E-Paper
Advertisement

Romantic Movie OTT: ప్రియుడి మరణంతో మౌనం… జ్ఞాపకాలతో ప్రేమ ప్రయాణం… ఓ మరపురాని ప్రేమ కథ

Romantic Movie OTT: ప్రియుడి మరణంతో మౌనం… జ్ఞాపకాలతో ప్రేమ ప్రయాణం… ఓ మరపురాని ప్రేమ కథ
Advertisement

Romantic Movie OTT : కొన్ని ప్రేమకథలు మనసుకు హత్తుకుంటాయి. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటాం వీటిని. అయితే చాలావరకు ఇలాంటి ప్రేమ కథలు మనిషి ఉన్నప్పుడు పక్కకు పెట్టి, వాళ్ళు పోయాక బాధపడినవే ఎక్కువగా ఉంటాయి. అసలు ఇలాంటి కథలను తలుచుకుంటేనే ఒక చుక్క కన్నీటి బొట్టు బుగ్గల మీద పడాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటి కథతో వచ్చిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్నప్పుడు ప్రేమను కాపాడుకోలేక, పోయాక ఆ జ్ఞాపకాల్లోనే బతికే ఒక అమ్మాయి పడే ఆవేదనే ఈ సినిమా.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2021లో విడుదలైన ఈ రష్యన్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘Has Anyone Seen My Girl?’. ఈ సినిమా కరీనా డోబ్రోత్వోర్స్కాయ రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఆమె తన మాజీ భర్త సెర్గీ డోబ్రోత్వోర్స్కీతో తనకున్న ప్రేమ బంధాన్ని ఈ పుస్తకంలో వివరించారు. దీనిని ప్రసిద్ధ రష్యన్ దర్శకురాలు ఏంజెలీనా నికోనోవా సినిమాగా రూపొందించారు. ఇక ఈ చిత్రంలో కిరా పాత్రను ఇద్దరు నటీమణులు పోషించారు. టీన్ కిరాగా అన్నా చిపోవ్‌స్కాయా, పెద్ద కిరాగా విక్టోరియా ఇసకోవా నటించారు. సెర్గీ పాత్రను అలెగ్జాండర్ గోర్చిలిన్ పోషించారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరి 4న రష్యా థియేటర్లలో విడుదలైంది. 1 గంట 39 నిమిషాల రన్ టైమ్ తో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రష్యాలో జరిగే ఒక పిచ్చి ప్రేమకథ ఇది. హీరో సెర్గీ, హీరోయిన్ కిరా.. ఇద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. వీళ్ళు భలే సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేసే రకం కూడా. కానీ ఏమైందో ఏమో గానీ, వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలై అది కాస్తా పెద్దదవుతుంది. దాంతో కిరా విసిగిపోయి అతన్ని వదిలేసి, వేరే ఊరు వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన కొన్నాళ్లకే సెర్గీ చనిపోతాడు. చాలా ఏళ్లు గడిచిపోతాయి, కిరా ఒక పెద్ద మ్యాగజైన్ కి బాస్ అయిపోతుంది. డబ్బు, పేరు అన్నీ ఉంటాయి కానీ మనసులో మాత్రం ఆ పాత సెర్గీ జ్ఞాపకాలు అస్సలు పోవు. తను ఎంతమందితో ఉన్నా, ఏం చేస్తున్నా.. లోలోపల మాత్రం సెర్గీతోనే మాట్లాడుకుంటున్నట్లు ఫీల్ అవుతుంటుంది. అప్పుడు అలా ఎందుకు చేశాను? తను ఉంటే బాగుండేది కదా అని ఎప్పుడూ కుమిలిపోతూ ఉంటుంది. సెర్గీ చనిపోయినా ఆమె గుండెల్లో మాత్రం బతికే ఉంటాడు. అందుకే అతనికి ఉత్తరాలు రాస్తూ, పాత జ్ఞాపకాల్లో బతికేస్తూ ఒక రకమైన బాధతో కూడిన ప్రేమలో ఉండిపోతుంది ఆమె.

Read Also : థియేటర్లో ఆడియన్స్ ను వణికించిన తమిళ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి… గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ తో గగుర్పొడిచే మిస్టరీ

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×