E-Paper
Advertisement

రాత్రంతా నిద్రపోకుండా వీళ్లు చేసిన రచ్చ… లవర్స్ చూడాల్సిన అసలు సిసలు మూవీ

రాత్రంతా నిద్రపోకుండా వీళ్లు చేసిన రచ్చ… లవర్స్ చూడాల్సిన అసలు సిసలు మూవీ
Advertisement

Romantic Movie OTT : ఓటీటీలో ఎన్నో ప్రేమ కథలు స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ఒక్కో కథ ఒక్కోలా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు ఎంటర్టైన్ తో పాటు మంచి ఫీలింగ్ ను కూడా ఇస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే రొమాంటిక్ సినిమా చూస్తే మస్త్ ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు సినిమా షూటింగ్ అంతా నార్త్ కరోలినాలోని అందమైన బీచ్ లో జరిగింది. ఆ ప్రాంతంలోని రాత్రిపూట లొకేషన్లు, ఆహ్లాదకరమైన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇది కేవలం ఒక టీన్ లవ్ స్టోరీ మాత్రమే కాకుండా, మనసులోని భయాలను పోగొట్టుకోవడం, చిన్ననాటి సరదాలను మళ్ళీ వెతుక్కోవడం వంటి ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ కథ నిద్రలేమితో బాధపడే ఒక జంట చుట్టూ తిరుగుతుంది. రాత్రిళ్ళు వీళ్ళు చేసే అల్లరి మామూలుగా ఉండదు. చిన్న చిన్న సరదాలతో స్టోరీ చూడచక్కగా ఉంటుంది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ అమెరికన్ టీన్ రొమాంటిక్ మూవీ పేరు ‘అలాంగ్ ఫర్ ది రైడ్’ (Along for the Ride). ఇది ప్రముఖ రచయిత్రి సారా డెస్సెన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. దీనికి సోఫియా అల్వారెజ్ దర్శకత్వం వహించారు, ఈమె గతంలో నెట్‌ఫ్లిక్స్ హిట్ మూవీ ‘టు ఆల్ ద బాయ్స్ ఐ హావ్ లవ్డ్ బిఫోర్’కు స్క్రిప్ట్ అందించారు. నటీనటుల విషయానికి వస్తే, ఎమ్మా పసరో, బెల్మాంట్ కామెలీ అనే కొత్త నటులు తమ నటనతో ఆకట్టుకున్నారు. వీరితో పాటు హాలీవుడ్ సీనియర్ నటులు కేట్ బోస్వర్త్, డెర్మాట్ ముల్రోనీ ముఖ్య పాత్రల్లో నటించారు. సుమారు 1 గంట 47 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆడెన్ అనే అమ్మాయి ఎప్పుడూ చదువులోనే మునిగిపోయి, సరదాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఒక సారి కాలేజీలో చేరే ముందు వచ్చే వేసవి సెలవుల్లో తన తండ్రి ఉంటున్న బీచ్ ఊరుకి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఎలీ అనే అబ్బాయి పరిచయమవుతాడు. విచిత్రం ఏమిటంటే, వీళ్ళిద్దరికీ రాత్రిపూట అస్సలు నిద్రపట్టదు. వీళ్ళు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇక అక్కడి నుండి అసలు ఆట మొదలవుతుంది. ఎలీ ఆ అమ్మాయిని పట్టుకొని రాత్రిపూట ఊరంతా తిప్పుతాడు. వీళ్లు చేసే ఈ నైట్ రైడ్స్‌లో ఆటలు, పాటలు, చిలిపి పనులు బోలెడు ఉంటాయి. ఈ ప్రాసెస్‌లో చిన్నతనంలో ఆమె మిస్ అయిన వినోదాన్ని, అల్లరిని మళ్ళీ అనుభవించేలా అతను రకరకాల పనులు చేయిస్తాడు. దీంతో ఆడెన్ కేవలం పుస్తకాల్లోనే కాకుండా, బయటి ప్రపంచంలో కూడా ఎంతో నేర్చుకోవచ్చని తెలుసుకుంటుంది.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. ఆ వేసవి ముగిసేసరికి ఆడెన్ ఒక ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిగా మారి తన కాలేజీ లైఫ్ కి సిద్ధమవుతుంది. అప్పటి వరకు రాత్రిపూట నిద్రపోని వీళ్లిద్దరూ, ఆఖరికి ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఆడెన్ కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఎలీ ఆమెకు ఒక ప్రేమగా వీడ్కోలు పలుకుతాడు. ఇక ముగింపులో, ఆడెన్ తన కాలేజీ హాస్టల్ గదిలో ఉండగా ఎలీ నుండి ఒక పోస్ట్‌కార్డ్ వస్తుంది. అది చూసి ఆమె నవ్వుకోవడంతో సినిమా హ్యాపీ ఎండింగ్‌తో ముగుస్తుంది.

Advertisement

Read Also : భక్తి ముసుగులో భయంకరమైన మోసాలు… దొంగ బాబాల దుమ్ము లేపే లేడీ పోలీస్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×