E-Paper
Advertisement

Romantic movie OTT : 16 ఏళ్లకే క్యాన్సర్… చావులోనూ చచ్చేంత ప్రేమ… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

Romantic movie OTT : 16 ఏళ్లకే క్యాన్సర్… చావులోనూ చచ్చేంత ప్రేమ… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్
Advertisement

Romantic movie OTT : రొమాంటిక్ సినిమాలను ఎన్ని చూసినా, కొన్ని మాత్రమే మనసుల్లో శాశ్వతంగా ఉండిపోతాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ కథ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక జంట చుట్టూ తిరుగుతుంది. చావు కళ్ళ ముందు ఉన్నా ప్రేమతో కాలాన్ని ఎలా గెలవచ్చో ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమాను చూస్తే తెలుగులో నాగార్జున నటించిన ‘గీతాంజలి’ సినిమా గుర్తుకు వస్తుంది. సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ అమెరికన్ రొమాంటిక్ సినిమా పేరు ‘ ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ (The fault in our stars). ఇది జోష్ బూన్ దర్శకత్వంలో జాన్ గ్రీన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఈ కథ హెజిల్ గ్రేస్ లంకాస్టర్ (షైలీన్ ఉడ్లీ), ఆగస్టస్ వాటర్స్ (అన్సెల్ ఎల్గోర్ట్) అనే ఇద్దరు టీనేజర్ల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడంతో MTV మూవీ అవార్డ్స్, టీన్ ఛాయిస్ అవార్డ్స్ లను ఈ సినిమా అందుకుంది. ఈ సినిమాలోని సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం Jio hotstarలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హేజిల్ అనే అమ్మాయికి క్యాన్సర్ ఉంటుంది. దాంతో ఆమె ఎప్పుడూ ఒక ఆక్సిజన్ సిలిండర్‌ని వెంట పెట్టుకుని తిరుగుతూ కొంచెం డల్ గా ఉంటుంది. తన లైఫ్ ఇలాగే అయిపోతుందేమో అని అనుకుంటున్న టైంలో, ఒక క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్‌లో ఆమెకు అన్సెల్ అనే యువకుడు పరిచయం అవుతాడు. గస్ చాలా జోవియల్‌గా, లైఫ్ మీద మంచి హోప్‌తో ఉంటాడు. వీళ్లిద్దరికీ పుస్తకాలంటే చాలా ఇష్టం. హేజిల్‌కు బాగా నచ్చిన ఒక పుస్తకం చివర్లో కథ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవాలని ఆమెకు ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చడానికి అన్సెల్ ఆమెను ఆమ్‌స్టర్‌డామ్ తీసుకెళ్తాడు. అక్కడ ఆ పుస్తక రచయితను కలిసిన తర్వాత వాళ్లకు కొన్ని చేదు నిజాలు ఎదురవుతాయి.

ఆ ప్రయాణంలో వీళ్లిద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడతారు. చనిపోతామని తెలిసినా, ఉన్న కొద్ది రోజుల్లోనే ఒకరికొకరు తోడుగా ఉంటూ లైఫ్‌ని ఎంత సెలబ్రేట్ చేసుకోవచ్చో వీళ్ల ప్రేమ చూపిస్తుంది. అయితే కథ చివర్లో ఒక ఊహించని మలుపు వస్తుంది. ఎప్పుడూ హేజిల్ గురించి బాధపడే అన్సెల్, నిజానికి తనే మళ్ళీ అనారోగ్యం బారిన పడతాడు. క్లైమాక్స్ కన్నీళ్ళు తెప్పిస్తుంది. చివరికి వీళ్ళ ప్రేమ ఏమవుతుంది ? క్యాన్సర్ వళ్ళ ఇద్దరూ చనిపోతారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఎమ్మా స్టోన్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×