E-Paper
Advertisement

భక్తి ముసుగులో భయంకరమైన మోసాలు… దొంగ బాబాల దుమ్ము లేపే లేడీ పోలీస్

భక్తి ముసుగులో భయంకరమైన మోసాలు… దొంగ బాబాల దుమ్ము లేపే లేడీ పోలీస్
Advertisement

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్‌ కథలు ఇప్పుడు క్రేజీగా సాగుతున్నాయి. ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, ఊహించని మలుపులతో ఈ సినిమాలు ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది థియేటర్లలో వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్‌ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజస్థాన్‌లోని ఒక చిన్న పట్టణంలో ఈ కథ సాగుతుంది. ఒక బాబా మీద ఆరోపణలను ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో స్టోరీ ఓ రేంజ్ ఉత్కంఠత ఇస్తుంది. రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లోని లొకేషన్లలో చిత్రీకరించడం వల్ల దీనికి విజువల్ గా మంచి గుర్తింపు కూడా వచ్చింది. రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లోని సహజ సిద్ధమైన లొకేషన్లలో చిత్రీకరించడం వల్ల దీనికి విజువల్ గా మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ డ్రామా పేరు ‘బయాన్’ (Bayaan). 2025లో వచ్చిన ఈ సినిమాను వికాస్ రంజన్ మిశ్రా డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా వెనుక అంతర్జాతీయ స్థాయి కసరత్తు జరిగింది. దీని స్క్రిప్ట్‌ను హాలీవుడ్ లో ప్రశంసలు పొందిన ‘చెర్నోబిల్’ సిరీస్ సృష్టికర్త క్రెయిగ్ మాజిన్ పర్యవేక్షణలో డెవలప్ చేశారు. అంతేకాకుండా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రదర్శితమైన ఏకైక భారతీయ చిత్రంగా ఇది నిలవడం విశేషం. ఇందులో హుమా ఖురేషి తన నటనకు గాను బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఆసియా స్టార్ అవార్డు’ను కూడా గెలుచుకుంది. ప్లటూన్ వన్ ఫిల్మ్స్, సమ్మిట్ స్టూడియోస్ కలసి ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమా ఇంకా ఓటీటీలోకి రాలేదు. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) లేదా జియో హాట్‌స్టార్ (JioHotstar) దక్కించుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు మరికొంత కాలం ఆగాల్సిందే.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రాజస్థాన్‌లోని ఒక మారుమూల ఊరిలో కథ మొదలవుతుంది. అక్కడ ఒక పేరు మోసిన బాబా (చంద్రచూర్ సింగ్) ఉంటాడు. ఊళ్లో జనం అతన్ని దేవుడిలా కొలుస్తుంటారు. అతను ఏం చెప్పినా వేదంలా భావిస్తారు. కానీ ఆ భక్తి ముసుగులో అతను చేసే ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్న ఆ బాబా సామ్రాజ్యంలోకి, ఒక యంగ్ అండ్ డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ రూహి (హుమా ఖురేషి) ఎంట్రీ ఇస్తుంది. ఆ బాబా మీద ఒక అమ్మాయి లైంగిక వేధింపుల కేసు పెడుతుంది. మామూలుగా అయితే ఇలాంటి కేసుల్ని ఎవరూ పట్టించుకోరు, కానీ రూహి మాత్రం గట్టిగా నిలబడుతుంది. విచారణ మొదలుపెడితే, ఊళ్లో వాళ్లందరూ ఆమెకు ఎదురుతిరుగుతారు.

మా దేవుడి మీద నిందలు వేస్తావా అంటూ చుట్టుపక్కల వాళ్లు, పెద్ద మనుషులు, చివరికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని కొందరు ఆమెను అడ్డుకోవాలని చూస్తారు. చుట్టూ ఉన్న వాళ్లంతా బాబా భక్తులే కావడంతో, సాక్ష్యాలు సేకరించడం రూహికి ఒక పెద్ద యుద్ధంలా మారుతుంది. ఆ బాబా వెనుక ఉన్న పొలిటికల్ సపోర్ట్, మనీ పవర్, జనం గుడ్డి నమ్మకాన్ని రూహి ఒక్కతే ఎలా ఎదుర్కొన్నది ? ఆ నకిలీ బాబా అసలు రంగును ఎలా బయటపెట్టింది ? అనే విషయాలతో ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

Advertisement

Read Also : ‘ఘోస్ట్ రైడర్’ హీరో నికోలస్ కేజ్ లేటెస్ట్ కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చు అంటే?

Tags

Related News

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

Big Stories

Advertisement
×