E-Paper
Advertisement

Dhoolpet Police Station ott : నవరాత్రుల్లో 3 హత్యలు… సీను సీనుకో ట్విస్ట్ ఉన్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Dhoolpet Police Station ott : నవరాత్రుల్లో 3 హత్యలు… సీను సీనుకో ట్విస్ట్ ఉన్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Dhoolpet Police Station ott : క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు హాట్ కేకుల్లా కనిపిస్తున్నాయి ప్రేక్షకులకి. ఏ భాషలో వచ్చినా వీటిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’. కేస్ 1 త్రీ హెడ్స్ సిరీస్.  ఈ తమిళ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్ హైదరాబాద్‌లోని ధూల్‌పేట ప్రాంతంలో నవరాత్రుల్లో జరిగే మూడు హత్యల నేపథ్యంలో సాగుతుంది. ఇప్పటికే 20 ఎపిసోడ్‌ల పాటు దీని మిస్టరీ సాగింది. ఇది సుమారు 50 ఎపిసోడ్ల వరకు కొనసాగే సుదీర్ఘ వెబ్ సిరీస్‌గా ప్లాన్ చేయబడింది. ఇక రెండో క్రైమ్ కథ కూడా తొందర్లో రాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్ అభిమానుల కోసం ఇది మంచి ఆప్షన్. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’. కేస్ 1 త్రీ హెడ్స్ ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 20 ఎపిసోడ్‌ల పాటు సాగిన మొదటి కేసు ‘త్రీ హెడ్స్ కేసు’ ఇప్పుడు ముగింపుకు చేరుకుంది. గతేడాది డిసెంబర్ 5 నుంచి ఒక్కో ఎపిసోడ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ ఎంగేజింగ్‌గా నడిచింది. మొదటి కేసు ఇప్పటికి ముగిసినా, మరో కొత్త కేసుతో మళ్ళీ ఆడియన్స్ ను పలకరించనుంది ఈ సిరీస్. జస్విన్ దర్శకత్వం, బ్రహ్మ జీ దేవ్ కథనం, అశ్వత్ అందించిన సంగీతం ఈ సిరీస్ కు హైలెట్ గా నిలిచాయి. అశ్విన్ కుమార్, గురు లక్ష్మణ్ ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు.

Advertisement

Read Also :  టైమ్ ట్రావెల్ చేసి అమ్మాయిల ప్రపంచంలో ఇరుక్కునే అబ్బాయిలు… సింగిల్స్ పండగ చేసుకునే సినిమా

స్టోరీ ఏమిటంటే

హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే ధూల్‌పేట ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. నగరంలో నవరాత్రుల్లో మూడు భయంకరమైన హత్యలు జరుగుతాయి. ఈ హత్యలన్నీ తలలు నరికివేసి ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఏసీపీ వెట్రి మారన్ (అశ్విన్ కుమార్)అనే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఏసీపీ అర్జున్ (గురు లక్ష్మణన్) లను, నగరంలో కలకలం రేపుతున్న ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి పై అధికారులు వీరిద్దరినీ కలిపి ఒక టీమ్‌గా మారుస్తారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మిస్టరీ ఛేదించందుకు ప్రయత్నిస్తారు. అసలు కిల్లర్ ఎవరు? అతను తలలను నరికి ఎందుకు హత్యలు చేశాడు ? ఈ కేసును ఇద్దరు ఏసీపీలు సాల్వ్ ఎలా చేశారు ? అనే విషయాలను మాత్రం ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×