BigTV English

OTT Movie : పెళ్ళికొడుకు పెళ్ళికి ఒప్పుకోలేదని బాయ్ ఫ్రెండ్ తో ఆ పని చేసే అమ్మాయి

OTT Movie : పెళ్ళికొడుకు పెళ్ళికి ఒప్పుకోలేదని బాయ్ ఫ్రెండ్ తో ఆ పని చేసే అమ్మాయి

OTT Movie : ప్రేమ కథలను ప్రేక్షకులకు అందించడానికి బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక అడుగు ముందే ఉంటుంది. లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని ఇచ్చింది బాలీవుడ్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒక బాలీవుడ్ లవ్ స్టోరీనే. ఇందులో హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జియో సినిమా (Jio Cinema) లో

ఈ బాలీవుడ్ లవ్ స్టోరీ మూవీ పేరు ‘సనమ్ తేరి కసమ్’ (Sanam Teri Kasam). ఈ మూవీకి రాధిక రావు-వినయ్ సప్రు దర్శకత్వం వహించగా, దీపక్ ముకుత్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో అనురాగ్ సిన్హా, మనీష్ చౌదరి, మురళీ శర్మ, సుదేశ్ బెర్రీ, హర్షవర్ధన్ రాణే, మావ్రా హోకేన్ నటించారు.  ఈ మూవీలో హీరో, హీరోయిన్ లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే వారి జీవితాలు విషాదంగా ముగుస్తాయి. ఈ మూవీ జియో సినిమా (Jio Cinema) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరో తన గర్ల్ ఫ్రెండ్ తో, ఒక అపార్ట్మెంట్ లో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటాడు. అదే అపార్ట్మెంట్లో హీరోయిన్ కూడా ఉంటుంది. హీరోయిన్ తన చెల్లి, తల్లిదండ్రులతో కలిసి జాబ్ చేస్తూ ఉంటుంది. అయితే చెల్లికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అక్క పెళ్లయితే గాని చెల్లికి లైన్ క్లియర్ అవ్వదు. అక్కకు వచ్చే సంబంధాలు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఆమె పాతకాలంలో ఉండే మహిళగా కనపడుతూ ఉంటుంది. ఆమె గెటప్ చాలామందికి నచ్చకపోవడంతో ఇలా జరుగుతూ ఉంటుంది. తన గెటప్ మార్చుకోవాలి అనుకుని హీరోయిన్, అప్పటికే పరిచయం ఉన్న హీరో కోసం తన ఫ్లాట్ కి వెళుతుంది. మద్యం సేవించి వచ్చిన హీరో గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరిని చూసి అనుమానంతో గొడవపడి వెళ్ళిపోతుంది. హీరోయిన్ తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి తన కూతురు చచ్చిపోయిందంటూ వెళ్ళిపోతారు. అప్పుడు ఆమెకు హీరో తోడు అవుతాడు. తనని మోడరన్ గర్ల్ గా మారుస్తాడు.

ఆమె  అందాన్ని చూసి ఆఫీసులో అభిమన్యు అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అయితే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఆమెకు దినకర్మలు కూడా చేసి ఉంటారు. ఇది తెలుసుకున్న పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటారు. ఈ బాధలో మరింత డిప్రెషన్ లోకి వెళ్తుంది హీరోయిన్. అదే సమయంలో బాధ పోగొట్టుకోవడానికి హీరోతో ఏకాంతంగా గడుపుతుంది. హీరో కూడా తనని బాగా ప్రేమిస్తాడు. హీరోయిన్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుందని తెలుస్తుంది. ఇది తెలుసుకున్న హీరోయిన్, హీరోకి చెప్పకుండా వెళ్ళిపోతుంది. చివరికి హీరోయిన్ కి పెళ్లవుతుందా? హీరో తన ప్రేమను హీరోయిన్ కి చెప్తాడా? ఆమె జబ్బు నయమవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘సనమ్ తేరి కసమ్’ (Sanam Teri Kasam) అనే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×