E-Paper
Advertisement

Romantic Movie OTT: పెళ్లి చేసుకునే గే జంట… అమ్మాయి ఎంట్రీతో మ్యాటర్ మరింత… అబ్బబ్బా అన్నీ అలాంటి సీన్లు

Romantic Movie OTT: పెళ్లి చేసుకునే గే జంట… అమ్మాయి ఎంట్రీతో మ్యాటర్ మరింత… అబ్బబ్బా అన్నీ అలాంటి సీన్లు
Advertisement

Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలు రకరకాల కథలతో వస్తూ ఉంటాయి. ఇక వీటిల్లో కొన్ని కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందులో కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఇచ్చే మజా వేరే సినిమాలు కూడా ఇవ్వవు. ఇక విషయానికి వస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది. అయితే ఇది అలాంటి ఇలాంటి స్టోరీ కాదు. ఇందులో ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత వీళ్ళ లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తుంది. దీంతో ఇక్కడ జరిగే రగడ మాములుగా అయితే ఉండదు. ఆడియన్స్ కూడా పిచ్చెక్కిపోతోంది. రిలీజ్ కి ముందే ఈ రొమాంటిక్ సినిమా వివాదాలను మూటగట్టుకుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ క్రేజీ లవ్ ట్రయాంగిల్ డ్రామా పేరు ‘ప్యాసేజెస్’ (Passages). ఈ ఫ్రెంచ్ మూవీ పారిస్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఇరా సాచ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సీరియస్ డ్రామాలు, రిలేషన్ షిప్ కథలు నచ్చితే ఈ సినిమా డెఫినెట్‌గా నచ్చుతుంది. ఇందులో ఫ్రాంజ్ రోగోవ్స్కీ, బెన్ విషా, అడెల్ ఎక్సార్కోపౌలోస్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2023 ఆగస్టు 4న యునైటెడ్ స్టేట్స్‌లో ముబి ద్వారా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఇది MUBI యాప్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయని అమెరికాలో పెద్ద గొడవ జరిగింది. అందుకే దీనికి చాలా సెన్సార్ కట్స్ అడిగారు. కానీ డైరెక్టర్ ఒప్పుకోకుండా అలాగే రిలీజ్ చేశారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పారిస్‌లో టోమస్, మార్టిన్ అనే ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకుంటూ ఉంటారు. టోమస్ ఒక సినిమా డైరెక్టర్. అయితే ఒకరోజు షూటింగ్ అయిపోయాక జరిగిన పార్టీలో టోమస్‌కి అగాథే అనే అమ్మాయి పరిచయం అవుతుంది. భార్యాభర్తల్లా ఉన్న మార్టిన్‌ని కాదని, టోమస్ ఆ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఈ విషయం తెలియగానే వాళ్ల ఇంట్లో గొడవలు మొదలవుతాయి.
ఇక టోమస్, అగాథేతో ప్రేమలో ఉన్నానని చెప్పి మార్టిన్‌ని వదిలేసి ఆమెతో ఉండటానికి వెళ్తాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక మళ్ళీ మార్టిన్ గుర్తొస్తాడు. మార్టిన్ వేరే వాడితో డేటింగ్‌కి వెళ్తుంటే, టోమస్ తట్టుకోలేక మళ్ళీ అతని దగ్గరికి వెళ్తాడు. ఈ సమయంలో అటు అగాథే ప్రెగ్నెంట్ అవుతుంది. ఇటు మార్టిన్‌ని వదలడు టోమస్. తన స్వార్థం కోసం టోమస్ ఇద్దరి జీవితాలతో ఫుట్‌బాల్ ఆడుకుంటాడు.

టోమస్ చేసే ఈ పిల్లి గంతులు చూసి అటు అగాథే, ఇటు మార్టిన్ ఇద్దరూ విసిగిపోతారు. వాడు అబద్ధాలు చెప్తూ ఇద్దరినీ వాడుకుంటున్నాడని వాళ్లకు అర్థమైపోతుంది. చివరకు కథలో షాకింగ్ క్లైమాక్స్ ఉంటుంది. చివరికి అగాథే మార్టిన్ ను వదిలేస్తుందా ? అయం అబార్షన్ చేయించుకుంటుందా ? మార్టిన్ కూడా అతనికి దూరంగా వెళ్లిపోతాడా ? ఈ కథ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : రక్తం రుచి మరిగిన సముద్రపు దొంగలు… ఓటీటీలో దుమ్ములేపుతున్న సిరీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×