E-Paper
Advertisement

Pune Civic Polls: పూణే ఎన్నికల్లో 22 ఏళ్ల విద్యార్థిని విజయం.. అతి చిన్న వయస్కురాలిగా రికార్డు

Pune Civic Polls: పూణే ఎన్నికల్లో 22 ఏళ్ల విద్యార్థిని విజయం.. అతి చిన్న వయస్కురాలిగా రికార్డు
Advertisement

Pune Civic Polls: ఇటీవల జరిగిన పూణే మున్సిపల్ ఎన్నికల్లో అతి చిన్న వయస్సులో ఓ విద్యార్థిని కార్పొరేటర్ గా విజయం సాధించింది. పూణే స్థానిక ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసి సింబయాసిస్ విద్యార్థి 22 ఏళ్ల సాయి తోప్టే.. వార్డు మెంబర్ గా విజయం సాధించారు. పూణే ఎన్నికల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఈ విజయం నిలుస్తుందని స్థానిక నేతలు అంటున్నారు.

బీబీఏ విద్యార్థిని

పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నుంచి సాయి తోప్టే కార్పొరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు. సాయి తోప్టే ప్రస్తుతం పూణేలోని సింబయాసిస్ కాలేజీలో బీబీఏ చివరి ఏడాది చదువుతోంది. విద్యార్థిగా ఉన్న తోప్టేను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. విద్యార్థి వయస్సులోనే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం ఆమె రాజకీయ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.

విద్యార్థుల సమస్యలపై పోరాటం

Advertisement

తోప్టే ఏబీవీపీలో యాక్టివ్ గా ఉండేవారు. దీంతో ఆమె పూణేలోని వివిధ సమస్యలపై ఉద్యమాలు చేశారు. కాలేజీలో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశారు. క్రియాశీల రాజకీయాలలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న సాయి తోప్టే.. రాజకీయ నేపథ్యం నుంచే వచ్చారు. ఆమె తండ్రి ప్రశాంత్ తోప్టే చాలా ఏళ్లుగా బీజేపీలో ఉన్నారు. పార్వతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్త వంటి కీలక బాధ్యతలను నిర్వహించారు.

Also Read: టీవీకే పొత్తు ఎవరితో? విజయ్ చుట్టూ తమిళ రాజకీయం..

తండ్రి మద్దతుతో

Advertisement

పార్వతి, సహకార్‌నగర్, ధంకావడి వంటి ప్రాంతాలలో బీజేపీని బలోపేతం చేయడంలో ప్రశాంత్ తోప్టే కీల పాత్ర పోషించారు. పార్వతి ఎమ్మెల్యే మాధురి మిసల్ మద్దతుతో సాయి తోప్టేను వార్డు మెంబర్ అభ్యర్థిగా నామినేట్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ విజయంతో.. పూణేలో అతి చిన్న వయస్సులో కార్పొరేటర్లలో ఒకరిగా సాయి గుర్తింపు పొందారు. సాయి తోప్టేతో పాటు సహకార్‌నగర్–పద్మావతి నుంచి నలుగురు బీజేపీ అభ్యర్థులు విజయాలు నమోదు చేశారు.

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×