E-Paper
Advertisement

Romantic drama OTT: బయట శత్రువులే కానీ లోపల మాత్రం మ్యాటర్ వేరే… ఓటిటిలో దుమ్ము దులుపుతున్న రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా

Romantic drama OTT: బయట శత్రువులే కానీ లోపల మాత్రం మ్యాటర్ వేరే… ఓటిటిలో దుమ్ము దులుపుతున్న రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా
Advertisement

Romantic drama OTT : ఓటీటీలో అనేక సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయి. అయితే లెస్బియన్ నేపథ్యంలో చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాతో వచ్చిన ఈ కంటెంట్ ను ఆడియన్స్ కూడా క్రేజీగా చూస్తున్నారు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ 9/10 రేటింగ్ తో నడుస్తోంది. భారతదేశంలో స్వలింగ సంపర్కం నేరం కాదని చట్టం చెప్పినప్పటికీ, సామాజికంగా ఇంకా అనేక అవరోధాలు ఉన్నాయి. అయితే మీరు ఒక మంచి ప్రేమకథను, అది కూడా క్రీడల నేపథ్యంలో చూడాలనుకుంటే ఈ సిరీస్ ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఇది కేవలం ఒకసారి చూసి వదిలేసేది కాదు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఒక మాస్టర్ పీస్.

ఎక్కడ చూడచ్చు

రాచెల్ రీడ్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘గేమ్ ఛేంజర్స్’ ఆధారంగా దర్శకుడు జాకబ్ టైర్నీ ‘హీటెడ్ రైవల్రీ’ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో షేన్ హాలెండర్‌గా హడ్సన్ విలియమ్స్, ఇల్యా రొజానోవ్‌గా కానర్ స్టోరీ నటించారు. ఇప్పుడు మన దేశంలో ‘లయన్స్‌గేట్ ప్లే’ (Lionsgate Play) వేదికగా ఇది ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ఆరు ఎపిసోడ్ల సిరీస్ ప్రజాదరణను చూసి, రెండవ సీజన్‌ను కూడా ఇప్పటికే ఖరారు చేశారు. ఇది రాచెల్ రీడ్ తదుపరి నవల ‘ది లాంగ్ గేమ్’ (The Long Game) ఆధారంగా రూపొందనుంది. దీని షూటింగ్ 2026లో ప్రారంభమై, 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఐస్ హాకీ క్రీడలో ప్రత్యర్థులైన ఇద్దరు ఆటగాళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒకరు కెనడియన్ ప్లేయర్ షేన్ హాలండర్ (హడ్సన్ విలియమ్స్), మరొకరు రష్యన్ ఆటగాడు ఇల్యా రోజనోవ్ (కానర్ స్టోరీ). వీళ్ళిద్దరూ ఆటలో బద్ధ శత్రువులు, ఒకరినొకరు అస్సలు ఇష్టపడరు. కానీ అందరికీ తెలిసింది కేవలం వాళ్ల మధ్య ఉన్న పోటీ మాత్రమే. అసలు విషయం ఏంటంటే, ఎవరికీ తెలియకుండా వీళ్ళిద్దరి మధ్య ఒక రహస్య ప్రేమ బంధం పదేళ్ల పాటు కొనసాగుతుంది. ఆటలో గెలవాలనే పట్టుదల, సమాజం ఏమనుకుంటుందో అనే భయం మధ్య వీళ్ళు తమ ప్రేమను ఎలా కాపాడుకున్నారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఇక మైదానంలో తలపడేటప్పుడు రగిలే పంతాలు, వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఉండే ఎమోషన్స్ మధ్య కథ సాగుతుంది. షేన్ చాలా పద్ధతిగా ఉంటే, ఇల్యా కాస్త అల్లరిగా, ముక్కుసూటిగా ఉంటాడు. వీరిద్దరి భిన్నమైన వ్యక్తిత్వాలు ఒకరినొకరు ఎలా ఆకర్షించాయి ? ప్రపంచానికి తెలియకుండా తమ రిలేషన్‌షిప్‌ని ఎలా మెయింటైన్ చేశారు ? అనేది ఈ సిరీస్‌లో ప్రధానంగా చూపించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఎమోషనల్ అండ్ రొమాంటిక్ జర్నీ ఇది.

Advertisement

Read Also : 70 ఏళ్ల వయసులో విడాకుల కోసం… పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా రొమాంటిక్ కామెడీ ఓటీటీలోకి… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే?

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×