E-Paper
Advertisement

డెబ్బై ఏళ్ల తర్వాత కూడా డెడ్లీ రొమాన్స్ తో ఇరక్కొట్టిన జోడి… లవ్ స్టోరీస్ లో మాస్టర్ పీస్ మావా

డెబ్బై ఏళ్ల తర్వాత కూడా డెడ్లీ రొమాన్స్ తో ఇరక్కొట్టిన జోడి… లవ్ స్టోరీస్ లో మాస్టర్ పీస్ మావా
Advertisement

Romantic Drama OTT : ప్రేమ కథలు అంటే ముందుగా మనకు లైలా మజ్ను, పారు దేవదాస్ ల స్టోరిలు గుర్తుకు వస్తాయి. అయితే అంతకు మించిన స్టోరీగురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.  అయితే ఈ స్టోరీ ఎండింగ్ కూడా అదిరిపోతుంది. దీనిని చూస్తే అంత సులువుగా మరిచిపోలేరు. తరతరాలుగా నిలిచిపోయే ఒక గొప్ప ప్రేమకథ ఇది. ముఖ్యంగా ఒక వర్షంలో ముద్దు సీన్‌కి ‘బెస్ట్ కిస్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకు. దీనికి ఐయండిబిలో 7.8 రేటింగ్ కూడా ఉంది. ప్రేమికులు అస్సలు మిస్ కాకూడని సినిమా ఇది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ క్లాసిక్ అమెరికన్ రొమాంటిక్ మూవీ పేరు ‘ది నోట్ బుక్’ (The Notebook). నిక్ కాసావెట్స్ దీనికి దర్శకత్వం వహించారు. నికోలస్ స్పార్క్స్ రాసిన పాపులర్ నవల ఆధారంగా ఇది రూపొందింది. అసలు విషయం ఏంటంటే, ఇది వాళ్ల తాతయ్య, అమ్మమ్మల రియల్ స్టోరీ. వాళ్లు కూడా 60 ఏళ్ల పాటు అంతటి గాఢమైన ప్రేమతో కలిసి ఉన్నారు. అందుకే స్టోరీ అంత చక్కగా రచించారు. ఈ నవల కూడా బాగా పాపులర్. ఇక సినిమా షూటింగ్ మొదట్లో హీరో ర్యాన్ గోస్లింగ్, హీరోయిన్ రాచెల్ మెక్‌ఆడమ్స్ అస్సలు పడేది కాదు. ఒకానొక దశలో ర్యాన్ గోస్లింగ్ డైరెక్టర్‌తో ఈమెను తీసేసి వేరే హీరోయిన్‌ని పెట్టండని కూడా గొడవ పడ్డాడు. కానీ తర్వాత వాళ్లిద్దరూ నిజ జీవితంలో కూడా కొన్ని ఏళ్ల పాటు ప్రేమలో ఉండటం విశేషం. ఈ సినిమా 2004లో రిలీజ్ అయింది. అంటే ఇప్పటికి దాదాపు 20 ఏళ్లు దాటినా, ఇప్పటికీ ప్రపంచంలోనే బెస్ట్ రొమాంటిక్ మూవీస్ లిస్టులో ఇది టాప్‌లో ఉంటుంది. 2005లో టీన్ ఛాయిస్ అవార్డ్స్ లో ఈ సినిమా ఏకంగా 8 అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక సిటీలో నోహ్ అనే ఒక మామూలు కుర్రాడు ఉంటాడు. అతను ఒకరోజు అల్లి అనే ఒక రిచ్ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఇద్దరూ కలిసి ఆ వేసవి కాలం అంతా పిచ్చపిచ్చగా తిరుగుతారు, ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ సీన్ కట్ చేస్తే.. అల్లి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ప్రేమకు అడ్డుపడతారు. ఆ పేదోడు, నీకు సెట్ కాడని చెప్పి ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోతారు. దూరమైనా సరే, నోహ్ ఆమెను మర్చిపోలేక రోజుకో ఉత్తరం రాస్తాడు. కానీ ఆ ఉత్తరాలు అల్లికి చేరకుండా వాళ్ళ అమ్మ దాచేస్తుంది. అలా కాలం గడిచిపోతుంది, అల్లికి వేరే పెద్ద సంబంధం కుదురుతుంది. కరెక్ట్‌గా పెళ్లి టైమ్‌లో, అల్లి కోసం నోహ్ ఒక అందమైన ఇల్లు కట్టాడని పేపర్‌లో చూస్తుంది. అది చూడగానే పాత ప్రేమ గుర్తొచ్చి, అల్లి పరుగున వెళ్లి నోహ్‌ను కలుస్తుంది.

ఇక ఇద్దరి మధ్య మళ్ళీ ఆ పాత ప్రేమ మొదలవుతుంది. ఈ కథ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇదంతా ఇప్పుడు డెబ్బై ఏళ్ల ఒక ముసలాయన తన పక్కనే ఉన్న ఒక ముసలావిడకు చదివి వినిపిస్తూ ఉంటాడు. ఆ ముసలావిడ మరెవరో కాదు, జ్ఞాపకశక్తి కోల్పోయిన అల్లి. ఆమె తనను మర్చిపోయినా సరే, తను రాసుకున్న ఆ నోట్‌బుక్ చదివి వినిపిస్తేనైనా తనను గుర్తుపడుతుందని నోహ్ ఆశ. చివర్లో ఒక్క క్షణం ఆమెకు అంతా గుర్తొచ్చి మనమే కదా వీళ్లం అని గుర్తుపడుతుంది. చివరికి చావులో కూడా విడిపోకూడదని ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు వదులుతారు.

Advertisement

Read Also : తండ్రుల ఇగోలు కొడుకుల గోలలు కలిపి కొట్టిన పక్కా రౌడీ స్టోరీ… ఐయండిబిలో 8.4 రేటింగ్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×