Bugonia OTT release date : ఎమ్మా స్టోన్, జెస్సీ ప్లెమోన్స్ నటించిన ‘బుగోనియా’ (Bugonia) ఇప్పుడు భారతదేశంలో ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. 2026 ఫిబ్రవరి 28 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. ఇది 98వ ఆస్కార్ అవార్డులకు ముందు వచ్చేందుకు ప్రత్యేకంగా షెడ్యూల్ చేయబడింది. 2025 అక్టోబర్ 31 న థియేటర్లలో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ ఇప్పటికే విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉండటం విశేషం.
యోర్గోస్ లాంథిమోస్ దర్శకత్వంలో వచ్చిన ‘బుగోనియా’ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో ఫిబ్రవరి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎమ్మా స్టోన్ నటన, లాంథిమోస్ డైరెక్షన్, జెస్సీ ప్లెమోన్స్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రశంసలు పొందాయి. ఈ సినిమా ఆస్కార్ సీజన్‌లో ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం నామినేషన్లకు బలమైన అభ్యర్థిగా ఉంది. మార్చి 16న జరిగే 98వ ఆస్కార్‌కు ముందు భారతీయ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసే అవకాశం వస్తోంది. జియోహాట్‌స్టార్‌లో ఇది ఈ సంవత్సరం అత్యంత చర్చనీయమైన విదేశీ విడుదలల్లో ఒకటిగా నిలవనుంది. ఇది 2003లో జాంగ్ జూన్-హ్వాన్ దర్శకత్వం వహించిన కొరియా చిత్రం ‘సేవ్ ది గ్రీన్ ప్లానెట్’ కి రీమేక్. ఎమ్మా స్టోన్ ఫ్యాన్స్, సై-ఫై ప్రేమికులు, లాంథిమోస్ స్టైల్ ఇష్టపడేవారు ఈ సినిమాని ఫిబ్రవరి 28న మిస్ చేయకండి.
ఈ కథలో టెడ్డీ, డాన్ అనే ఇద్దరు వ్యక్తులు పిచ్చిపిచ్చి సిద్ధాంతాలను నమ్ముతుంటారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కారణం గ్రహాంతరవాసులని, వాళ్ళు మనుషుల రూపంలో భూమి మీద తిరుగుతున్నారని బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ సీఈఓ అయిన మిచెల్ ఫుల్లర్ (ఎమ్మా స్టోన్) నిజానికి ఒక గ్రహాంతరవాసి అని, త్వరలోనే ఆమె భూమిని నాశనం చేయబోతోందని భావించి వీళ్ళు ఆమెను కిడ్నాప్ చేస్తారు. అయితే ఆమెను ఒక బేస్‌మెంట్‌లో బంధించి, ఆమె నిజం ఒప్పుకునేలా చేయడానికి రకరకాల వింత పద్ధతుల్లో హింసిస్తారు. ఆ సమయంలో మిచెల్ నిజంగానే వేరే గ్రహం నుంచి వచ్చిందా లేక వీళ్ళు కేవలం భ్రమలో ఉన్నారా అనే ఉత్కంఠతో సినిమా సాగుతుంది.