E-Paper
Advertisement

Budget Split AC: రూ.25000లోపు బడ్జెట్‌లో తక్కువ కరెంట్ వినియోగించే స్ప్లిట్ ఏసీలు.. ఆన్‌లైన్‌లో బెస్ట్ ఆప్షన్స్

Budget Split AC: రూ.25000లోపు బడ్జెట్‌లో తక్కువ కరెంట్ వినియోగించే స్ప్లిట్ ఏసీలు.. ఆన్‌లైన్‌లో బెస్ట్ ఆప్షన్స్
Advertisement

Budget 1 Ton Split AC| దేశంలో వేసవి ప్రారంభమైంది. అందుకే చాలా మంది ఇంట్లో తక్కువ బడ్జెట్‌లో మంచి ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) కొనాలని చూస్తున్నారు. ఏసీలు గదిని చల్లగా ఉంచి ఇంట్లో సౌకర్యవంతమైన వాతావరణం ఇస్తాయి. కానీ ధర, విద్యుత్ బిల్లు గురించి కస్టమర్లకు టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడు చాలా కంపెనీలు తక్కువ ధరలో ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలు అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు భారీ డిస్కౌంట్స్‌తో రూ.25,000 బడ్జెట్‌లో 1 టన్ స్ప్లిట్ ACలు దొరుకుతున్నాయి. ఇవి చిన్న బెడ్‌రూమ్‌లు, ఆఫీస్ రూమ్‌లకు బాగా సరిపోతాయి.

ఫ్లిప్‌కార్ట్ MarQ 2025 మోడల్ 3 స్టార్ 1 టన్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC

ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్ మార్క్ AC మంచి కూలింగ్ బడ్జెట్ ధరలో ఇస్తుంది. ఇందులో ఇన్వర్టర్ టెక్నాలజీ, 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీ ధర రూ.21,990. SBI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.2,145 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫైనల్ ధర రూ.19,845కి తగ్గుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న చౌకైన ఇన్వర్టర్ ACలలో ఇది ఒకటి.

Onida 2025 మోడల్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC

Advertisement

ఓనిడా స్ప్లిట్ ACలో కూడా అడ్వాన్స్ కూలింగ్ ఫీచర్లు ఉన్నాయి. 5-ఇన్-1 కన్వర్టిబుల్ సిస్టమ్ ఉంది. ఆన్‌లైన్‌లో ధర రూ.24,990. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే రూ.3,114 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఏసీ ఫైనల్ ధర రూ.21,876కి వస్తుంది. ఈ మోడల్ మంచి పర్‌ఫామెన్స్, ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇస్తుంది.

Godrej 2025 మోడల్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC

గోద్రెజ్ AC బలమైన కూలింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. 5-ఇన్-1 కన్వర్టిబుల్ ఫీచర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.26,490 ధరకు లిస్ట్ అయింది. SBI క్రెడిట్ కార్డ్‌తో రూ.3,225 డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అంటే ఫైనల్ ధర రూ.23,265కి వస్తుంది. ట్రస్టెడ్ బ్రాండ్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

Haier 2025 మోడల్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ డ్యూయల్ ఇన్వర్టర్ AC

Advertisement

హైయర్ డ్యూయల్ ఇన్వర్టర్ AC ఈ ధరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇస్తుంది. 7-ఇన్-1 కన్వర్టిబుల్ సిస్టమ్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.25,990. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.1,300 డిస్కౌంట్ పొందవచ్చు. ఫైనల్ ధర రూ.24,690కి వస్తుంది. ఎఫిషియెంట్ కూలింగ్, ఫ్లెక్సిబుల్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది.

TCL 2026 మోడల్ 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC

TCL మోడల్ అడ్వాన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. 7-స్టెప్ కన్వర్టిబుల్ కూలింగ్ మోడ్ ఉంది. ఆన్‌లైన్‌లో దీని ధర రూ.25,990. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే రూ.3,200 డిస్కౌంట్ పొందవచ్చు. ఫైనల్ ధర రూ.22,790కి వస్తుంది. అడ్వాన్స్‌డ్ కూలింగ్ ఫీచర్లు తక్కువ ధరలో ఇస్తుంది.

చిన్న గదులకు బెస్ట్ కూలింగ్

ఈ ACలు వేసవిలో తక్కువ ధరలోనే మంచి కూలింగ్ ఇస్తాయి. చాలా మోడల్స్‌లో ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంది. కన్వర్టిబుల్ మోడ్స్ వల్ల విద్యుత్ బిల్లు తగ్గుతుంది. సీజనల్ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్లతో మరింత ఆదా అవుతుంది.

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలిపిన ప్రొడక్ట్స్, దాని ధరలు సదరు కంపెనీలు ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కొనుగోలు చేసే సమయంలో చెక్ చేయండి. కథనంలో పేర్కొన్న ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారి ఉండొచ్చు. ‘బిగ్ టీవీ’ ఈ ప్రకటనలో పేర్కొన్న వివరాలకు బాధ్యత వహించదు. కేవలం మీ సమాచారం కోసమే ఈ వివరాలు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×