E-Paper
Advertisement

Champion OTT:  ఓటీటీలోకి రాబోతున్న ఛాంపియన్ ..స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

Champion OTT:  ఓటీటీలోకి రాబోతున్న ఛాంపియన్ ..స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Advertisement

Champion OTT: ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లో విడుదలైన కేవలం వారం రోజుల వ్యవధిలోని తిరిగి డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో విడుదలైన సినిమాలన్నీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఓటీటీలో విడుదలవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న ఇప్పటికే పలు సినిమాలు డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే గత ఏడాది క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో ఛాంపియన్(Champion) సినిమా ఒకటి. స్వప్న దత్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన సందడి చేశారు.

గ్రామీణ నేపథ్యంలో..

క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు కూడా సిద్ధం అయిందని తెలుస్తోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్(Roshan), అనస్వర రాజన్(Anaswara Rajan) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలంగాణలోని బైరాన్ పల్లి గ్రామ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇలా థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్(Net Flix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాని జనవరి 23వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.

నెట్ ఫ్లిక్స్ లో ఛాంపియన్..

Advertisement

ఇక త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారక ప్రకటన వెల్లడి కానుంది. ఈ సినిమా కేవలం తెలుగు మాత్రమే కాకుండా కన్నడ హిందీ తమిళ భాషలలో కూడా అందుబాటులోకి రాబోతుందని తెలుస్తోంది. రోషన్ పెళ్లి సందD అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. ఈ సినిమా అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న రోషన్ ఛాంపియన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..

Advertisement

సికింద్రాబాద్లో ఒక బేకరీలో పని చేస్తూ ఉండే మైఖేల్ (రోషన్) ఇంగ్లాండ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇంగ్లాండ్ వెళ్లాలి అంటే ఫుట్ బాల్ మాత్రమే తనకు ఉన్న ఏకైకదారిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫుట్ బాల్ ఛాంపియన్ గా ఎంపిక అయినంతరం అతని ఇంగ్లాండ్ పయనానికి అవకాశం వస్తుంది. తీరా ఇంగ్లాండ్ వెళ్లాలనుకునే సమయంలో మైకేల్ తండ్రి చేయాల్సిన పని ఇతను చేసి ఇంగ్లాండ్ వెళ్లాల్సి వస్తుంది. ఒకచోట తుపాకులను డెలివరీ చేసి ఇంగ్లాండ్ వెళ్లాల్సి వస్తుంది. ఇలా తుపాకులు డెలివరీ చేసే సమయంలో మైఖేల్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అసలు మైకేల్ కు బైరాన్ పల్లికి గల సంబంధం ఏమిటి? మైఖేల్ అనుకున్న విధంగానే ఇంగ్లాండ్ చేరుకున్నారా? బైరాన్ పల్లిలో మైకెల్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read: Bandla Ganesh: నువ్వు తోపుకాదు.. తోపులకే బాపు.. డైరెక్టర్ పై బండ్లన్న కామెంట్స్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×