E-Paper
Advertisement

One Piece Season 2 OTT : రక్తం రుచి మరిగిన సముద్రపు దొంగలు… ఓటీటీలో దుమ్ములేపుతున్న సిరీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్

One Piece Season 2 OTT : రక్తం రుచి మరిగిన సముద్రపు దొంగలు… ఓటీటీలో దుమ్ములేపుతున్న సిరీస్…  తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

One Piece Season 2 OTT : అదిరిపోయే గ్రాఫిక్స్‌తో రూపొందించిన ‘వన్‌ పీస్’ సీజన్ 2 ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇప్పటికే వచ్చిన మొదటి సీజన్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వచ్చిన సీజన్ 2 అంతకు మించి అన్నట్లు ఉంటోంది. సముద్రపు దొంగల చుట్టూ సాగే ఈ కథ చూపు తిప్పుకోకుండా చేస్తోంది. మొదటి సీజన్‌లో లూఫీ తన టీమ్‌ని సెట్ చేసుకుని సముద్రం మీద ప్రయాణం మొదలుపెడితే, ఈ రెండో సీజన్‌లో అసలైన ఆట మొదలవుతుంది. ఈసారి కథ అంతా ‘గ్రాండ్ లైన్’ అనే అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గంలో సాగుతుంది. అక్కడ లూఫీకి కొత్త స్నేహితులు, అంతకంటే బలమైన శత్రువులు ఎదురుపడతారు.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘One Piece Season 2’ 2026 మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మొదటి సీజన్ 2023 ఆగస్టు 31న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ విజయంతో మేకర్స్ వెంటనే రెండో సీజన్‌ను ప్రకటించారు. ప్రస్తుత రెండవ సీజన్ లో అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మాట్లాడే జింక డాక్టర్ ‘టోనీ టోనీ ఛాపర్’, స్టైలిష్ విలన్ ‘సర్ క్రొకోడైల్’ వంటి పాత్రలు ఎంట్రీ ఇచ్చాయి. 8 ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ సిరీస్ లో అద్భుతమైన విజువల్స్ కి ప్రశంసలు కూడా వస్తున్నాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చిన్నప్పటి నుంచి సముద్రపు దొంగలకు రాజు అవ్వాలనేది లూఫీ ఆశయం. ఎప్పుడూ నవ్వుతూ, తన స్నేహితుల కోసం ప్రాణాలిచ్చే మనస్తత్వం ఇతనిది. చిన్నప్పుడు పొరపాటున ‘గమ్-గమ్’ అనే ఒక వింత పండు తింటాడు. దానివల్ల ఇతని శరీరం రబ్బరులా మారిపోతుంది. ఎంత దూరమైనా చేతులు, కాళ్లు సాగదీసి శత్రువులను చితక్కొట్టగలడు. సముద్రంలో ఎక్కడో దాగి ఉన్న అత్యంత విలువైన నిధి ‘వన్ పీస్’ని కనిపెట్టి, ప్రపంచంలోనే గొప్ప పైరేట్ అవ్వడమే ఇతని టార్గెట్.

ఈ కథ, లూఫీ ఒక ప్రమాదకరమైన సముద్ర ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో మొదలవుతుంది. కథ మొదట్లో లోగ్‌టౌన్ అనే ఊళ్లో స్మోకర్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ లూఫీతో పాటు, అతని ఫ్రెండ్స్ ని పట్టుకోవాలని తెగ ట్రై చేస్తాడు. కానీ లూఫీ తన టీమ్‌తో కలిసి అక్కడి నుంచి తెలివిగా తప్పించుకుని, కొండల మీదుగా ప్రవహించే వింతైన సముద్రపు దారి ద్వారా ‘గ్రాండ్ లైన్‌’లోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడ వీళ్ళకి బారోక్ వర్క్స్ అనే ఒక పెద్ద రౌడీ గ్యాంగ్ ఎదురవుతుంది. ఆ గ్యాంగ్ బారి నుంచి తమ దేశాన్ని కాపాడుకోవాలని చూస్తున్న ప్రిన్సెస్ వివికి సాయం చేస్తామని లూఫీ మాట ఇస్తాడు.

Advertisement

ఆ ప్రయాణంలో వీళ్ళు డ్రమ్ ఐలాండ్ అనే మంచు కురిసే దీవికి చేరుకుంటారు. అక్కడ వీళ్ళకి టోనీ టోనీ ఛాపర్ అనే వింతైన జింక కనిపిస్తుంది. అది మనుషుల్లా మాట్లాడటమే కాదు, అద్భుతంగా వైద్యం కూడా చేస్తుంది. ఇక కథలో అసలైన విలన్ సర్ క్రొకోడైల్ ఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. చివరికి లూఫీ ‘వన్ పీస్’ని కనిపెడతాడా ? ప్రిన్సెస్ వివికి సాయం చేస్తాడా ? క్రొకోడైల్ వల్ల వచ్చే సమస్య ఏమిటి ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also :  మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ… స్టోరీ అంతా ఐఏఎస్ ల చుట్టూనే

Tags

Related News

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×