E-Paper
Advertisement

తండ్రి పిచ్చిలో తప్పుదారి పట్టే కూతురు… పిచ్చెక్కించే సీన్లు

తండ్రి పిచ్చిలో తప్పుదారి పట్టే కూతురు… పిచ్చెక్కించే సీన్లు
Advertisement

Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలు ఓటీటీలో బోలెడు ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు బోల్డ్ కంటెంట్ తో ఎమోషనల్ గా పిచ్చెక్కిస్తుంటాయి. అలాంటి సినిమా గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది ఒక అమ్మాయి తన తండ్రిపై పెంచుకున్న విపరీతమైన ప్రేమ, దానివల్ల ఆమె జీవితంలో తలెత్తే గందరగోళం చుట్టూ తిరుగుతుంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కేవలం పెద్దలకు మాత్రమే. ఫ్యామిలీతో అస్సలు చూడకూడని సినిమా ఇది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ డచ్ రొమాంటిక్ మూవీ పేరు ‘హేమెల్’ (Hemel). 2012 లో వచ్చిన ఈ సినిమాకు సాచా పోలాక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన హన్నా హోక్‌స్ట్రా నటన హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె నటనకు గాను నెదర్లాండ్స్‌లో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ కాఫ్ అవార్డు లభించింది. దర్శకురాలు ఈ కథను తండ్రీకూతుళ్ల మధ్య ఉండే మానసిక స్థితిని చాలా లోతుగా చూపించారు. అందుకే ఈ సినిమాకు 62వ బెర్లిన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. ఈ సినిమా కేవలం 80 నిమిషాల నిడివితో చాలా బోల్డ్ గా సాగుతుంది. అంతేకాదు బోల్డ్ కంటెంట్ ను ఎమోషనల్ గా చూపించడం వల్ల, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా Tubi, Plex ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

హేమెల్ ఒక ఇండిపెండెంట్ భావాలున్న అమ్మాయి. అయితే ఆమెకు తన తండ్రి గిజ్ అంటే ప్రాణం. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రీకూతుళ్ల మధ్య బాండింగ్ బాగానే ఉంటుంది. అయితే హేమెల్ తన జీవితంలో ప్రేమను వెతుక్కోకుండా, అనేకమంది అబ్బాయిలతో ఎఫ్ఫైర్లు  పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె రాత్రి పూట బయటకెళ్లి ఎవడో ఒకడిని పట్టుకోవడం, వాడితో గడపడం, తెల్లారాక వాడి ముఖం కూడా చూడకుండా వచ్చేయడం అలవాటుగా చేసుకుంటుంది. ఇలా వరుసగా అబ్బాయిలను మారుస్తూ ఎంజాయ్ చేస్తున్నా, లోపల మాత్రం ఏదో వెలితి. ప్రేమ అంటే ఏంటో తెలియక, కేవలం శరీరాన్నే నమ్ముకుని తిరుగుతుంటుంది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళ నాన్న కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటాడు. పెళ్ళాం చనిపోయాక ఆయన కూడా ఏ అమ్మాయినీ వదిలేవాడు కాదు. తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఒకేలాంటి అలవాట్లతో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. కానీ ఒకరోజు వాళ్ళ నాన్న సోఫీ అనే ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. ఆమెతో పెళ్లికి కూడా రెడీ అవుతాడు. అది హేమెల్‌కి అస్సలు నచ్చదు. తన నాన్నని ఇంకో ఆడది వచ్చి తన్నుకుపోవడం ఆమెకు మంట పుట్టిస్తుంది. నాన్న దూరం అవుతున్నాడనే అసూయతో హేమెల్ ఇంకా పిచ్చి పనులు చేయడం మొదలుపెడుతుంది. ఎవరితో పడితే వాళ్లతో పడుకుంటూ తనని తాను హింసించుకుంటుంది. ఆఖరికి ఆ పిచ్చి ముదిరి, వాళ్ళ నాన్న పెళ్లిని చెడగొట్టాలని చూస్తుంది. ఈ క్లైమాక్స్ చాలా క్రేజీగా ఉంటుంది. చివరికి ఆమె ఈ పెళ్ళిని చెడగొడుతుందా ? ఆమెకు తండ్రి మీద అసలు ఎలాంటి ప్రేమ ఉంది ? ఈ కథకు క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను ఈ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : పక్క పక్క గదుల్లో ఉంటూ మనసు ఇచ్చి పుచ్చుకునే జంట… కొత్త లోకంలోకి తీసుకెళ్లే మధురమైన ప్రేమ కథ

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×