E-Paper
Advertisement

Blue Drum Horror: బ్లూ డ్రమ్ హత్య కలకలం.. బిజినెస్‌మేన్‌ని చంపిన కొడుకు, సోదరి ముందే ఆ పని

Blue Drum Horror: బ్లూ డ్రమ్ హత్య కలకలం.. బిజినెస్‌మేన్‌ని చంపిన కొడుకు, సోదరి ముందే ఆ పని
Advertisement

Blue Drum Horror: కెరీర్ వ్యవహారం తండ్రి-డుకుల మధ్య చిచ్చుపెట్టింది. రాను రాను ఆ వ్యవహారం ముదిరిపాకాన పడింది. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. చివరకు పట్టరాని కోపంతో తండ్రిని కాల్చి చంపాడు కన్న కొడుకు.తన సోదరి ముందు తండ్రిని ముక్కలు ముక్కలుగా చేసి బ్లూ డ్రమ్‌లో దాశాడు. సంచలనం రేపిన ఈ ఘటన లక్నోలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?

లక్నోలో దారుణం.. బ్లూ డ్రమ్ హత్య కలకలం

Advertisement

యూపీలోని లక్నో సిటీలో వ్యాపారి మన్‌వేంద్ర సింగ్ ఫ్యామిలీ ఉంటుంది. ఆయన వయస్సు 41 ఏళ్లు. పార్మాసూటికల్, లిక్కర్ వ్యాపారం చేస్తుంటాడు ఆయన. మానవేంద్రసింగ్‌కు కొడుకు-కూతురు ఉన్నారు. కొడుకు పేరు అక్షత్‌ ప్రతాప్‌ సింగ్‌‌ని డాక్టర్‌ని చేయాలన్నది తండ్రి కోరిక. కానీ కొడుకు ఆలోచన మరోలా ఉండేది.

తనకు నచ్చిన రంగంలో సెటిల్ కావాలని భావించేవాడు. ఈ విషయంలో తండ్రి-కొడుకుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. తండ్రితో విభేదించి రెండు మూడుసార్లు ఇంట్లో నుంచి పారిపోయాడు అక్షత్‌. మళ్లీ తిరిగి ఇంటికి వచ్చాడనుకోండి అది వేరే విషయం.  ఆ తర్వాత కూడా మళ్లీ తండ్రీ-కొడుకుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.

Advertisement

కెరీర్ వ్యవహారం..  సోదరి ముందే ఆ పని అన్న

ఫిబ్రవరి 21న సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఇదే విషయమై మన్‌వేంద్ర‌సింగ్-అక్షత్‌కు మద్య మరోసారి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన అక్షత్‌ ఇంట్లో రివాల్వర్‌తో తండ్రిపై కాల్పులు జరిపాడు. స్పాట్‌లో తండ్రి మృతి చెందాడు. అప్పటికీ కొడుకు అక్షత్‌ కోపం చల్లారలేదు. తండ్రి బాడీని మూడో అంతస్తు నుంచి శరీరాన్ని కిందికి తీసుకొచ్చాడు.

ఖాళీ గదిలో తండ్రి శరీరాన్ని ముక్కలు చేశాడు. తండ్రి శరీరాన్ని పైనుంచి కిందకు తీసుకొచ్చినప్పుడు అక్షత్ సోదరి చూస్తూ మౌనంగా ఉండిపోయింది. తాను ఏమైనా మాట్లాడితే సోదరుడు తనను చంపిస్తాడని భయంతో వణికిపోయింది. తండ్రి శరీర భాగాలను ప్లాస్టిక్‌లో ప్యాక్ చేశాడు. వాటిలో కొన్నింటిని సమీప ప్రాంతంలో విసిరి పారేశాడు. మిగతా భాగాలను ఇంట్లో ఉన్న బ్లూ డ్రమ్‌లో ఉంచాడు.

ALSO READ:  వికారాబాద్‌లో దారుణం.. ప్రాణ స్నేహితుడిని ముక్కలు ముక్కలుగా నరికి..

మన్వేంద్ర‌సింగ్ కనిపించకుండా పోయినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు, మానవేంద్ర ఇంటికి వెళ్లారు. అన్ని పరిశీలించారు, చివరకు అతడి శరీర భాగాలను బ్లూ డ్రమ్‌లో కనుగొన్నారు. కొడుకు అక్షత్ ప్రతాప్ సింగ్‌ని పోలీసులు విచారించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేయడంలో అసలు విషయం బయటపడింది.

పైన జరిగినదంతా పోలీసులకు విడమరిచి చెప్పాడు. ఫోరెన్సిక్ బృందాన్ని పిలిచి, ఇంట్లో సాక్ష్యాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం వ్యాపారి శరీర భాగాలను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అక్షత్ అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇలాంటి బ్లూ డ్రమ్ హత్యలు యూపీలోనే జరిగాయి. ఇప్పుడు అదే తరహాలో జరగడంతో దీనిపై అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×