E-Paper
Advertisement

Romantic Korean Dramas OTT : క్రేజీ కొరియన్ లవ్ స్టోరీలు… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా… ఇందులో మీరెన్ని చూశారు ?

Romantic Korean Dramas OTT : క్రేజీ కొరియన్ లవ్ స్టోరీలు… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా… ఇందులో మీరెన్ని చూశారు ?
Advertisement

Romantic Korean Dramas OTT : క్రేజీ కొరియన్ మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్. ఇందులో ఇప్పటిదాకా రొమాంటిక్ జానర్లో ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ కొరియన్ లవ్ స్టోరీల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీకెండ్ ఇందులో మీకు నచ్చిన సిరీస్ లను చూడవచ్చు.

మై అన్‌రిటెన్ సియోల్ (My Unwritten Seoul) – హాట్‌స్టార్

ఇద్దరు కవల సిస్టర్స్ యూన్ జో-యూన్, యూన్ జో-హీల కథ ఇది. కుటుంబ ఒత్తిడి కారణంగా తమ గుర్తింపులను మార్చుకునే ఈ సిస్టర్స్ జీవితంలో ఏం జరిగింది ? అన్నది స్టోరీ. ఇందులో రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాతో పాటు హార్ట్ టచింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి.

డియర్ హాంగ్‌రాంగ్ (Dear Hongrang) – నెట్‌ఫ్లిక్స్

Advertisement

ఇదొక కొరియన్ పీరియాడిక్ డ్రామా. 8 ఏళ్ల వయసులో మిస్సైన రాకుమారుడు హాంగ్‌రాంగ్ 12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. మరి ఆ తరువాత ఏం జరిగిందో సిరీస్ ను చూసి తెలుసుకోండి.

మై సీక్రెట్ రొమాన్స్ (My Secret Romance) – నెట్‌ఫ్లిక్స్

2017లో రిలీజ్ అయిన ఈ కొరియన్ డ్రామా రిచ్ ప్లేబాయ్ చా జిన్-వూక్, లీ యూ-మి చుట్టూ తిరుగుతుంది. వన్ నైట్ స్టాండ్ లో కలిసే ఈ ఇద్దరూ నెక్స్ట్ డే బాస్, ఎంప్లాయ్ గా కలుస్తారు. ఇద్దరి మధ్య అపార్థాలు ఉన్నప్పటకీ గాఢమైన ప్రేమ వాళ్ళను ఒక్కటి చేస్తుంది.

లవ్ స్టక్ ఇన్ ది సిటీ (Love Stuck in the City) – నెట్‌ఫ్లిక్స్

Advertisement

ఓ అమ్మాయితో ఆర్కిటెక్ట్ నడిపే ప్రేమకథ ఇది. ఇందులో రొమాన్స్ మాత్రమే కాదు కామెడీ, ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యి ఉంటాయి.

ది బ్రైడ్ ఆఫ్ హా బేక్ (The Bride of Habaek) – హాట్‌స్టార్

ఈ కొరియన్ డ్రామాలో వాటర్ గాడ్ భూమిపైకి వచ్చి మాయా రాయిని వెతుకుతాడు. ఫాంటసీ, రొమాన్స్, డ్రామా మిక్సయ్యి ఉన్న ఈ మూవీలో గాడ్, మనిషి మధ్య జరిగే లవ్ స్టోరీ చూడడానికి కొత్తగా ఉంటుంది.

మెల్లో మూవీ (Melo Movie) – నెట్‌ఫ్లిక్స్

ఇదొక రొమాంటిక్ కామెడీ సిరీస్. డైరెక్టర్, మూవీ లవర్స్ మధ్య సాగే లవ్ స్టోరీ. కొరియన్ మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సిరీస్ ఇది.

ఎ టైమ్ కాల్డ్ యు (A Time Called You) – నెట్‌ఫ్లిక్స్

తన ప్రియుడి మరణం తర్వాత కాలంలో వెనక్కి ప్రయాణించే అమ్మాయి కథ ఇది. తన గత జీవితం, ప్రేమ గురించి ఆమెకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. టైమ్ ట్రావెల్, రొమాన్స్ కలగలిపి ఉన్న ఈ సిరీస్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది.

స్నోడ్రాప్ (Snowdrop) – హాట్‌స్టార్

ఓ విద్యార్థిని చావు బతుకుల మధ్య మహిళా విశ్వవిద్యాలయంలో చేరుతుంది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సిరీస్ కూడా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది.

మ్యారీ మై హస్బెండ్ (Marry My Husband)

భర్త తన ప్రాణ స్నేహితురాలితో రిలేషన్ లో ఉన్నాడని తెలుసుకున్న ఆ భార్య ఏం చేసిందో ఈ సిరీస్ లో చూసి థ్రిల్ అవ్వండి.

హోటల్ డెల్ లూనా (Hotel Del Luna) – నెట్ ఫ్లిక్స్

జాంగ్ మాన్ వోల్ అనే అమ్మాయి ఒక మిస్టీరియస్ హోటల్ ను నడుపుతుంది. గతంలో చేసిన పాపం కారణంగా ఆమె ఆ హోటల్లోనే బందీ అవుతుంది. ఇక ఆ హోటల్‌ కి వచ్చే అతిథులు దయ్యాలు. మరిక్కడ ప్రేమ ఎలా, ఎవరితో పుట్టిందో సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also :  మోస్ట్ అవైటింగ్ ఇంటెన్స్ మెడికల్ డ్రామా షురూ… ఇండియాలో ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×