E-Paper
Advertisement

Romantic Movie OTT: అరవై ఏళ్ళ ఆంటీ ప్రేమలో అందగాడు… ఇదెక్కడి వింత యవ్వారం సామీ

Romantic Movie OTT: అరవై ఏళ్ళ ఆంటీ ప్రేమలో అందగాడు… ఇదెక్కడి వింత యవ్వారం సామీ
Advertisement

Romantic Movie OTT : ప్రేమకథలు కొన్ని మనసును హత్తుకునేలా ఉంటాయి. అయితే మరికొన్ని కథలు వయసుతో సంబంధం లేకుండా చక్కని ఎమోషన్స్ ఇస్తాయి. రీసెంట్ గా వచ్చిన ఒక ఫిలిప్పీన్ మూవీని చూస్తే అవుననే అనిపిస్తుంది. ఇందులో ఒక అరవై ఏళ్ల మహిళ, నలభై ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. థియేటర్లలో కంటే ఈ సినిమా ఓటీటీలో వచ్చిన తర్వాతే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. మన ఇండియాలో కూడా చాలా మంది ఈ సినిమాలోని ఎమోషన్స్‌కి కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ సినిమా పేరు ‘ఓన్లీ వి నో’ (Only We Know). ఈ సినిమాకు ఐరీన్ ఎమ్మా విల్లామోర్ దర్శకత్వం వహించారు.
ఇందులో సీనియర్ నటి చారో శాంటోస్-కాన్సియో, డింగ్‌డాంగ్ డాంటెస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిలిప్పీన్ లో చారో శాంటోస్-కాన్సియో చాలా పెద్ద నటి. మన దగ్గర జమున, సావిత్రి గారిలాంటి స్టార్ డమ్ ఉన్న నటి ఆమె. అలాగే హీరో డింగ్‌డాంగ్ డాంటెస్ అక్కడి స్టార్ హీరో. ఇక వీరిద్దరూ కలిసి నటించడం అక్కడ పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఈ చిత్రం 2025 జూన్ 11న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత 2025 అక్టోబర్ 9 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా బెట్టి అనే ఒక రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె వయసు 60 పైబడటంతో ఇంట్లో ఒక్కతే ఉంటూ, పాత జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తుంటుంది. పిల్లలు వాళ్ల పనుల్లో వాళ్లు బిజీగా ఉండటంతో, ఆమెకు తోడు నీడ కరువైపోయి, లోలోపల చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైమ్‌లో ఆమె జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. ర్యాన్ అనే ఒక మిడిల్ ఏజ్ సివిల్ ఇంజనీర్, తన భార్య చనిపోయిన బాధలో ఉంటాడు. ఒక అనుకోని సందర్భంలో బెట్టి, ర్యాన్ ఒకరికొకరు పరిచయం అవుతారు. వయసులో చాలా తేడా ఉన్నా, ఇద్దరూ ఒంటరితనంతో బాధపడుతుండటంతో త్వరగానే స్నేహితులు అయిపోతారు.

ఇక ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకుంటూ, లోకాన్ని మర్చిపోయి హాయిగా తిరుగుతూ, మళ్ళీ జీవితం మీద ఆశ పెంచుకుంటారు. అయితే వీళ్ళిద్దరూ అంత క్లోజ్‌గా తిరగడం చూసి చుట్టుపక్కల వాళ్లు, సమాజం రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెడతారు. దీంతో చివరికి వాళ్ల బంధం ఏ మలుపు తిరిగింది? ఈ సినిమా అసలు క్లైమాక్స్ ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ రొమాంటిక్ మూవీని చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  సమాధుల మీద కొత్త హోటల్ … దెయ్యాల దెబ్బతో రచ్చ రచ్చ… నవ్వులు పూయిస్తున్న హారర్ స్టోరీ

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×