E-Paper
Advertisement

Romantic Drama OTT: 24 ఏళ్ల యువకుడితో 40 ఏళ్ల ఆంటీ ప్రేమ… కూతురు ఉన్నా కోరిక తీరక…

Romantic Drama OTT: 24 ఏళ్ల యువకుడితో 40 ఏళ్ల ఆంటీ ప్రేమ… కూతురు ఉన్నా కోరిక తీరక…
Advertisement

Romantic Drama OTT : ఒక మగాడు తనకన్నా చాలా తక్కువ వయసు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సమాజం ఏమనదు కానీ, ఆడది చిన్నోడిని ప్రేమిస్తే రచ్చ చేస్తుంది. ఈ పాయింట్‌ ఆధారంగా ఓ సినిమా రూపొందింది. ఈ కథ సోలిన్ అనే 40 ఏళ్ల ఒంటరి తల్లి, హేయ్స్ కాంప్‌బెల్ అనే 24 ఏళ్ల పాప్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. వీళ్లిద్దరి మధ్య వయసు చాలా తేడా ఉన్నప్పటికీ, వాళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇది ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. క్లైమాక్స్ వరకు ఈ సినిమా ఆసక్తిగా సాగుతుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్

ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘ది ఐడియా ఆఫ్ యూ’ (The Idea of You). ఇందులో అన్నే హాత్వే, నికోలస్ గాలిట్జైన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కథలోని హీరో హేయ్స్ కాంప్‌బెల్ పాత్ర, రియల్ లైఫ్ పాప్ స్టార్ హ్యారీ స్టైల్స్ ఆధారంగా రాశారని గట్టి టాక్. రచయిత్రి రాబిన్ లీ మొదట్లో ఒప్పుకోకపోయినా, హ్యారీ స్టైల్స్ వీడియోలు చూసి ఇన్ స్పైర్ అయ్యానని తర్వాత హింట్ ఇచ్చింది. నిజ జీవితంలో కూడా అన్నే హాత్వే (41), నికోలస్ గాలిట్జైన్ (29) మధ్య వయసు తేడా ఉండటంతో ఆ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కథలో హీరోయిన్ సోలిన్ 40 ఏళ్ల సింగిల్ మదర్. తన కూతురిని తీసుకొని ఒక పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్తుంది. అక్కడ అనుకోకుండా హేయ్స్ అనే కుర్రాడిని కలుస్తుంది. అతను మామూలోడు కాదు, ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉన్న ఒక పెద్ద పాప్ స్టార్. వయసులో అతను హీరోయిన్ కంటే 16 ఏళ్లు చిన్నోడు. కానీ చూడగానే మనోడు హీరోయిన్ కి పడిపోతాడు. పెద్ద పెద్ద కళ్లు, మెచ్యూరిటీ చూసి ఫిదా అయిపోయి, ఆమె వెనకాల పడతాడు. హీరోయిన్ మొదట్లో అరేయ్ బాబు.. నాకు కూతురు ఉంది, నీకు నాకు సెట్ కాదని వారించినా, అతను మాత్రం వదలడు.

మొత్తానికి ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుంది. అయితే ఈ విషయం బయట పడగానే మీడియా, జనం ఊరుకుంటారా? ముసలమ్మకు దసరా పండుగ అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెడతారు. పాప్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఆమెను టార్గెట్ చేసి నానా రచ్చ చేస్తారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరి మధ్య గొడవలు, బ్రేకప్‌లు కూడా అవుతాయి. అయితే విడిపోయిన ఐదేళ్ల తరువాత ఊహించని మలుపు ఉంటుంది. ఆ మలుపు ఏమిటి ? వీళ్ళు మళ్లీ కలుస్తారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకొనాల్సిందే.

Advertisement

Read Also : కాబోయే మొగుడు ఇంకో పిల్లతో… లోకం చూపించే కొత్త ప్రియుడు… కన్నీళ్ళు పెట్టించే క్లైమాక్స్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×