E-Paper
Advertisement

Scarpetta OTT release date: ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌ కు చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్… స్ట్రీమింగ్ కొత్త సిరీస్ సిద్ధం

Scarpetta OTT release date: ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌ కు చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్… స్ట్రీమింగ్ కొత్త సిరీస్ సిద్ధం
Advertisement

Scarpetta OTT release date: ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలని అనుకుంటున్నారా ? అయితే త్వరలోనే ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్న ఈ సిరీస్ ను దృష్టిలో పెట్టుకోండి. ఎప్పటిలా క్రైమ్, ఛేజ్ కాకుండా యూనిక్ స్టోరీతో వర్త్ వాచింగ్ అన్పించేలా రూపొందుతున్న ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి. మరి ఇంతకీ ఈ క్రేజీ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? సిరీస్ పేరేంటి ? ఎక్కడ, ఎప్పుడు చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘స్కార్పెట్టా’ (Scarpetta) గురించే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2026 మార్చి 11న కాబోతోంది ఈ సిరీస్. ఇది ప్యాట్రిసియా కార్న్‌వెల్ రాసిన ప్రసిద్ధ పుస్తక సిరీస్ ఆధారంగా రూపొందింది. ఈ పుస్తక శ్రేణిలో మొత్తం 29 టైటిల్స్ ఉన్నాయి. సిరీస్‌ ను లిజ్ సర్నాఫ్ డెవలప్ చేశారు. మొదటి సీజన్‌లో 8 ఎపిసోడ్‌లు ఉంటాయి. అన్నీ ఒకేసారి విడుదల అవుతాయి. ట్రైలర్ ఫిబ్రవరి 11న విడుదలైంది. సిరీస్ ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ డాక్టర్ కే స్కార్పెట్టా చుట్టూ తిరుగుతుంది. ఇందులో నికోల్ కిడ్‌మాన్, జేమీ లీ కర్టిస్, సైమన్ బేకర్, బాబీ కన్నవాలే, అరియానా డెబోస్, రోజీ మెక్‌వెన్, అమాండా రిగెట్టి, సోసీ బేకన్, చార్లీ బి ఫోస్టర్, జానెట్ మోంట్‌గోమెరీ, స్టెఫానీ ఫరసీ, మైక్ వోగెల్ తదితరులు నటించారు.

Advertisement

Also Read : స్టార్టింగ్ నుంచే అలాంటి సీన్లు… స్లో పాయిజన్ లా ఎక్కే రా అండ్ రియల్ సిరీస్… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి

కథ ఏంటంటే ?

సిరీస్ రెండు టైమ్ లైన్స్ లో సాగుతుంది 1990ల చివరలో చిన్న వయసు డాక్టర్ స్కార్పెట్టా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్‌గా తన కెరీర్ మొదలు పెడుతుంది. ప్రస్తుతంలో ఆమె తన స్వస్థలానికి తిరిగి వచ్చి, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ గా ఉద్యోగం చేస్తుంది. ఆమె ఒక దారుణ హత్యను దర్యాప్తు చేస్తుంది. ఈ కొత్త కేసు ఆమె మొదటిసారి ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌ గా పని చేసినప్పుడు జరిగిన దారుణమైన సంఘటనలను గుర్తు చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న హత్యలను గతంలో చేసిన వ్యక్తే చేస్తున్నాడా ? అచ్చం అలాంటి హత్యలే చేస్తున్నది ఎవరు ? అసలు హీరోయిన్ గతంలో ఏం జరిగింది ? అన్నది సిరీస్ రిలీజ్ అయ్యాక చూడాల్సిందే. ఇందులో ఫోరెన్సిక్ సైన్స్, మెడికల్ డీటెయిల్స్ ను రియలిస్టిక్‌గా చూపించారు. ఫోరెన్సిక్ పాథాలజీ, సీరియల్ కిల్లర్ మిస్టరీ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Advertisement

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×