E-Paper
Advertisement

Sankranthi Movies : 2026 పొంగల్ మూవీస్ ఏయే ఓటీటీలలోకి రాబోతున్నాయో తెలుసా..?

Sankranthi Movies : 2026 పొంగల్ మూవీస్ ఏయే ఓటీటీలలోకి రాబోతున్నాయో తెలుసా..?
Advertisement

Sankranthi Movies : ప్రతి ఏడాది సంక్రాంతి పండగకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ పండుగకు వచ్చిన సినిమాలు ఒక నెల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తాయి. ఈ పొంగల్ కు ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఏ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

రాజాసాబ్..

హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం రాజా సాబ్.. జనవరి 9న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా స్టోరీ ఎలా ఉన్నా సరే ప్రభాస్ సినిమా కావడంతో కలెక్షన్లు కూడా భారీగానే వసూల్ అయ్యాయి.. ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఏ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది..ఫిబ్రవరి తొలి వారంలోనే జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..

మన శంకర వరప్రసాద్ గారు..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తరికెక్కిన తాజా చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు.. ఇందులో హీరోయిన్ గా నయనతార నటించింది.. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కోట్లు రాబడుతుంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఫిబ్రవరి రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి..

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజ్ అయింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది.. ఈ మూవీ కూడా ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి ఈ నెలలోనే ఈ సినిమా కూడా స్ట్రీమింగ్ రాబోతుంది.

అనగనగా ఒక రాజు..

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలీస్ సిటీ నటించిన అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14న థియేటర్లలోకి వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం కామెడీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.. నెట్‌ఫ్లిక్స్ చేతికి వెళ్లింది. ఈ చిత్రం ఫిబ్రవరి మూడో వారంలో స్ట్రీమింగ్ కు రాబోతుందని సమాచారం

నారీ నారీ నడుమ మురారీ..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి… జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా వసూలుసునమే సృష్టిస్తుంది. రోజురోజుకీ కలెక్షన్లను పెంచుకుంటూ వస్తున్న మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుందని సమాచారం..

Also Read : అడ్డంగా దొరికిపోయిన మృణాల్, ధనుష్..ఆ రూమర్స్ నిజమేనా..?

మొత్తానికి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమాలు కూడా 30 రోజులలో పే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇక్కడ పాజిటివ్ టాక్ ని అందుకున్న సినిమాలు అక్కడ ఎలాంటి టాక్ ని అందుకుంటాయో చూడాలి..

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×