Dhanush – Mrunal : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.. ధనుష్ కేవలం తమిళ సినిమాలలో మాత్రమే కాదు ఇటు తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ ఉంది. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే.. ధనుష్ టాలీవుడ్ హీరోయిన్ రుణాలు ఠాగూర్ రిలేషన్ లో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ వార్తలకు ఆద్యం పోస్తూ తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈ రూమర్స్ నిజమేనా అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటోల మ్యాటర్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
కోలీవుడ్ హీరో ధనుష్, టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద చర్చ నడుస్తుంది. కానీ మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూ లో మేము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పడంతో కొంతమేరకు వీళ్ళ మధ్య రిలేషన్ ఉంది అనే వార్తలకు చెక్ పడింది. ఈ మధ్య వీరిద్దరి ప్రవర్తన కాస్త తేడాగా ఉండటంతో నిజంగానే వీరిద్దరూ కూడా రిలేషన్ లో ఉన్నారని అందరు అనుకున్నారు. ఇకపోతే ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా బలమైన ప్రచారం జరుగుతోంది.. తాజాగా వీరిద్దరి కలిసి ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు..
Also Read: బాక్సాఫీస్ వద్ద ‘శంకర వరప్రసాద్’ రికార్డుల మోత..500 కోట్లు రాబడుతుందా..?
హీరో ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 2025 లో ఆయన నటించిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ముఖ్యంగా కుబేర సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. భారీ కలెక్షన్లను కూడా అందుకోవడంతో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సౌత్ సినిమాలతో పాటుగా నార్త్ సినిమాలలో కూడా ధనుష్ నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇక మృణాల్ ఠాకూర్ కూడా వరుసగా భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా గడుపుతుంది.. సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుర్రకారుకు మతి పోగొట్టేలా ఫోటో షూట్ చేస్తుంది.
Is this movie scene ?
Or
Confirming the rumors? 🤔#dhanushmrunal #Dhanush #MrunalThakur https://t.co/GtKZTHj3a8 pic.twitter.com/YNPdMsSMGr
— Impactful Insights (@ImpactfulIn) January 16, 2026