టుడే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. అలాంటి ఈయన తాజాగా ఒక నిర్మాణ సంస్థను స్థాపించి, ఈ చిత్రం ద్వారా ప్రముఖ హీరోయిన్ మమిత బైజు (Mamitha baiju) తో సినిమా చెయ్యనున్నారు..

దర్శకుడిగా పరిచయమవుతున్న అసోసియేటెడ్ డైరెక్టర్..

నిజానికి ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘డ్యూడ్’ సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది . అటు తెలుగు, తమిళ్ భాషలో విడుదలైన ఈ సినిమా వీరిద్దరికీ మంచి విజయాన్ని అందించింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ జంటగా కాకుండా ప్రదీప్ నిర్మాణంలో మమిత ఒక కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పైగా ఈ చిత్రానికి ప్రదీప్ అసోసియేటెడ్ డైరెక్టర్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

ALSO READ:Actress Poorna: మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!

వరుస చిత్రాలతో బిజీగా మారిన మమితా బైజు..

పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. గత ఎనిమిదేళ్లుగా తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ తన సక్సెస్ రేటును పెంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. దీనికి తోడు విజయ్ దళపతి జననాయగన్ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈమె.. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కార’ సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే ఒక మలయాళం చిత్రంలో కూడా నటిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ నిర్మాణంలో వస్తున్న ఒక కొత్త సినిమాకి కూడా మమిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికైతే వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×