E-Paper
Advertisement

Romantic Movie OTT: ఆటలో చిక్కుకున్న కుర్రది… అన్నతో ప్రేమ తమ్ముడితో రొమాన్స్… నోరెళ్ళబెట్టించే సీన్స్

Romantic Movie OTT: ఆటలో చిక్కుకున్న కుర్రది… అన్నతో ప్రేమ తమ్ముడితో రొమాన్స్… నోరెళ్ళబెట్టించే సీన్స్
Advertisement

Romantic Movie OTT : కొన్ని సినిమాలు స్టోరీ మొత్తం ఒకలా ఉంటే, క్లైమాక్స్ మరోలా ఉంటుంది. మైండ్ బ్లాక్ చేస్తుంటాయి ఈ సినిమాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో ఉంటుంది. అయితే రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో ఓ రేంజ్ లో ఉంటాయి. ఒక అమ్మాయి ఇందులో అన్నదమ్ములతో నడిపే వ్యవహారం మామూలుగా ఉండదు. ఇక ఈ సినిమాను ఒంటరిగా చూడటమే మంచిది. ఎందుకంటే ఇందులో అలాంటి సీన్లే ఎక్కువ ఉంటాయి. క్లైమాక్స్ అయితే ఊహకు కూడా అందదు.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘డబుల్ లవర్’ (Double Lover). 2017లో వచ్చిన ఈ సినిమా ప్రముఖ దర్శకుడు ఫ్రాంకోయిస్ ఓజోన్ దర్శకత్వం వహించారు. ఇందులో మెరైన్ వాక్త్, జెరెమీ రేనియర్ లీడ్ రోల్స్ లో నటించారు. జోయిస్ కరోల్ ఓట్స్ రాసిన ‘లైవ్స్ ఆఫ్ ది ట్విన్స్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ప్రస్తుతం MUBI (ముబి) ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. మీకు సబ్‌స్క్రిప్షన్ ఉంటే నేరుగా చూడవచ్చు. Apple TVలో ఈ సినిమాను అద్దెకు తీసుకోవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్లోయ్ అనే అమ్మాయికి ఎప్పుడూ కడుపులో నొప్పి వస్తుంటుంది. డాక్టర్ల సమస్య ఏం లేదని ఇది ఒంట్లో జబ్బు కాదు.. ఏదో మనసులో బాధ వల్ల వస్తుందని చెప్పి ఓ సైకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు. అక్కడే పాల్ అనే సైకాలజిస్ట్ తో ఆమెకు పరిచయం అవుతుంది. చూడ్డానికి సాఫ్ట్‌గా, బుద్ధిమంతుడిలా ఉండే సరికి మనసు కూడా పారేసుకుంటుంది క్లోయ్. ఇద్దరూ కొన్నాళ్ళు ప్రేమించుకుని, ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టేస్తారు. అంతా బాగుంది అనుకున్న టైమ్‌లో అసలు కథ మొదలవుతుంది.

ఓ రోజు క్లోయ్‌కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. పాల్ కి అచ్చు తనలాగే ఉండే లూయిస్ అనే కవల సోదరుడు ఇంకొకడు ఉన్నాడని, అతను కూడా అదే వృత్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అతను మహా ముదురు. పాల్‌ది నెమ్మదైన స్వభావం అయితే, లూయిస్‌ది మాత్రం పచ్చి బూతు బుద్ధి. క్లోయ్‌ని చూడగానే లైన్లో పెట్టేస్తాడు. ఈమె కూడా అతనికి పడిపోయి, పాల్ కి తెలియకుండా అతనితో కూడా సంబంధం పెట్టుకుంటుంది. చివరికి ఆమె కడుపునొప్పి వెనుక ఉన్న అసలు కారణం బయటపడే సరికి సినిమా పీక్స్‌కి వెళ్తుంది. ఆ చివర్లో వచ్చే ట్విస్ట్ చూస్తే ఎవరికైనా బుర్ర తిరిగిపోవాల్సిందే. ఆ ట్విస్ట్ ఏమిటి ? క్లోయ్‌ కడుపు నొప్పికి, కవలలకు సంబంధం ఏమిటి ? క్లోయ్‌ వ్యవహారం పాల్ కి తెలుస్తుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  మిస్సింగ్ కేసుతో మొదలయ్యే మర్డర్ కేసు… 2 గంటల పాటు సీట్ ఎడ్జ్ లో ఉంచే కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×