E-Paper
Advertisement

Romantic Drama OTT : కాబోయే మొగుడు ఇంకో పిల్లతో… లోకం చూపించే కొత్త ప్రియుడు… కన్నీళ్ళు పెట్టించే క్లైమాక్స్

Romantic Drama OTT : కాబోయే మొగుడు ఇంకో పిల్లతో… లోకం చూపించే కొత్త ప్రియుడు… కన్నీళ్ళు పెట్టించే క్లైమాక్స్
Advertisement

Romantic Drama OTT : కొన్ని లో బడ్జెట్ సినిమాలు సంచలనాలు సృష్టిస్తుంటాయి. నిర్మాతలకు కాసుల వర్షం కూడా కురిపిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కనీసం సిక్స్ ప్యాక్ హీరో కూడా ఉండడు. కేవలం ఒక కామెడీ ఫేస్ తో ఈ సినిమాని తీయడం జరిగింది. అయితే ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మారథం పట్టారు. ఇది అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా కథ మొత్తం జపాన్‌లోని సప్పోరో నగరంలో జరుగుతుంది. అక్కడ ఉండే మంచు, అందమైన లొకేషన్లు సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక, జపాన్‌లోని ఆ ప్రాంతానికి వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా పెరిగిందట! మరి ఆ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘కిట కిట’ (Kita Kita). అనేది 2017లో వచ్చిన ఈ సినిమా సిగ్రిడ్ ఆండ్రియా పి. బెర్నార్డో దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో అలెశాండ్రా డి రోస్సీ (లీయా పాత్రలో), ఎంపోయ్ మార్క్వెజ్ (టోన్యో పాత్రలో) నటించారు. ఇక ఈ సినిమా తీయడానికి పెట్టిన ఖర్చు కేవలం 10 మిలియన్ల రూపాయలు (ఫిలిప్పీన్ కరెన్సీలో). కానీ థియేటర్లలో ఇది వసూలు చేసింది ఏకంగా 320 మిలియన్లు! అంటే పెట్టిన దానికి 30 రెట్లు లాభం అన్నమాట. ఫిలిప్పీన్స్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండిపెండెంట్ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దీనిని వేరే భాషల్లోకి కూడా తీశారు. కన్నడలో “అమ్మ ఐ లవ్ యూ” అని చిరంజీవి సర్జా హీరోగా రీమేక్ చేశారు. అప్పట్లో సూర్య కూడా ఈ సినిమా హక్కులు తీసుకున్నారని టాక్ నడిచింది, కానీ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో (Prime Video)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జపాన్ దేశంలో మన తెలుగు అమ్మాయి లాంటి ఒక ఫిలిప్పీన్ అమ్మాయి (లీయా) టూర్ గైడ్‌గా పనిచేస్తుంటుంది. అయితే తన కాబోయేవాడు ఇంకో పిల్లతో తిరగడం కళ్ళారా చూసి, ఆ షాక్‌లో పాపం తనకి కళ్ళు కనిపించకుండా పోతాయి. ఆ బాధలో ఉన్నప్పుడు, ఒక సరదా కుర్రాడు (టోన్యో) ఆమె ఇంటి పక్కన చేరతాడు. అతను చూడటానికి అంత అందగాడు కాకపోయినా, ఆమెకి ఏవేవో వండి పెట్టడం, జోకులు వేయడం చేస్తూ మెల్లగా ఆమె మనసు గెలుచుకుంటాడు. అతను చేసే అల్లరి, చూపించే ప్రేమకి ఆ అమ్మాయి పడిపోద్ది. కళ్ళు కనిపించకపోయినా వాడి మాటల మీద నమ్మకంతో ఇద్దరూ కలిసి జపాన్ రోడ్ల మీద తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తారు.

కట్ చేస్తే, ఆమెకి మళ్ళీ కళ్ళు వస్తాయనే టైమ్‌లో ఒక పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది. అసలు టోన్యో ఆ అమ్మాయి జీవితంలోకి ఊరికే రాలేదు, దాని వెనుక ఒక పెద్ద ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. క్లైమాక్స్ ఏంటంటే, ఇప్పుడు టోన్యో ఒక యాక్సిడెంట్‌లో చనిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయికి కళ్ళు వస్తాయి. తీరా చూస్తే, అతను తన గురించి రాసుకున్న డైరీ కనిపిస్తుంది. అందులో ఏముంటదంటే.. ఆ అమ్మాయికి కళ్ళు ఉన్నప్పటి నుంచే టోన్యో ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. ఆమెకి చూపు పోయినప్పుడు వాడే తోడుగా నిలబడ్డాడని తెలిసి ఏడుస్తుంది. ఈ క్లైమాక్స్ మాత్రం అందరినీ ఏడిపిస్తుంది. అయితే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఈ సినిమాను చూస్తే.

Advertisement

Read Also : ప్రేక్షకుల మనసును దోచిన బీటెక్ ప్రేమ… మూడు సీజన్లతో ముచ్చటగా

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×