E-Paper
Advertisement

Crime Drama OTT : స్టార్టింగ్ నుంచే అలాంటి సీన్లు… స్లో పాయిజన్ లా ఎక్కే రా అండ్ రియల్ సిరీస్… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి

Crime Drama OTT : స్టార్టింగ్ నుంచే అలాంటి సీన్లు… స్లో పాయిజన్ లా ఎక్కే రా అండ్ రియల్ సిరీస్… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి
Advertisement

Crime Drama OTT : సీను సీనుకో ట్విస్ట్ తో ఆకట్టుకునే ఇంట్రెస్టింగ్ జానరే క్రైమ్ థ్రిల్లర్. ముఖ్యంగా మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లో ఉండే ఇంటెన్స్ సస్పెన్స్ మూవీ మొదటి నుంచి చివరిదాకా ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందుకే చాలామంది కాస్త టైమ్ దొరికితే చాలు ఇలాంటి సినిమాలు చూడాలి అనుకుంటారు. మీకు కూడా ఈ జానర్లో వచ్చిన ఒక బెస్ట్ థ్రిల్లర్ ను చూడాలని ఉందా ? అయితే ఖచ్చితంగా ఇది మీ కోసమే. మరి ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

పంజాబీ-హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కోహ్రా’ (Kohrra). 2023లో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైన ఈ సిరీస్‌కు రిషభ్ రాజ్ గుప్తా, సుధీర్ మిశ్రా దర్శకత్వం వహించారు. బరున్ సోబ్తి, వివేక్ చౌధరి, బర్బర్ బ్రార్, రవీనా టాండన్, హర్ష్‌వర్ధన్ రాణే, ప్రధాన పాత్రలు పోషించారు. ఇది పంజాబ్ నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ సిరీస్. మొత్తం 6 ఎపిసోడ్‌లతో ఉండే ఈ సిరీస్ పంజాబ్ గ్రామీణ జీవితం, సామాజిక సమస్యలు, డ్రగ్స్, కుటుంబ బంధాలు, నేరాలు వంటి అంశాలతో సాగుతుంది. IMDbలో 8.3/10 రేటింగ్ పొందిన ఈ సిరీస్ కు క్రిటిక్స్ తో పాటు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా సీజన్ 2 కూడా ఓటీటీలోకి అడుగు పెట్టింది. అంతకంటే ముందు మొదటి సీజన్ పై ఒక లుక్కేయండి. అయితే ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే అనేది మరచిపోవద్దు.

Advertisement

Also Read : దేవుణ్ణి నమ్మని వాళ్ళని బలి తీసుకునే దెయ్యాలు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ పంజాబ్‌ లోని ఒక గ్రామంలో జరుగుతుంది. గురుదాస్ (బర్బర్ బ్రార్) అనే యువకుడు తన పెళ్లి రోజు రాత్రి మిస్ అవుతాడు. మరుసటి రోజు అతని శవం ఓ బావిలో దొరుకుతుంది. ఈ మర్డర్ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు గార్ద్ సింగ్ (బరున్ సోబ్తి), హర్పాల్ (వివేక్ చౌధరి) రంగంలోకి దిగుతారు. కేసు మొదట్లో సాధారణంగానే కనిపిస్తుంది. ఎవరైనా శత్రువు చంపి ఉండవచ్చు అనుకుంటారు. కానీ ఇన్వెస్టిగేషన్ లోతుగా వెళ్లే కొద్దీ ఊహించని ట్విస్టులు ఉంటాయి.

Advertisement

గురుదాస్ భార్య మన్‌ప్రీత్ (రవీనా టండన్), ఆమె కుటుంబం, గురుదాస్ తండ్రి, స్నేహితులు, గ్రామస్తులు… ఒక్కటేమిటి అతని జీవితంలో అన్నీ రహస్యాలే. ఈ కేస్‌లో డ్రగ్స్, గ్యాంగ్ వార్, కుటుంబ గౌరవం, ప్రేమ, ద్వేషం, రాజకీయాలు అన్నీ ముడిపడి ఉంటాయి. మరోవైపు పోలీస్ ఆఫీసర్ గార్ద్ సింగ్ తన ఫ్యామిలీ సమస్యలతో పోరాడుతూనే కేస్‌ ను సాల్వ్ చేయాలని ప్రయత్నిస్తాడు. మరి చివరికి గురుదాస్ చావుకి కారణం ఎవరో కనిపెట్టారా లేదా ? అసలు అతన్ని ఎందుకు చంపారు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది సిరీస్ ను చూసి తెలుస్కోవాల్సిందే.

 

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×