E-Paper
Advertisement

పక్క పక్క గదుల్లో ఉంటూ మనసు ఇచ్చి పుచ్చుకునే జంట… కొత్త లోకంలోకి తీసుకెళ్లే మధురమైన ప్రేమ కథ

పక్క పక్క గదుల్లో ఉంటూ మనసు ఇచ్చి పుచ్చుకునే జంట… కొత్త లోకంలోకి తీసుకెళ్లే మధురమైన ప్రేమ కథ
Advertisement

Romantic Movie OTT : ఒక పక్కా క్లాసిక్ లవ్ స్టోరీని చూడాలని ఉందా ? అయితే ఐయండిబిలో 8 రేటింగ్ ఉన్న ఒక మూవీ మీకోసమే ఓటీటీలో ఉంది. కానీ ఇందులో మనం రెగ్యులర్‌గా చూసే గోల, గొడవలు, డ్యాన్సులు ఉండవు. మొగుడు పెళ్ళాం చేసిన మోసం వల్ల ఒంటరిగా మిగిలిపోయిన ఇద్దరు వ్యక్తులు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఇష్టపడుతూ, ఆ ప్రేమని బయటికి చెప్పుకోలేక లోలోపలే నలిగిపోయే తీపి బాధ లాంటి సినిమా ఇది. ప్రతి సీన్ ఒక ఆర్ట్ లాగా, వెనక వచ్చే మ్యూజిక్ మన మనసును హత్తుకునేలా ఉంటుంది. సినిమా అయిపోయాక కూడా ఆ క్యారెక్టర్ల ఫీలింగ్ మనల్ని వదలదు. 1962 నాటి హాంగ్ కాంగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా, చరిత్రలోనే అద్భుతమైన రొమాంటిక్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.

ఎక్కడ చూడచ్చు అంటే

వొంగ్ కర్-వై దర్శకత్వంలో 2000లో వచ్చిన ఈ రొమాంటిక్ సినిమా పేరు ‘ఇన్ ద మూడ్ ఫర్ లవ్’ (In the Mood for Love). ఇందులో టోనీ లంగ్, మ్యాగీ చెంగ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు వొంగ్ కర్-వై అసలు స్క్రిప్ట్ లేకుండానే పనిచేశారు. ప్రతిరోజూ సెట్‌కి వెళ్ళాక అప్పటికప్పుడు సీన్లు రాసి నటీనటులకు ఇచ్చేవారు. దీనివల్ల షూటింగ్ పూర్తి కావడానికి ఏకంగా 15 నెలలు పట్టింది. అంతేకాదు కాదు ఇది ప్రపంచ సినిమాలోనే అత్యంత గొప్ప క్లైమాక్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. సినిమాలోని ఆ పాతకాలపు హాంగ్ కాంగ్ వాతావరణం, వయొలిన్ మ్యూజిక్ ప్రేక్షకుడిని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ప్రస్తుతం ఈ సినిమాను MUBI, Amazon Prime Video లో చూడవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అది 1962 కాలం. ఒకే అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్యామిలీలు పక్కపక్క పోర్షన్లలో అద్దెకు దిగుతాయి. ఒకరు హీరో చౌ, ఇంకొకరు హీరోయిన్ సు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. చౌ భార్యకు, సు మొగుడికి మధ్య లోపల ఏదో లింక్ నడుస్తుందని వీళ్ళిద్దరికీ డౌట్ వస్తుంది. తీరా ఆరా తీస్తే, ఆ ఇద్దరూ అఫ్ఫైర్ లో ఉన్నారని కన్ఫర్మ్ అయిపోద్ది. తమ సొంత వాళ్లే తమకు వెన్నుపోటు పొడిచారని వీళ్లిద్దరూ ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. ఇదంతా ఎక్కడ నుంచి మొదలైందో తెలుసుకోవడానికి, హీరో హీరోయిన్ ఇద్దరూ ప్లాన్ చేసుకుని కలవడం మొదలుపెడతారు. ఆ బాధను పంచుకుంటూ, ఒకరికొకరు తోడుగా ఉంటూ మెల్లగా క్లోజ్ అయిపోతారు. జనాలు ఏమనుకుంటారో అని భయపడుతూనే, వర్షంలో తడుస్తూ, సందుల్లో నడుస్తూ దొంగచాటుగా మాట్లాడుకుంటారు.

అయితే మనం వాళ్లలాంటి వాళ్లం కాదు.. మనం తప్పు చేయకూడదని గట్టిగా అనుకుంటారు. కానీ మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి విపరీతమైన ప్రేమ పుడుతుంది. సమాజానికి భయపడి, ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని బయటపెట్టుకోలేక లోపల లోపలే కుమిలిపోతారు. చివరికి హీరో ఊరు వదిలి వెళ్ళిపోయే టైమ్ వచ్చినా, ఇద్దరూ కలవలేరు. ఇక ఈ క్లైమాక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఇలాంటి స్నేహితుడు కోటికొక్కడుంటాడు… మనసున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన నిజమైన స్టోరీ

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×