E-Paper
Advertisement

Romantic Series OTT: ప్రేక్షకుల మనసును దోచిన బీటెక్ ప్రేమ… మూడు సీజన్లతో ముచ్చటగా

Romantic Series OTT: ప్రేక్షకుల మనసును దోచిన బీటెక్ ప్రేమ… మూడు సీజన్లతో ముచ్చటగా
Advertisement

Romantic Series OTT : సరదాగా సాగిపోయే ఒక రొమాంటిక్ కామెడీ సిరీస్ ను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను చూసియండి. ఇప్పుడు మనం 2020 లో వచ్చిన ఒక రొమాంటిక్ సిరీస్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది ఇప్పటి వరకు మూడు సీజన్లతో అలరించింది. టెక్నాలజీపై ఆసక్తి ఉన్న డింపుల్ (ప్రాజక్తా కోలి), పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్న రిషి (రోహిత్ సరాఫ్) మధ్య జరిగే ప్రేమకథ ఇది. జైపూర్‌లోని ఒక సమ్మర్ కోడింగ్ క్యాంప్‌లో వీరిద్దరూ కలుస్తారు. అక్కడ జరిగే సంఘటనలతో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ 

ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘Mismatched’. సంధ్యా మీనన్ రాసిన ‘When Dimple Met Rishi’ అనే పుస్తకం ఆధారంగా దీనిని రూపొందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఒక హిట్ ఇండియన్ సిరీస్ ఇది. ప్రాజక్తా కోలి, రోహిత్ సరాఫ్, రణవిజయ్ సింఘా ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. మొదటి సీజన్ 2020 నవంబర్ 20న విడుదలైంది. మొదటి సీజన్ తర్వాత 2022లో సీజన్ 2, 2024లో సీజన్ 3 విడుదలయ్యాయి. ప్రస్తుతం సీజన్ 4 (చివరి సీజన్) కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీని టీజర్ ఫిబ్రవరి 2026లో విడుదలైంది, త్వరలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హీరో రిషి కొంచెం సెంటిమెంటల్ మనిషి. వాళ్ళ అమ్మమ్మ చూపించిన ఒక అమ్మాయి ఫోటో చూసి ఫిదా అయిపోతాడు. ఆ అమ్మాయి పేరు డింపుల్. ఆ పిల్లకి పెళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. కోడింగ్ నేర్చుకుని ఏదో సాధించాలని కలలు కంటుంటుంది. రిషి ఏకంగా ఆ పిల్ల జైపూర్‌లో జాయిన్ అయిన కంప్యూటర్ క్లాసులకే వెళ్తాడు. అక్కడ ఫస్ట్ టైమ్ ఆమెను చూడగానే ఫ్యూచర్ వైఫ్ అని ఫిక్స్ అవుతాడు. ఆ క్లాసులో వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది రకరకాల క్యారెక్టర్లు ఉంటారు. ఒకడు ఎప్పుడూ కుర్చీకి అతుక్కుపోయి గేములు ఆడేవాడు. ఇంకొకరు ఎప్పుడూ షో కొట్టే బ్యాచ్. మన డింపుల్ ఏమో తన ప్రాజెక్ట్ మీద సీరియస్‌గా వర్క్ చేస్తుంటే, రిషి మాత్రం వెనకాలే తిరుగుతూ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు.

మెల్లగా డింపుల్‌కి కూడా రిషి మంచితనం అర్థమై వాడితో దోస్తీ మొదలుపెడుతుంది. ఈ లోపు ఆ కోడింగ్ క్లాసులో గొడవలు, కాంపిటీషన్ల వల్ల వీళ్ళ మధ్య కూడా చిన్న చిన్న గ్యాపులు వస్తాయి. వీళ్ళిద్దరూ సెట్ అయిపోతున్నారన్న టైమ్‌లో పెద్ద గొడవ జరుగుతుంది. డింపుల్ కష్టపడి చేసిన ఒక యాప్ కోడ్ ఎవరో దొంగిలిస్తారు. ఆ టైమ్‌లో రిషి కూడా తన ఫ్యామిలీ ఫోర్స్ వల్ల ఇంకో పెళ్లి చూపులకి వెళ్తాడు. ఇది చూసి డింపుల్ తప్పుగా అర్థం చేసుకుంటుంది. చివర్లో డింపుల్ యాప్ కోడ్ దొంగిలించింది ఎవరో తెలిసి షాక్ అవుతుంది. ఇక ఒకరి మీద ఒకరు కోపంతో విడిపోవడంతో మొదటి సీజన్ ముగుస్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా ? అసలు ఆమె కోడింగ్ దొంగలించింది ఎవరు లేదా అనేది తర్వాత సీజన్ లో చూడాలి.

Advertisement

Read Also : చిక్కుల్లో పడేసే సినీ నటుడి ప్రేమ… పాత్రలో జీవిస్తూ భార్యకు స్కెచ్… ఎక్కడా చూడని విచిత్రం

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×