E-Paper
Advertisement

విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Sathi Leelavathi: టాలీవుడ్ అందాల నటి లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అయితే, థియేట్రికల్ రన్ ముగియకముందే ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిజిటల్ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.

Read also-జిమ్‌లో మెగాస్టార్ విశ్వరూపం.. ‘మెగా 158’ ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. బాబితో మరో క్రేజీ ప్రాజెక్ట్..

ఈనెల 20న ‘సన్ నెక్స్ట్’లో ..

Advertisement

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సన్ నెక్స్ట్’ (Sun NXT) ‘సతీ లీలావతి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 20వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళ భాషలో కూడా ఈ సినిమా ఒకేసారి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన వారికి మరియు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇష్టపడే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

రెండు వారాలకే డిజిటల్ ఎంట్రీ!

సాధారణంగా పెద్ద సినిమాలు, క్రేజీ ప్రాజెక్ట్‌లు థియేటర్లలో విడుదలైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ, ‘సతీ లీలావతి’ చిత్రం మాత్రం విడుదలైన కేవలం రెండు వారాల వ్యవధిలోనే డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేస్తుండటం విశేషం. ఈ మధ్య కాలంలో ఇంత వేగంగా ఒక సినిమా ఓటీటీలోకి రావడం సినిమా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Advertisement

‘ఎస్‌ఎమ్‌ఎస్’ (SMS), ‘భీమిలి కబడ్డీ జట్టు’ వంటి వినూత్న సినిమాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చాలా కాలం తర్వాత ఆయన పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్‌ల కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Read also-సీఎం విజయ్‌కు హీరో విశాల్ బహిరంగ లేఖ.. ఆ మూడు డిమాండ్లు ..

వీరితో పాటు సౌత్ స్టార్ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో మెరిసింది. ఇక సీనియర్ నటుడు నరేశ్, కామెడీ టైమింగ్‌తో నవ్వించే వీటీవీ గణేశ్, టాలీవుడ్ హిలేరియస్ నటుడు సప్తగిరి తదితరులు తమదైన నటనతో సినిమాలో మంచి వినోదాన్ని పంచారు.

సకుటుంబ సమేతంగా నవ్వుకునేలా, నేటి తరం రిలేషన్‌షిప్స్‌ను ఎంటర్టైనింగ్ వేలో చూపించిన ‘సతీ లీలావతి’ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. థియేటర్లలో చూడలేకపోయిన ఫ్యామిలీ ఆడియన్స్, రొమాంటిక్ కామెడీ ప్రియులు ఈనెల 20 నుంచి ‘సన్ నెక్స్ట్’లో ఈ క్రేజీ రైడ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×