E-Paper
Advertisement

Romantic Comedy OTT : సినీయర్ అమ్మాయితో లవ్… ఫ్రెష్ ఫీల్ ఇచ్చే రొమాంటిక్ స్టోరీ… లవ్ లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

Romantic Comedy OTT : సినీయర్ అమ్మాయితో లవ్… ఫ్రెష్ ఫీల్ ఇచ్చే రొమాంటిక్ స్టోరీ… లవ్ లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్
Advertisement

Romantic Comedy OTT : మంచి స్టోరీతో మనసుకు హత్తుకునే ప్రేమ కథలను ఆడియన్స్ ఎప్పటికీ ఆదరిస్తారు. కానీ ఇప్పుడు రెగ్యులర్ రొటీన్ ప్రేమకథలకు కాలం చెల్లిందనే చెప్పాలి. కథ ఏమాత్రం రొటీన్ గా ఉంది అన్పించినా సరే, కనీసం ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది ? ఎప్పుడు పోయిందో కూడా పట్టించుకోరు. అందుకే దర్శకులు సైతం ప్రేక్షకుల దృష్టిని అట్రాక్ట్ చేసేందుకు డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి ఓ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ కథేంటి ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

తమిళంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా పేరు ‘ఆరోమలే’ (Aaromaley). కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ ఇందులో మెయిన్ లీడ్స్ గా నటించారు. సారంగ్ త్యాగు దర్శకత్వం వహించిన ఈ మూవీ గత ఏడాది నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చింది. బిగ్ స్క్రీన్ పై యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, ఓటీటీలో మాత్రం ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. 2025 డిసెంబర్ 12 నుంచి ‘జియో హాట్ స్టార్’ (Jio Hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో రూపొందిన ఈ సినిమాను ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు తెలుగులోనూ ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే సాధారణంగా పెళ్లి అంటే చాలా మంది దూరం పారిపోతారు. కానీ ప్రేమలో మాత్రం వద్దన్నా పడతారు. ఆ తరువాత సమస్యలను ఏరికొరి తెచ్చుకుంటారు. అలా ప్రేమ కోసం తపించే ఓ యువకుడి కథే ఈ మూవీ. ఆల్రెడీ లవ్ లో ఉన్న వాళ్ళకు ఈ మూవీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది.

Advertisement

Read Also : నరకం లాంటి ఇంట్లో నలిగిపోయే అమ్మాయి… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

మిడిల్ క్లాస్ కుర్రాడు అజిత్ (కిషన్ దాస్). టీనేజ్ లో ఉన్నప్పుడే తనకు ఓ అందమైన లవ్ స్టోరీ ఉండాలని ఫిక్స్ అవుతాడు. దానికి ఓ సినిమానే కారణం. స్కూల్‌ లో చదువుతున్నప్పుడే లవ్ స్టోరీని షురూ చేస్తాడు. ముందుగా స్మృతిని ఇష్టపడతాడు. ఆ తరువాత కాలేజీలో మేఘ అనే అమ్మాయిని ట్రై చేస్తాడు. చివరకు స్నేహ (మేఘా ఆకాశ్)ని లవ్ చేస్తాడు. కానీ వాళ్లలో ఒక్కరు కూడా ఇతన్ని పట్టించుకోరు. చదువు పూర్తయిపోగానే మ్యాట్రిమోనీ కంపెనీలో జాబ్ చేస్తాడు. కానీ నిజానికి అతనికి ఈ జాబ్ ఇష్టం ఉండదు. తప్పని పరిస్థితిలో ఆ ఉద్యోగంలో చేరతాడు. అక్కడ అంజలి (శివాత్మిక రాజశేఖర్) అనే అమ్మాయిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు. కానీ తనే ఇతని టీం లీడర్ కావడంతో షాక్ అవుతాడు. ప్రేమ అంటేనే టైమ్ వేస్ట్ వ్యవహారం అనుకునే అమ్మాయి హీరోయిన్. మరి వీళ్లిద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ? చివరికి తన లైఫ్ లో మంచి లవ్ స్టోరీ ఉండాలని కోరుకున్న హీరో కోరిక తీరిందా ? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×