E-Paper
Advertisement

Sci Fi Web series : ఓటీటీలో ఆకట్టుకుంటున్న ‘స్పేస్ జెన్ చంద్రయాన్’… స్పేస్ అడ్వెంచర్ లవర్స్ కు ఐ ఫీస్ట్ ఈ సిరీస్

Sci Fi Web series : ఓటీటీలో ఆకట్టుకుంటున్న ‘స్పేస్ జెన్ చంద్రయాన్’… స్పేస్ అడ్వెంచర్ లవర్స్ కు ఐ ఫీస్ట్ ఈ సిరీస్
Advertisement

Sci Fi Web series : ఓటీటీలో ‘స్పేస్ జెన్: చంద్రయాన్’ సిరీస్ ఆకట్టుకుంటోంది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్, చంద్రయాన్-2 వైఫల్యం తర్వాత ISRO శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 విజయం కోసం పడ్డ కష్టాన్ని 5 ఎపిసోడ్లలో చూపిస్తుంది. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగు పెట్టాక మానవాళికి ఒక కొత్త ఆశ చిగురించింది. ఖగోళంలో మరిన్ని విషయాల గురించి తెలుసుకునేందుకు బూస్ట్ ఇచ్చింది ఈ ప్రయోగం. ఆతరువాత చంద్రుని మీదకి వెళ్లేందుకు చాలానే ప్రయోగాలు జరిగాయి. అయితే భారత దేశం నీటి జాడ కనిపెట్టేందుకు ‘చంద్రయాన్’ మిషన్ ప్రారంభించింది. చంద్రునిపై ఇంత వరకు వెళ్లని దక్షిణ దృవం మీదకి ల్యాండర్ విక్రమ్ ని పంపే సాహసం భారత్ మాత్రమే చేసి సక్సస్ అయింది.

ఎక్కడ చూడచ్చు అంటే

‘స్పేస్ జెన్: చంద్రయాన్” (Space Gen: Chandrayaan) వెబ్ సిరీస్ 2026 జనవరి 23న విడుదలైంది. ఇందులో నకుల్ మెహతా, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక 2019లో జరిగిన ‘చంద్రయాన్ 2’ వైఫల్యం తరువాత ‘చంద్రయాన్-3’ లాంచ్ 2023 జూలై 14న విజయవంతం అయింది.  ‘చంద్రయాన్-4’ మిషన్ ను 2028లో లాంచ్ చేయాలని ISRO ప్లాన్ చేస్తోంది. మీరు దీనిని JioHotstar లో చూడవచ్చు. అనంత్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ ని ప్రేమ్ షీలా కుమార్, ఎన్ కుమార్ నిర్మించారు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

‘చంద్రయాన్-2’ మిషన్ ఫెయిల్ అయినప్పటి నుండి కథ మొదలవుతుంది. ఆ సమయంలో ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు పడ్డ వేదనను, ఎదుర్కొన్న విమర్శలను ఇందులో చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఇక నకుల్ మెహతా, శ్రియా శరణ్ వంటి నటులు సైంటిస్టుల పాత్రల్లో కనిపిస్తారు. పాత తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని, చంద్రయాన్-3ని సక్సెస్ చేయడానికి వాళ్ళు రాత్రింబవళ్లు ఎలా కష్టపడ్డారో, బడ్జెట్, టెక్నికల్ సమస్యలను ఎలా అధిగమించారో ఈ 5 ఎపిసోడ్లలో చూడవచ్చు. ముఖ్యంగా కేవలం రాకెట్ లాంచ్ గురించి మాత్రమే కాకుండా, ఆ ప్రయోగం వెనుక ఉన్న మనుషుల జీవితాలను కూడా ఈ స్టోరీ టచ్ చేస్తుంది. ఫ్యామిలీస్ కి దూరంగా ఉంటూ, దేశం గర్వించేలా చేయడానికి వాళ్ళు చేసిన త్యాగాలను, చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టినప్పుడు కలిగే ఆ సంతోషాన్ని ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

Read Also :  కొరియా వీధుల్లో థాయ్ జంట… పేరు తెలీకుండానే ప్రేమలో… ప్రేమికులు చూడాల్సిన మూవీ

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×